స‌హ‌కారం అందించినందుకు, స‌మైక్య ప్ర‌య‌త్నాలు చేసినందుకు రాష్ట్రాల ను ప్ర‌శంసించిన ప్ర‌ధాన మంత్రి
స‌హ‌కారం అందించినందుకు, స‌మైక్య ప్ర‌య‌త్నాలు చేసినందుకు రాష్ట్రాల ను ప్ర‌శంసించిన ప్ర‌ధాన మంత్రి
సాధ్య‌మైన అన్ని విధాలు గా సాయాన్ని అందించినందుకు ప్ర‌ధాన మంత్రి కి ముఖ్య‌మంత్రులు ధ‌న్య‌వాదాలు తెలిపారు
మ‌హారాష్ట్ర లో, కేర‌ళ లో కేసులు పెరుగుతూ ఉన్న ధోర‌ణి ఆందోళ‌న క‌లిగిస్తోంది: ప్ర‌ధాన మంత్రి
టెస్ట్, ట్రాక్‌, ట్రీట్‌, టీకా అనేది ప‌రీక్ష కు నిల‌చిన, నిరూప‌ణ అయిన వ్యూహం గా ఉంది: ప్ర‌ధాన మంత్రి
థ‌ర్డ్ వేవ్ రావ‌డాన్ని అడ్డుకోవ‌డానికి మ‌నం ఎంతో ముందుగానే చ‌ర్య‌లు తీసుకోవాలి: ప్ర‌ధాన మంత్రి
మౌలిక‌మైన‌టువంటి అంత‌రాల ను, ప్ర‌త్యేకించి గ్రామీణ ప్రాంతాల లో ఈ విధ‌మైన‌ లోటుల ను భ‌ర్తీ చేయాలి: ప్ర‌ధాన మంత్రి

కోవిడ్ కు సంబంధించిన స్థితి ని గురించి చ‌ర్చించ‌డం కోసం ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌మిళ నాడు, ఆంధ్ర ప్ర‌దేశ్‌, క‌ర్నాట‌క‌, ఒడిశా, మ‌హారాష్ట్ర, కేర‌ళ ల ముఖ్య‌మంత్రుల తో స‌మావేశ‌మ‌య్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈ స‌మావేశం లో పాల్గొన్నారు. కోవిడ్ ను ఎదుర్కోవ‌డం లో సాధ్య‌మైన అన్ని విధాలు గాను సాయాన్ని అందించిన ప్ర‌ధాన మంత్రి కి ముఖ్య‌మంత్రులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. వారి వారి రాష్ట్రాల లో వైర‌స్ వ్యాప్తి ని క‌ట్ట‌డి చేయడం కోసం తీసుకొంటున్న‌ చ‌ర్య‌ల ను గురించి, పౌరుల కు టీకా మందు ఇప్పించే కార్య‌క్ర‌మం లో పురోగ‌తి ని గురించి ప్ర‌ధాన మంత్రి దృష్టి కి ముఖ్య‌మంత్రులు తీసుకు వ‌చ్చారు. పౌరుల కు టీకా మందు ఇప్పించే వ్యూహాని కి సంబంధించిన క్షేత్ర స్థాయి స్పంద‌న ను కూడా వారు తెలియ‌ జేశారు.

 

రంగం లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న ను పెంచ‌డం కోసం తీసుకొన్న చ‌ర్య‌ల ను గురించి ముఖ్య‌మంత్రులు మాట్లాడారు. భ‌విష్య‌త్తు లో కేసు లు ఒకవేళ పెరిగేటట్లయితే ఆ స్థితి ని ఎదుర్కోవ‌డం పై వారు వారి సూచ‌న‌ల ను తెలియజేశారు. కోవిడ్ న‌య‌మైన త‌రువాత రోగుల కు ఎదురవుతున్న సమస్యల ను గురించి, ఆ త‌ర‌హా కేసుల లో సహాయాన్ని అంద‌జేయడం కోసం తీసుకొంటున్న చర్యల ను కూడా ముఖ్య‌మంత్రులు చ‌ర్చించారు. సంక్ర‌మ‌ణ ఉధృతి ని నియంత్రించ‌డం కోసం త‌మ వంతు గా శాయ‌శ‌క్తుల కృషి చేస్తున్న‌ట్లు వారు బరోసానిచ్చారు.

జులై నెల లో మొత్తం కేసుల లో 80 శాతాని కి పైగా ఈ ఆరు రాష్ట్రాల లోనే తలెత్తాయని, ఈ రాష్ట్రాలు కొన్నిటి లో ఫలితం పాజిటివ్ గా వచ్చిన కేసుల రేటు కూడా చాలా ఎక్కువ‌ గా ఉంద‌ని కేంద్ర హోం మంత్రి తెలిపారు. దేశం లో కోవిడ్ కేసుల ను గురించి కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి వివరిస్తూ, కేసు లు ఎక్కువ‌ గా ఉన్నటువంటి జిల్లాల లో క‌ట్ట‌డి చ‌ర్య‌ల ను తీసుకోవాల‌ని, కోవిడ్ ను దృష్టి లో పెట్టుకొని ఏర్పరచినటువంటి నియమావళి ని పౌరులు స‌రి అయిన విధం గా పాటించేటట్లు గా చూడాలని ఆయన అన్నారు. ఈ జిల్లాల‌ లో ఆంక్ష‌లు స‌డ‌లింపు ను దశల వారీ గా ఒక క్ర‌మ ప‌ద్ధ‌తి లో చేప‌ట్టాల‌ని కూడా ఆయ‌న సల‌హా ఇచ్చారు.

స‌మావేశం ముగింపు లో ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, మ‌హ‌మ్మారి కి వ్య‌తిరేకం గా పోరాడ‌టం లో రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో నడచుకొన్నందుకు, (స‌వాలు ను ఎదుర్కోవ‌డం లో పాఠాల ను) నేర్చుకొన్నందుకు రాష్ట్ర ప్ర‌భుత్వాల ను కొనియాడారు. థ‌ర్డ్ వేవ్ ను గురించిన భ‌యాందోళన లు ప‌దే ప‌దే వ్య‌క్తం అవుతూ ఉన్న సంద‌ర్భం లో ప్ర‌స్తుతం మ‌నం అంద‌రం ఉన్నాం అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. వ్యాధి త‌గ్గుముఖం ప‌డుతూ ఉన్నందువ‌ల్ల నిపుణులు సానుకూల సంకేతాల ను వెలువ‌రిస్తున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల లో కేసు ల సంఖ్య లో వృద్ధి ఇప్ప‌టికీ ఇంకా బాధను కలిగిస్తోంది. కిందటి వారం లో 80 శాతం కేసు లు, అలాగే దుర‌దృష్ట‌వశాత్తు 84 శాతం వ‌ర‌కు వాటిల్లిన మ‌ర‌ణాలు స‌మావేశానికి హాజ‌రైన రాష్ట్రాల నుంచే వ‌చ్చాయి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. సెకండ్ వేవ్ ఉత్పన్నం అయినటువంటి రాష్ట్రాల లోనే సాధార‌ణ స్థితి ముందుగా చోటు చేసుకొంటుంది అంటూ నిపుణులు మొదట విశ్వ‌సించార‌ని, అయితే కేరళ లో, మ‌హారాష్ట్ర లో అధికం గా న‌మోదు అవుతున్న సంఖ్య‌ లు తీవ్ర క్లేశాన్ని క‌లిగిస్తున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

అదే త‌ర‌హా ధోర‌ణుల ను సెకండ్ వేవ్ క‌న్నా ముందు జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి నెల‌ల్లో పొడసూపాయ‌ని ప్ర‌ధాన మంత్రి హెచ్చ‌రిక చేశారు. అందువ‌ల్లనే, కేసు లు పెరుగుతున్నటువంటి రాష్ట్రాల లో, మ‌నం థ‌ర్డ్ వేవ్ అనేది రాకుండా చూడ‌టానికి గాను ముందుగానే జాగ్ర‌త చ‌ర్య‌ల ను తీసుకోవాలి అని ప్ర‌ధాన మంత్రి నొక్కి చెప్పారు.

కేసు లు దీర్ఘ‌కాలం పాటు పెరుగుతూ పోయిన‌ట్ల‌యితే గ‌నుక క‌రోనా వైర‌స్ రూపు ను మార్చుకొనేందుకు అవ‌కాశాలు కూడా ముమ్మ‌రం అవుతాయని, కొత్త కొత్త ర‌కాల వైర‌స్ లు బ‌య‌లుదేరే అపాయం కూడా త‌ప్ప‌దు అన్నది నిపుణుల అభిప్రాయ‌ం అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ కార‌ణం గా మ‌నం ‘టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్, టీకా’ వ్యూహాన్ని అమ‌లుపరుస్తూ ప‌య‌నించ‌వ‌ల‌సి ఉంద‌ని, మైక్రో కంటెయిన్ మెంట్ జోన్ ల పైన ప్ర‌త్యేక శ్ర‌ద్ధ ను తీసుకోవాల‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. పెద్ద సంఖ్యలు న‌మోదు అవుతున్నటువంటి జిల్లాల పైన దృష్టి ని సారించాల‌ని కూడా ఆయన అన్నారు. ఈ రాష్ట్రాలు అన్నింటా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ను పెంచాల‌ని శ్రీ న‌రేంద్ర మోదీ స్ప‌ష్టం చేశారు. సంక్ర‌మ‌ణ అధికం గా ఉన్న ప్రాంతాల లో టీకా మందు ఒక వ్యూహాత్మ‌క‌మైన సాధ‌న‌ం అని ప్ర‌ధాన మంత్రి అభివ‌ర్ణిస్తూ, పౌరుల‌ కు టీకామందు ను ఇప్పించే కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భావ‌వంత‌మైన రీతి లో ఉప‌యోగించుకోవాల‌ని ఉద్ఘాటించారు. ఈ కాలాన్ని ఆర్‌టి-పిసిఆర్ ప‌రీక్ష‌ ల సామ‌ర్ధ్యాన్ని మెరుగు ప‌ర‌చుకొనేందుకు ఉప‌యోగించుకొంటున్న రాష్ట్రాల‌ ను ప్ర‌ధాన‌ మంత్రి పొగిడారు.

ఐసియు ప‌డ‌క‌ లు, ప‌రీక్ష ల నిర్వ‌హ‌ణ సామ‌ర్ధ్యం వంటి వైద్య రంగ మౌలిక స‌దుపాయాల ను పెంచుకోవ‌డం కోసం ఆర్థిక స‌హాయం అందిస్తుండటాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడారు. ఇటీవ‌ల ఆమోదించిన 23,000 కోట్ల రూపాయ‌ల విలువైన కోవిడ్ సంబంధి అత్య‌వ‌స‌ర ప్ర‌తిస్పంద‌న సంబంధిత ప్యాకేజీ ని ఆయన ప్రస్తావించి, వైద్య రంగ మౌలిక సదుపాయాల ను బలోపేతం చేసుకొనేందుకు ఈ నిధుల ను వినియోగించుకోవ‌ల‌సిందంటూ రాష్ట్రాల ను కోరారు.

మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న ప‌రం గా ఉన్న అగాథాన్ని భ‌ర్తీ చేయాల‌ని, ప్ర‌త్యేకించి గ్రామీణ ప్రాంతాల లో గల ఈ లోటు ను పూడ్చాల‌ని రాష్ట్రాల‌ కు ప్ర‌ధాన మంత్రి ఉద్బోధించారు. ఐటి సిస్ట‌మ్స్ ను, కంట్రోల్ రూమ్స్ ను, కాల్ సెంట‌ర్స్ ను ప‌టిష్టం చేయాల‌ని ఆయన కోరారు. అది జ‌రిగిన‌ప్పుడు పౌరులు స‌మాచారాన్ని, వ‌న‌రుల ను పార‌ద‌ర్శ‌క‌మైన ప‌ద్ధ‌తి లో అందుకోగ‌లుగుతార‌ని, రోగుల కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌న్నారు. స‌మావేశం లో పాల్గొన్న రాష్ట్రాల కు కేటాయించిన 332 పిఎస్ఎ ప్లాంటుల‌ లో 53 ప్లాంటుల ను వినియోగించ‌డం ఇప్ప‌టికే ఆరంభం అయిందని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ప్లాంటు ల ఏర్పాటు త్వరగా పూర్తి అయ్యేలా చూడండి అని ముఖ్య‌మంత్రుల‌ కు ఆయ‌న విజ్ఞప్తి చేశారు. అంటువ్యాధి బాలల కు సోక‌కుండా వారిని కాపాడుకోవ‌ల‌సిన అవ‌స‌రాన్ని గురించి ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌త్యేకం గా ప్రస్తావిస్తూ, ఈ విష‌యం లో సాధ్య‌మైన అన్ని ఏర్పాటుల ను చేయాలి అన్నారు.

యూరోప్, అమెరికా, బాంగ్లాదేశ్‌, ఇండోనేశియా, థాయిలాండ్ ల‌తో పాటు మ‌రెన్నో దేశాల‌ లో కేసుల సంఖ్య పెరుగుతోంది అంటూ ప్ర‌ధాన మంత్రి ఆందోళ‌న ను వెలిబుచ్చారు. ఈ ప‌రిణామం మ‌న‌లను, ప్ర‌పంచాన్ని చైత‌న్యప‌ర‌చాలి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

క‌రోనా ముగిసిపోలేదు అని ప్ర‌ధాన మంత్రి పున‌రుద్ఘాటించారు. లాక్‌డౌన్ ను స‌డ‌లించిన త‌రువాత మ‌న ముందుకు వ‌స్తున్న చిత్రాల ప‌ట్ల ఆయ‌న తీవ్ర ఆవేద‌న ను వ్య‌క్తం చేశారు. నియ‌మాల‌ ను పాటించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉందని, జనం గుంపులు గా చేరకుండా చూడాలని, ఎందుకంటే జ‌న సాంద్ర‌త కలిగిన మెట్రోపాలిట‌న్ న‌గ‌రాలు ఈ స‌మావేశం లో పాల్గొన్న రాష్ట్రాల లో భాగం గా ఉన్నాయని ఆయ‌న నొక్కి చెప్పారు. ప్ర‌జ‌ల లో జాగృతి ని విస్త‌రింప చేయ‌వ‌ల‌సిందిగా రాజ‌కీయ ప‌క్షాల కు, సాంఘిక సంస్థ‌ల‌ కు, ఎన్‌జిఒ ల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi