If we work as one nation, there will not be any scarcity of resources: PM
Railways and Airforce being deployed to reduce travel time and oxygen tankers: PM
PM requests states to be strict with hoarding and black marketing of essential medicines and injections
Centre has provided more than 15 crore doses to the states free of cost: PM
Safety of hospitals should not be neglected: PM
Awareness must be increased to alleviate panic purchasing: PM

ఇటీవల గరిష్ఠ సంఖ్య లో కేసులు నమోదు అయిన 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య మంత్రుల తో కోవిడ్-19 స్థితి పై జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.  

వైరస్ అమాంతం రెండో అంచె నగరాలు, మూడో అంచె నగరాల తో సహా అనేక రాష్ట్రాల పై ప్రభావాన్ని చూపుతోందని గమనించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ మహమ్మారి తో సామూహిక బలాన్ని ఉపయోగించి కలసికట్టుగా పోరాడదామంటూ పిలుపునిచ్చారు.  మహమ్మారి ఒకటో దశ లో భారతదేశం సాధించిన సాఫల్యానికి మన ఉమ్మడి ప్రయాస లు, సమష్టి వ్యూహం అతి పెద్ద మూల కారణం అని ఆయన చెప్తూ, ఈ సవాలు ను మనం ఇదే పద్ధతి లో పరిష్కరించాలి అన్నారు.

ఈ పోరాటం లో అన్ని రాష్ట్రాల కు కేంద్ర పూర్తి మద్దతు ను ఇస్తుంది అని ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు.  రాష్ట్రాల తో ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతూ, స్థితి ని సన్నిహితంగా పర్యవేక్షిస్తోంది, ఎప్పటికప్పుడు రాష్ట్రాల కు అవసరమైనటువంటి సూచనల ను, సలహాల ను అందిస్తోంది అని కూడా ఆయన అన్నారు.

ఆక్సీజన్ సరఫరా పై, రాష్ట్రాలు ప్రస్తావించిన అంశాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధ గా ఆలకించారు.  ఆక్సీజన్ సరఫరా ను పెంచడం కోసం అదే పని గా కృషి జరుగుతోంది అని ఆయన అన్నారు. ప్రభుత్వం లోని సంబంధిత మంత్రిత్వ శాఖలు, సంబంధిత విభాగాలు ఒక్కటై పాటుపడుతున్నాయన్నారు.   పరిశ్రమల లో ఉపయోగించే ఆక్సీజన్ ను కూడా తక్షణ అవసరాల ను తీర్చడం కోసం మళ్లించడం జరుగుతోందన్నారు.

మందుల కు, ఆక్సీజన్ కు సంబంధించిన అవసరాల ను నెరవేర్చడం కోసం రాష్ట్రాలు అన్నీ కూడా కలసికట్టుగా పనిచేయాలి, ఒక రాష్ట్రం తో మరొక రాష్ట్రం సమన్వయాన్ని నెలకొల్పుకోవాలి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞ‌ప్తి చేశారు.  ఏ ఆక్సీజన్ ట్యాంకరు – అది ఏ రాష్ట్రానికి ఉద్దేశించింది అయినప్పటికీ-  మార్గమధ్యం లోనే దానిని ఆపివేయడమో, లేదా దారి లో అది చిక్కుకోవడమో జరగకుండా ప్రతి ఒక్క రాష్ట్రం శ్రద్ధ తీసుకోవాలి అని ప్రధాన మంత్రి అన్నారు.

ఆక్సీజన్ ను రాష్ట్రం లోని వివిధ ఆసుపత్రుల కు తీసుకు పోవడం కోసం ఒక ఉన్నత స్థాయి సమన్వయ సంఘాన్ని ఏర్పాటు చేయవలసిందిగా అని రాష్ట్రాల ను ప్రధాన మంత్రి కోరారు.  కేంద్రం నుంచి ఆక్సీజన్ కేటాయింపు జరిగిన వెను వెంటనే, ఆ ఆక్సీజన్ ను అవసరం మేరకు రాష్ట్రం లోని వివిధ ఆసుపత్రుల కు బట్వాడా అయ్యే విధంగా ఈ సమన్వయ సంఘం పూచీ పడాలి అన్నారు.  ఆక్సీజన్ సరఫరా అంశం పై నిన్నటి రోజు న జరిగిన ఒక సమావేశానికి తాను అధ్యక్షత వహించినట్లు, ఆక్సీజన్ సరఫరా ను పెంచేందుకు గల అన్ని ఐచ్ఛికాలను గురించి చర్చించడం కోసం ఈ రోజు న మరొక సమావేశానికి హాజరు కానున్నట్లు ముఖ్యమంత్రుల కు ప్రధాన మంత్రి తెలియజేశారు.

ఆక్సీజన్ ట్యాంకర్ ల ప్రయాణ సమయాన్ని, వాటి రాకపోకల కు పట్టే కాలాన్ని తగ్గించడం కోసం సాధ్యమైనటువంటి అన్ని రకాల ఐచ్ఛికాల పైన కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.  దీనికై, ఆక్సీజన్ ఎక్స్ ప్రెస్ ను రైల్వేస్ ఆరంభించినట్లు ఆయన చెప్పారు.  ఖాళీ అయిన ఆక్సీజన్ ట్యాంకర్ లను కూడా- వాటి ఒక వైపు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు- వాయు సేన ద్వారా చేరవేయడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి వివరించారు.

వనరుల ఉన్నతీకరణ కు తోడు గా, పరీక్షలు చేయించడం పైన మనం శ్రద్ధ వహించవలసి ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.  పరీక్షల నిర్వహణ ను విస్తృత స్థాయి కి చేర్చాలి, అది జరిగితే, ప్రజలు పరీక్ష సదుపాయాన్ని సులభం గా అందుకోగలుగుతారు అని ఆయన స్పష్టం చేశారు.  

టీకాల ను వేయించేందుకు మనం చేపట్టినటువంటి కార్యక్రమం ఈ స్థితి లో నెమ్మదించ కూడదు అని ప్రధాన మంత్రి అన్నారు.  భారతదేశం ప్రపంచం లోనే అతి పెద్ద టీకాకరణ కార్యక్రమాన్ని నడుపుతోంది, మరి ఇంతవరకు 15 కోట్ల కు పైగా టీకా మందు డోసుల ను రాష్ట్రాల కు ఉచితం గా భారత ప్రభుత్వం సమకూర్చింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.  ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల కు, ఫ్రంట్ లైన్ వర్కర్ లకు, అలాగే 45 ఏళ్ల వయస్సు పైబడిన పౌరులు అందరికీ ఉచితం గా వ్యాక్సీన్ ను అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన కార్యక్రమం కూడా అదే విధం గా కొనసాగుతుంది అని  ప్రకటించారు.  18 ఏళ్ల వయస్సు పైబడిన పౌరులు అందరికీ  మే నెల ఒకటో తేదీ నాటి నుంచి టీకా మందు అందుబాటు లోకి వస్తుంది అని కూడా ఆయన తెలిపారు.  వీలయినంత ఎక్కువ మంది టీకా మందు ను పొందే లాగా మనం ఉద్యమ తరహా లో శ్రమించవలసిన అవసరం కూడా ఉంది అని ఆయన అన్నారు.

రోగుల చికిత్స కు అన్ని చర్యలను తీసుకోవడం తో పాటు, ఆసుపత్రుల లో సురక్షత కూడా చాలా ముఖ్యం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  ఆక్సీజన్ లీకేజి తాలూకు ఇటీవలి ఘటన ల పట్ల, ఆసుపత్రుల లో మంటలు రేగడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేస్తూ, భద్రత సంబంధి ప్రోటోకాల్స్ విషయం లో ఆసుపత్రి పాలన సిబ్బంది కి మరింత అధిక జాగృతి ని కలిగించవలసిన అవసరం ఎంతయినా ఉందన్నారు.

ప్రజలు గాభరా తో కొనుగోళ్ల కు ఒడిగట్టకుండా పాలన యంత్రాంగం ప్రజల ను ఎల్లప్పటికీ చైతన్యవంతులను చేస్తూ ఉండాలి అని కూడా ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.  మనం సమష్టి ప్రయాసల తో మహమ్మారి రెండో వేవ్ దేశం అంతటా విస్తరించకుండా అడ్డుకోగలుగుతాం అని ఆయన అన్నారు.

అంతక్రితం, సంక్రమణ ల కొత్త ఉధృతి ని నిలువరించడం కోసం చేపడుతున్న సన్నాహక చర్యల ను వివరించే ఒక నివేదిక ను డాక్టర్ వి.కె. పాల్ సమావేశానికి సమర్పించారు.  వైద్య సదుపాయాల ను పెంచడానికి, అలాగే రోగుల కు లక్షిత చికిత్స ను అందించడానికి సంబంధించిన ఒక మార్గ సూచీ ని కూడా డాక్టర్ పాల్ సమావేశానికి నివేదించారు.  వైద్య పరమైనటువంటి మౌలిక సదుపాయాల ను, వైద్య బృందాల ను, సరఫరా లను పెంపొందించడం, రోగ చికిత్స సంబంధి నిర్వహణ, కట్టడి, టీకా మందు ను ఇప్పించడం, సముదాయాల ను భాగస్వాముల ను చేయడం వంటి అంశాలను గురించిన వివరాలను ఆయన ప్రతి ఒక్కరికి  తెలియజేశారు.

సంభాషణ సాగిన క్రమం లో, ప్రస్తుత వేవ్ లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొంటున్న చర్యల ను గురించి ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు వచ్చారు.  ప్రధాన మంత్రి ఇచ్చిన ఆదేశాలు, ‘నీతి’ అందజేసిన మార్గ సూచీ తాము తమ ప్రతిస్పందనలను ఒక మెరుగైన పద్ధతి లో అమలుపరచడం లో తోడ్పాాటు ను అందించ గలుగుతాయన్న అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేశారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi