The nation has fought against the coronavirus pandemic with discipline and patience and must continue to do so: PM
India has vaccinated at the fastest pace in the world: PM Modi
Lockdowns must only be chosen as the last resort and focus must be more on micro-containment zones: PM Modi

దేశం లో కోవిడ్-19 స్థితిగతుల పై దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రసంగించారు.  ఇటీవలి కాలం లో మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాన మంత్రి సంతాపాన్ని ప్రకటించారు. ‘‘ఈ విషాద సమయం లో, మీ కుటుంబం లో ఒక సభ్యుని లాగా, మీ దు:ఖం లో నేను పాలుపంచుకొంటున్నాను.  సవాలు పెద్దది.. అయితే దీనిని మనం అందరం కలసి మన సంకల్పం తో, నిబ్బరం తో, సన్నాహాల తో దీనిని అధిగమించవలసి ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.  కరోనా కు వ్యతిరేకంగా యుద్ధం చేయడం లో వైద్యులు, వైద్య సిబ్బంది,  పారామెడికల్ స్టాఫ్, పారిశుధ్య కార్మికులు, ఏమ్ బ్యులన్స్ డ్రైవర్ స్, భద్రత దళాలు, రక్షక భట బలగాలు అందించిన తోడ్పాటు ను ఆయన ఎంతగానో కొనియాడారు.

దేశం లోని వివిధ ప్రాంతాల్లో ఆక్సీజన్ కోసం పెరుగుతున్న డిమాండు ను తీర్చేలా వేగంగాను, సరి అయిన అవగాహన తోను ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.  అవసరమున్న ప్రతి వ్యక్తి కీ ఆక్సీజన్ సరఫరా అయ్యే విధంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం శాయశక్తుల కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు.  ప్రాణవాయువు ఉత్పత్తి ని, సరఫరా ను మరింత పెంచడం కోసం వివిధ స్థాయులలో అన్నివిధాలుగాను ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు.  ఇందులో భాగంగా కొత్త ప్రాణవాయువు ఉత్పత్తి కర్మాగారాల ఏర్పాటు, లక్ష కొత్త సిలిండర్ ల లభ్యత, ఆక్సీజన్ ను పారిశ్రామిక వినియోగం నుంచి ఆసుపత్రులకు మళ్లించడం, ఆక్సీజన్ సరఫరా రైళ్లను నడపడం వంటి అనేక చర్యలు తీసుకొంటున్నామని ప్రధాన మంత్రి వివరించారు.

మన శాస్త్రవేత్త లు అత్యంత తక్కువ సమయం లో టీకా మందు ను అభివృద్ధిపరచారని, ప్రస్తుతం యావత్తు ప్రపంచం లో అత్యంత చౌక గా లభిస్తోంది భారతదేశం లో తయారైన టీకాయే అని ప్రధాన మంత్రి అన్నారు.  అంతేకాకుండా ఇది దేశీయం గా అందుబాటులో గల శీతల గిడ్డంగుల వ్యవస్థ లో నిలవ చేయడానికి వీలు ఉన్నటువంటి టీకా కావడం గమనించదగ్గది అని ఆయన అన్నారు.  ఈ ఉమ్మడి కృషి ఫలితంగానే స్థానికంగా తయారుచేసిన రెండు రకాల టీకాలతో భారతదేశం ప్రపంచంలోకెల్లా అతి పెద్ద టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని గుర్తుచేశారు.  టీకాలను ఇప్పించే కార్యక్రమం ఒకటో దశ ఆరంభం నాటి నుంచి గరిష్ఠ ప్రాంతాలకు, అవసరమైన మేరకు అత్యధిక ప్రజలకు టీకా చేరేటట్టు జాగ్రత్త వహించినట్లు తెలిపారు.  ప్రపంచం లో అన్ని దేశాల కంటే వేగం గా భారతదేశం లో 10 కోట్లు, తదుపరి 11 కోట్లు, మరి ఇప్పుడు 12 కోట్ల వ్యాక్సీన్ డోసుల ను ఇవ్వడం జరిగింది అని ఆయన అన్నారు.

టీకా మందు ను వేయించే కార్యక్రమానికి సంబంధించి నిన్నటి రోజు న తీసుకొన్న నిర్ణయాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, మే నెల ఒకటో తేదీ తరువాత నుంచి, దేశమంతటా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా మందు ను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.  దేశీయం గా తయారు అయ్యే టీకాల లో సగం టీకాల ను వివిధ రాష్ట్రాల కు, ఆసుపత్రుల కు నేరు గా సరఫరా చేయడం జరుగుతుంది అని అయన అన్నారు.  

ప్రజల ప్రాణాలను రక్షించడం సహా ఆర్థిక కార్యకలాపాలకు వెసులుబాటు తో ప్రజల జీవనోపాధి పై ప్రతికూల ప్రభావాన్ని ను కనిష్ఠ స్థాయి కి తగ్గించేలా చర్యలు చేపట్టామని ప్రధాన మంత్రి తెలిపారు.  దేశం లో 18 ఏళ్ల వయస్సు దాటిన వారందరికీ టీకా మందు ను ఇవ్వనున్నందున నగరాల లోని కార్మికశక్తి కి త్వరగా టీకా అందుబాటులోకి రాగలదన్నారు.  ఆయా రాష్ట్రాల కార్మికులు ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండేలా వారిలో విశ్వాస కల్పనకు ప్రభుత్వాలు  చర్యలు చేపట్టాలని ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.  ఈ విధంగా వారిలో నమ్మకం కల్పించడం ద్వారా కార్మికులకు, వలస కూలీలకు ఎక్కడ ఉన్న వారికి అక్కడ టీకా ఇవ్వడం లో దోహదం లభిస్తుంది అని ఆయన అన్నారు.  దీని వల్ల వారి జీవనోపాధి కి భంగం కలుగకుండా ఉంటుందని పేర్కొన్నారు.

మహమ్మారి ఒకటో దశ ఆరంభం లో ఎదుర్కొన్న సవాళ్ల తో పోలిస్తే, ఈ సవాలు ను ఎదుర్కోగల స్థాయి లో మనకు మరింత మెరుగైన ప‌రిజ్ఞానంతో పాటు వనరులు కూడా ఉన్నాయి అని ప్రధాన మంత్రి చెప్పారు.  చక్కని రీతి లో ఓరిమి తో మహమ్మారి పైన పోరు ను సాగించిన ఘనత ప్రజలదే అంటూ శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.  ప్రజల భాగస్వామ్యం ఇచ్చిన బలం తో రెండో దశ లోనూ కరోనా మహమ్మారి ని ఓడించగలుగుతాం అని ఆయన అన్నారు.  ప్రజలకు అవసరమైన ప్రతి సమయంలోనూ సేవలను అందిస్తున్న సామాజిక సంస్థ ల కృషి కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.  అదే తరహా లో ప్రతి ఒక్కరు ఇతరులకు సాయం అందించేందుకు ముందుకు రావాలి అంటూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.  ముఖ్యంగా యువతరం తమతమ ప్రాంతాల్లోని ఇరుగుపొరుగు వారు కోవిడ్ నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్త చర్యల ను తీసుకొనేటట్లు చూడడం లో వారికి తోడ్పాటు ను ఇవ్వాలి అంటూ ప్రధాన మంత్రి సూచించారు.  దీని వల్ల నియంత్రణ మండలాలు, కర్ఫ్యూ లు, లాక్ డౌన్ లు లేకుండా చూసుకోవచ్చు అన్నారు.  ఇళ్లలో నుంచి పెద్దలు అనవసరం గా బయటకు వెళ్లకుండా ఆయా కుటుంబాలలోని పిల్లలు తగిన వాతావరణాన్ని ఏర్పరచాలి అని ఆయన కోరారు.

ప్రస్తుత పరిస్థితులలో దేశాన్ని మనం లాక్ డౌన్ బారి నుంచి రక్షించాలి అని ప్రధాన మంత్రి అన్నారు.  దిగ్బంధాన్ని చిట్టచివరి పరిష్కారం గా మాత్రమే లాక్ డౌన్ ను చూడాలి అని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన విజ్ఞ‌ప్తి చేశారు.  మైక్రో కంటేన్ మెంట్ జోన్ ల ఏర్పాటు పైనే ప్రధానం గా దృష్టి ని కేంద్రీకరిస్తూ, లాక్ డౌన్ ను తప్పించడానికే మనమందరం వీలైనంత వరకు కృషి చేయాలి అని ప్రధాన మంత్రి అన్నారు.

Click here to read PM's speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi