ప్రియమైన నా దేశ వాసులారా,
ఒక దేశం గా, ఒక కుటుంబం గా మీరు మరియు మేము, మొత్తం గా మనము ఒక చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకొన్నాము. జమ్ము, కశ్మీర్ మరియు లద్దాఖ్ లోని మన సోదరులకు, మన సోదరీమణుల కు దక్కవలసిన హక్కుల ను ఒక వ్యవస్థ దక్కకుండా చేసింది. వారి అభివృద్ధి కి పెద్ద అవరోధం గా నిలచిన ఇటువంటి వ్యవస్థ ను ఇప్పుడు రూపుమాపడం జరిగింది. సర్ దార్ వల్లభ్ భాయ్ పటేల్ కల, బాబాసాహబ్ ఆంబేడ్కర్ కన్న కల, శ్యామా ప్రసాద్ ముఖర్జీ, అటల్ గారు మరియు కోట్లాది పౌరులు కూడా స్వప్నించింది ఇప్పుడు సాకారం అయింది.
జమ్ము- కశ్మీర్, లద్దాఖ్ లలో ఇప్పుడు ఒక నవ శకం ఆరంభమైంది. ఇప్పుడు దేశం లోని పౌరులందరి హక్కులు, బాధ్యత లు సమానం. ఈ సందర్భం గా నేను జమ్ము- కశ్మీర్, లద్దాఖ్ ప్రజల ను, దేశ పౌరులందరి ని అభినందిస్తున్నాను.
మిత్రులారా,
కొన్ని సార్లు సామాజిక జీవితాని కి సంబంధించిన కొన్ని విషయాలు కాలం తో ఎంతగా ముడివడి ఉంటాయంటే వాటి ని శాశ్వతం అయినటువంటివి గా పరిగణిస్తూ ఉంటారు. ఒక రకమైన నిర్లక్ష్యం ప్రబలితే ఇక దేనిలోనూ మార్పు ఉండదు అన్న భావన కలుగుతుంది. 370వ అధికరణాని కి సంబంధించి ఇటువంటి పరిస్థితే ఉండేది. ఇటువంటి భావన ల వల్ల జమ్ము- కశ్మీర్, లద్దాఖ్ లలోని మన సోదరుల కు, మన సోదరీమణుల కు, మన వారి పిల్లల కు జరిగినటువంటి నష్టాన్ని గురించి ఎవ్వరూ మాట్లాడే వారు కాదు. ఎటువంటి చర్చ చేసే వారు కాదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 370వ అధికరణం జమ్ము- కశ్మీర్ కు అందిన ప్రయోజనాలు ఏమిటో ఎవరూ చెప్పగలిగిన స్థితి లో లేరు.
సోదరీమణులు మరియు సోదరులారా,
370వ అధికరణం మరియు 35 ఎ లు జమ్ము- కశ్మీర్ కు వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని, బంధుప్రీతి ని, పెద్ద ఎత్తున అవినీతి ని తప్ప ఇచ్చిందంటూ ఏమీ లేదు. ఈ రెండు అధికరణల ను కొంత మంది ప్రజల భావోద్వేగాల ను రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ ఉపయోగించుకొంది.
దీనివల్ల గడచిన మూడు దశాబ్దాల లో సుమారు 42,000 మంది ప్రజలు వారి ప్రాణాల ను కోల్పోయారు. జమ్ము- కశ్మీర్, లద్దాఖ్ లలో తగిన విధం గా అభివృద్ధి చేయలేని పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం వ్యవస్థ లో గల లోపాన్ని తొలగించిన తరువాత మెరుగైన వర్తమానం తో పాటు ఉజ్వల భవిష్యత్తు జమ్ము- కశ్మీర్ ప్రజల ముందున్నాయి.
మిత్రులారా,
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, అది పార్లమెంటు లో తగిన చట్టాల ను చేయడం ద్వారా దేశాన్ని మెరుగుపరచడానికి పనిచేస్తుంది. ఏ పక్షం, ఏ కూటమి అధికారం లో ఉందన్న దాని తో సంబంధం లేకుండా ఈ పని నిరంతరం కొనసాగుతుంది. చట్టాలు చేసేటపుడు పార్లమెంటు లోపలా, వెలుపలా ఎంతో చర్చ జరుగుతుంది; బోలెడు మేధోమథనం జరుగుతుంది; వీటి కి సంబంధించిన ప్రాధాన్యం పై, ప్రభావం పై తీవ్ర వాదనల ను వినిపించడం జరుగుతుంటుంది. ఈ ప్రక్రియ ను పూర్తి చేసుకొన్న అనంతరం అమలు లోకి వచ్చే చట్టాలు దేశాని కి, ప్రజల కు లబ్ధిని చేకూర్చుతాయి. అయితే అర్థం కాని విషయం ఏమిటంటే, పార్లమెంట్ చేసిన ఎన్నో చట్టాలు దేశం లోని ఒక ప్రాంతం లో మాత్రం అమలు కు నోచుకోవడం లేదు. మునుపటి ప్రభుత్వాలు ఒక చట్టం చేసినందుకు ప్రశంసలను అందుకొన్న అనంతరం ఆ చట్టం జమ్ము- కశ్మీర్ లో అమలు అవుతుందని చెప్పుకోలేక పోయాయి.
భారతదేశ ప్రజల ప్రయోజనం కోసం తీసుకు వచ్చిన పలు చట్టాల ప్రయోజనాలు జమ్ము & కశ్మీర్ లోని 1.5 కోట్ల మంది ప్రజల కు అందని పరిస్థితి. దేశం లోని ఇతర ప్రాంతాల బాలల కు విద్యాహక్కు ఉంటే జమ్ము & కశ్మీర్ లోని బాలలు ఈ హక్కు కు నోచుకోలేదంటే పరిస్థితి ఆలోచించండి. దేశంలో ఇతర రాష్ట్రాల బాలికలకు గల హక్కుల కు జమ్ము & కశ్మీర్ లోని బాలికలు నోచుకోలేకపోయారు.
దేశం లోని ఇతర రాష్ట్రాలలో సఫాయి కర్మచారీ చట్టాన్ని వారి ఆరోగ్య పరిరక్షణ కై తీసుకు రావడం జరిగింది. కానీ జమ్ము & కశ్మీర్ కార్మికులు దీని కి నోచుకోలేదు. దళితుల పై అకృత్యాలను అరికట్టేందుకు కఠిన చట్టాల ను ఇతర రాష్ట్రాల లో తీసుకు వస్తే, జమ్ము & కశ్మీర్ లో ఇటువంటి చట్టం ఏదీ అమలు కావడం లేదు. కార్మికుల హక్కు ల పరిరక్షణ కు దేశం లోని ఇతర రాష్ట్రాలన్నిటి లో కనీస వేతనాల చట్టాన్ని తీసుకు వచ్చి అమలు చేయడం జరిగింది. కానీ జమ్ము & కశ్మీర్ లో మాత్రం ఈ చట్టం కాగితాలకే పరిమితం. అన్ని ఇతర రాష్ట్రాల లో షెడ్యూల్డు తెగల కు చెందిన మన సోదరీ సోదరులు ఎన్నికల లో పోటీ చేసేందుకు రిజర్వేశన్ ఉండగా జమ్ము & కశ్మీర్ లో అటువంటి ది వినపడదు కూడా.
మిత్రులారా,
ఆర్టికల్ 370 మరియు 35 -ఎ ల రద్దు తో జమ్ము మరియు కశ్మీర్ త్వరలో వ్యతిరేక ప్రభావాల నుండి బయటపడుతాయని నేను పూర్తి గా విశ్వసిస్తున్నాను.
మిత్రులారా మరియు సోదరీమణులారా, ప్రస్తుత నవీన వ్యవస్థ లో, కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యం ఏమిటి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జమ్ము మరియు కశ్మీర్ పోలీసుల కు సౌకర్యాల విషయంలో ఇతర రాష్ట్రాల రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, పోలీసుల తో సమానమైన సౌకర్యాలు కల్పించేలా చూడడం. కేంద్ర పాలిత ప్రాంతాల లో ప్రభుత్వం ఈ తరహా అనేక ఆర్థిక సదుపాయాల ను, అంటే ఎల్ టిసి, ఇంటి అద్దె అలవెన్సు, పిల్లల కోసం విద్య కు సంబంధించిన అలవెన్సు, ఆరోగ్య పథకాలు తదితర అలవెన్సుల ను కల్పిస్తున్నది. ఇందులో చాలా వరకు జమ్ము మరియు కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగుల కు కల్పించడం లేదు. ఇటువంటి సదుపాయాల ను త్వరలోనే సమీక్ష చేపట్టిన తరువాత జమ్ము మరియు కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగుల కు, రాష్ట్ర పోలీసుల కు కల్పించడం జరుగుతుంది.
మిత్రులారా, అతి త్వరలో జమ్ము మరియు కశ్మీర్ ఇంకా లద్దాఖ్ లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీ ల భర్తీ ప్రక్రియ ను చేపట్టడం జరుగుతుంది. ఇది స్థానిక యువత కు తగిన ఉపాధి అవకాశాల ను కల్పిస్తుంది. దీనికి తోడు, కొత్త ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వాని కి చెందిన ప్రభుత్వరంగ యూనిట్ లు, ప్రైవేటు రంగ కంపెనీల ను ప్రోత్సహించడం జరుగుతుంది. పై వాటి కి అదనం గా స్థానిక యువత కు ఉద్యోగాలు కల్పించేందుకు రిక్రూట్‌మెంట్ ర్యాలీల ను సైన్యం, అర్థ సైనిక బలగాలు నిర్వహిస్తాయి. ప్రభుత్వం మరింత మంది విద్యార్థుల కు ప్రయోజనాన్ని కలిగించే విధం గా ప్రధానమంత్రి ఉపకారవేతన పథకాన్ని కూడా విస్తరించనుంది. జమ్ము మరియు కశ్మీర్ భారీ రెవిన్యూ నష్టాన్ని కూడా భరిస్తోంది. దీని ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యల ను తీసుకొంటుంది.
సోదరీమణులు మరియు సోదరులారా, 370వ అనుచ్ఛేదం రద్దు అనంతరం, కేంద్ర ప్రభుత్వం ఎంతో మేధోమథనాన్ని జరిపిన మీదట జమ్ము మరియు కశ్మీర్ పాలన ను తన పాలనాధీనం లో ఉంచుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని తీసుకోవడం వెనుక కారణాల ను అర్థం చేసుకోవడం మీకు అవసరం.
రాష్ట్రం గవర్నర్ పాలన కిందకు వచ్చినప్పటి నుండి, జమ్ము మరియు కశ్మీర్ పాలన యంత్రాంగం నేరు గా కేంద్ర ప్రభుత్వం కిందకు వచ్చింది. ఫలితం గా సుపరిపాలన , అభివృద్ధి లకు సంబంధించిన సకారాత్మకమైన ప్రభావాన్ని క్షేత్ర స్థాయి లో గుర్తించడం జరిగింది.
గతంలో ఫైళ్ల కే పరిమితమైన పలు పథకాలు క్షేత్ర స్థాయి లో అమలుకు నోచుకొంటున్నాయి.
దశాబ్దాలు గా పెండింగ్ లో ఉన్న పలు ప్రాజెక్టులు వేగాన్ని పుంజుకొన్నాయి. జమ్ము మరియు కశ్మీర్ పాలన యంత్రాంగం లో పారదర్శకత్వాన్ని మరియు నూతనమైన పని సంస్కృతి ని తీసుకు రావడానికి మేము ప్రయత్నించాము. ఫలితం గా అది ఐఐటి కానివ్వండి, ఐఐఎమ్, ఎఐఐఎమ్ఎస్, వివిధ నీటి పారుదల పథకాలు, లేదా విద్యుత్తు పథకాలు, లేదా అవినీతి నిరోధక మండలి ఇలా…ఈ.ప్రాజెక్టు ల విషయం లో పనుల ను వేగవంతం చేయగలిగాము. వీటి తో పాటు అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు లేదా కొత్త రైల్వే లైన్ లకు సంబంధించిన ప్రాజెక్టులు, విమానాశ్రయాల ఆధునికీకరణ ప్రాజెక్టు లు .. ఇలా ప్రతి ఒక్క దానిని వేగవంతం చేయడం జరుగుతోంది.
మిత్రులారా,
మన దేశం లో ప్రజాస్వామ్యం ఎంతో భద్రం గా ఉంది. అయితే జమ్ము మరియు కశ్మీర్ లో దశాబ్దాలు గా నివసిస్తున్న వేల మంది సోదరీ సోదరులు లోక్ సభ ఎన్నికల లో వోటు వేసే హక్కు ను కలిగివున్నారు కానీ శాసన సభ ఎన్నికల లో, స్థానిక సంస్థల ఎన్నికల లో వారు వోటు వేయడానికి వీలు లేని పరిస్థితి ఉందని తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. వీరు ఎవరో కాదు, 1947వ సంవత్సరం లో దేశ విభజన ఫలితం గా భారతదేశాని కి వచ్చిన వారు. ఈ అన్యాయం ఇదే విధం గా కొనసాగేటట్టు మనము అనుమతి ని ఇవ్వాలా ?
మిత్రులారా,
నేను మరో ముఖ్యమైన అంశాన్ని జమ్ము కశ్మీర్ లోని నా సోదరీ సోదరుల కు స్పష్టం చేయదలచాను. మీ రాజకీయ ప్రతినిధి ని మీరే ఎన్నుకొంటారు. వారు మీ లో ఒకరై ఉంటారు. ఎమ్మెల్యే లు ఇదివరకు ఎన్నికైనట్టే ఎన్నిక చేసుకోబడతారు. రానున్న మంత్రిమండలి ఇదివరకు ఉన్న విధం గానే ఉంటుంది. ముఖ్యమంత్రులు గ తం లో ఉన్నట్లుగానే ఉంటారు.
మిత్రులారా, కొత్త వ్యవస్థ లో మనం అందరం కలిసికట్టు గా, జమ్ము మరియు కశ్మీర్ రాష్ట్రాన్ని వేర్పాటువాదాని కి, ఉగ్రవాదాని కి తావు లేని రాష్ట్రం గా చేయగలమన్న పూర్తి విశ్వాసం నాకు ఉంది. భూతల స్వర్గం గా పిలుచుకునే మన జమ్ము మరియు కశ్మీర్ అభివృద్ధి లో నూతన శిఖరాల ను అధిరోహించిన తరువాత అది ప్రపంచాన్ని ఆకర్షించగలుగుతుంది. అక్కడి ప్రజల జీవితాలు మరింత సులభతరంగా ఉంటే, వారు తమ హక్కుల ను ఎలాంటి అడ్డంకులు లేకుండా పొందగలుగుతూ ఉంటే, పాలన కు సంబంధించి అన్ని వ్యవస్థ లు ప్రజల కు అనుకూలం గా కార్యకలాపాల ను వేగవంతం చేస్తే, ఇక అప్పుడు కేంద్ర ప్రభుత్వం కింద గల వ్యవస్థ ను అక్కడ కొనసాగించాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను. అయితే, అది లద్దాఖ్ లో మాత్రం కొనసాగుతుంది.
సోదరీమణులు మరియు సోదరులారా,
మనం అందరం జమ్ము మరియు కశ్మీర్ లో ఎన్నికలు జరగాలని కోరుకొంటున్నాము. కొత్త ప్రభుత్వం ఏర్పడాలని, కొత్త ముఖ్యమంత్రి ఎన్నికవ్వాలని కోరుకొంటున్నాము. మీ ప్రతినిధుల ను మీరు పూర్తి గౌరవప్రదం గా, పారదర్శక వాతావరణం లో ఎంపిక చేసుకొనే అవకాశాన్ని పొందుతారని జమ్ము మరియు కశ్మీర్ ప్రజల కు నేను హామీ ఇస్తున్నాను. కొద్ది రోజుల క్రితం పంచాయతి ఎన్నికలు పారదర్శకం గా జరిగినట్టే జమ్ము మరియు కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల ను కూడా నిర్వహించడం జరుగుతుంది. రెండు మూడు దశాబ్దాలు గా పెండింగ్‌లో ఉన్న బ్లాక్ డివెలప్ మెంట్ కౌన్సిల్ ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయవలసింది గా నేను రాష్ట్ర గవర్నర్ కు విజ్ఞప్తి చేస్తాను.
మిత్రులారా,
జమ్ము లో, కశ్మీర్ లో, ఇంకా లద్దాఖ్ లో నాలుగైదు నెలల క్రితం పంచాయతీ ఎన్నికల లో ఎన్నికైన వారు చక్కగా పని చేస్తూ ఉండటాన్ని నేను స్వయం గా గమనించాను. కొద్ది నెలల కిందట శ్రీనగర్ కు నేను వెళ్ళినప్పుడు వారి తో ఒక సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించాను. వారు ఢిల్లీ కి వచ్చినప్పుడు వారి తో నా గృహం లో చాలా సేపు మాట్లాడాను. పంచాయతీల లోని ఈ మిత్రుల వల్లనే జమ్ము మరియు కశ్మీర్ లో పల్లె స్థాయి లో పని సకాలం లో జరిగింది. అది ప్రతి ఒక్క ఇంట్లో విద్యుత్తు సదుపాయాన్ని సమకూర్చడం కావచ్చు లేదా రాష్ట్రాన్ని బహిరంగ ప్రదేశాల లో మలమూత్రాదుల విసర్జన రహితం గా తీర్చిదిద్దడం కావచ్చు.. పంచాయతీల లోని ప్రతినిధులు ఒక కీలకమైన పాత్ర ను పోషించారు. 370వ అధికరణాన్ని రద్దు చేసిన దరిమిలా క్రొత్త వ్యవస్థ లో పని చేసేందుకు ఒక అవకాశం గనక ఈ పంచాయతీ సభ్యుల కు దక్కిందంటే వారు అద్భుతాల ను చేయగలుగుతారు.
జమ్ము మరియు కశ్మీర్ ప్రజానీకం వేర్పాటువాదం పై జయాన్ని సాధించి, నూతనమైన ఆశ తో ముందంజ వేస్తారని నేను దృఢం గా నమ్ముతున్నాను. జమ్ము మరియు కశ్మీర్ ప్రజలు సుపరిపాలన తో, పారదర్శకత్వంతో కూడిన ఒక వాతావరణం లో నవీకరించబడ్డ అత్యుత్సాహం తో వారి యొక్క లక్ష్యాల ను సాధించుకొంటార ని నేను దృఢం గా నమ్ముతున్నాను.
మిత్రులారా,
కుటుంబ పాలన జమ్ము మరియు కశ్మీర్ రాష్ట్రం లోని ఏ యువ పౌరుని కి/పౌరురాలి కి నాయకత్వ అవకాశాన్ని ఇవ్వనే లేదు. ప్రస్తుతం జమ్ము మరియు కశ్మీర్ యొక్క అభివృద్ధి తాలూకు నాయకత్వాన్ని నా యొక్క ఈ యువత వారి చేతుల లోకి తీసుకొంటారని, మరి దాని ని ఒక క్రొత్త శిఖరాని కి తీసుకు పోతారు. అభివృద్ధి తాలూకు ఆధిపత్యాన్ని వారి చేతుల లోకి తీసుకోవాల్సింది గా జమ్ము, కశ్మీర్, ఇంకా లద్దాఖ్ ల యొక్క యువజనులకు, సోదరీమణులకు మరియు పుత్రికల కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
మిత్రులారా,
జమ్ము, కశ్మీర్, ఇంకా లద్దాఖ్ గొప్ప పర్యటక క్షేత్రాల లో ఒకటి గా అయ్యేందుకు ఆస్కారం ఎంతగానో ఉంది. దీని కి అవసరమైన వాతావరణాన్ని, పాలన యంత్రాంగం లో మార్పు తాలూకు అవసరాన్ని.. వీటన్నింటి పట్ల శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది. అయితే, దీని కి గాను, దేశ ప్రజలందరి సమర్ధన నాకు కావాలి. బాలీవుడ్ చలన చిత్రాల యొక్క చిత్రీకరణ ను జరిపేందుకు కశ్మీర్ ఒక అభిమానపాత్రమైనటువంటి ప్రదేశం గా ఉన్న కాలం అంటూ ఒకటి ఉండేది. కశ్మీర్ లో చిత్రీకరణ జరుగనటువంటి ఏ చలన చిత్రం కూడా బహుశా ఆ కాలం లో లేదేమో. ప్రస్తుతం, జమ్ము మరియు కశ్మీర్ లో స్థితిగతులు సాధారణ స్థాయి కి చేరుకొంటాయి; ఒక్క భారతదేశం నుండే కాకుండా ప్రపంచం అంతటి నుండి ప్రజలు అక్కడ చిత్రీకరణ జరుపుకోవడం కోసం తరలివస్తారు. ప్రతి ఒక్క చలనచిత్రం కశ్మీర్ ప్రజల కు ఉపాధి తాలూకు నూతన అవకాశాన్ని తన తో పాటు తీసుకు వస్తుంది. తెలుగు మరియు తమిళ చలన చిత్ర పరిశ్రమ లకు మరియు వాటి తో ముడిపడి ఉన్న ప్రజల కు వారి యొక్క పెట్టుబడి ని జమ్ము, కశ్మీర్ లో పెట్టేందుకు, అక్కడ చలనచిత్రాల చిత్రీకరణ జరిపేందుకు, అక్కడ చలన చిత్ర ప్రదర్శన శాలల ను ఏర్పాటు చేసేందుకు, ఇంకా ఇతరత్రా కార్యకలాపాలు నిర్వహించేందుకు తప్పక ఆలోచన లు చేయవలసింది గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
జమ్ము మరియు కశ్మీర్ లో సాంకేతిక విజ్ఞానాన్ని ఏ విధం గా వ్యాప్తి చేయవచ్చో అనే అంశాన్ని సాంకేతిక జగతి తో పెనవేసుకొని ఉన్న వారు, పరిపాలన లేదా ప్రైవేటు రంగం లోని వారు వారి యొక్క విధానాల లో మరియు వారి యొక్క నిర్ణయాల లో ప్రాధాన్య ప్రాతిపదిక న ఆలోచించాల ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అక్కడ డిజిటల్ కమ్యూనికేశన్ ను ఎప్పుడైతే బలోపేతం చేయడం జరుగుతుందో, బిపిఒ సెంటర్, కామన్ సర్వీస్ సెంటర్ లు అధికం అవుతాయో, బ్రతుకు తెరువు ను సమకూర్చే అవకాశాలు పెంపొందుతాయి. మరి జమ్ము మరియు కశ్మీర్ లోని మన సోదరీమణులు మరియు సోదరుల జీవనం సరళతరం గా మారుతుంది.
మిత్రులారా,
ప్రభుత్వం తీసుకొన్నటువంటి నిర్ణయం జమ్ము మరియు కశ్మీర్, ఇంకా లద్దాఖ్ ల యువత కు లబ్ధి ని చేకూర్చుతుంది. అలాగే, క్రీడా జగత్తు లో పురోగమించాలని కోరుకొనే వారి ఆశల ను కూడా నెరవేర్చుతుంది. క్రొత్త స్పోర్ట్ అకాడమీస్, కొత్త స్పోర్ట్స్ స్టేడియమ్, విజ్ఞానశాస్త్ర సంబంధిత శిక్షణ లు వారి కి వారి యొక్క ప్రతిభ ను ప్రపంచాని కి చాటి చెప్పడం లో సహాయకారి అవుతాయి.
మిత్రులారా, అది కేసర్ యొక్క వర్ణం కావచ్చు, లేదా కాహ్వా యొక్క రుచి కావచ్చు, లేదా యాపిల్ పండు యొక్క తీయదనం కావచ్చు, లేదా ఏప్రికాట్ యొక్క సారం కావచ్చు, లేదా కశ్మీరీ శాలువలు లేదా కళాకృతులు కావచ్చు; లద్దాఖ్ కు చెందిన సేంద్రియ ఉత్పత్తులు కావచ్చు, లేదా జమ్ము మరియు కశ్మీర్ యొక్క మూలికా ఔషధం కావచ్చు.. వీటి ని అన్నిటి ని గురించి యావత్తు ప్రపంచంలో ప్రచారం చేయవలసిన అవసరం ఉంది.
మిత్రులారా,
మీకు ఒక ఉదాహరణ ను నేను చెబుతాను. లద్దాఖ్ లో సోలో పేరు తో ఒక మొక్క ఉంది. ఈ మొక్క ఎత్తయిన ప్రాంతాల లో నివసించే వారి కి, మరి అలాగే పెద్ద హిమవత్పర్వత ప్రాంతాల లో విధుల ను నిర్వహించేటటువంటి భద్రత దళాల కు ఒక సంజీవి ని వంటిది అని నిపుణులు అంటారు. ప్రాణవాయువు తక్కువ స్థాయి లో అందే ప్రదేశాల లో శరీరం లోని నిరోధక వ్యవస్థ ను కాపాడటం లో ఈ మొక్కలది గొప్ప పాత్ర. కొంచెం ఆలోచించండి, ఈ అసాధారణ వస్తువుల ను యావత్తు ప్రపంచం లో విక్రయించాలా, లేక విక్రయించకూడదా ? భారతదేశం లో ఎవరు మాత్రం దీనిని ఇష్టపడకుండా ఉంటారు?
మిత్రులారా,
నేను మీ తో ఒకే ఒక మొక్క ను గురించి మాత్రమే చెప్పాను. జమ్ము మరియు కశ్మీర్, ఇంకా లద్దాఖ్ లో బోలెడన్ని మొక్కలు, మూలికా ఉత్పత్తులు విస్తరించి ఉన్నాయి. వాటి ని గుర్తించడం జరుగుతుంది. వాటిని విక్రయించిన పక్షం లోచ అది జమ్ము మరియు కశ్మీర్, ఇంకా లద్దాఖ్ రైతుల కు, ప్రజల కు అది లబ్ది ని చేకూర్చుతుంది. అందువల్ల, పరిశ్రమ, ఎగుమతి, ఫూడ్ ప్రాసెసింగ్ రంగాల తో ముడిపడ్డ వారు ముందంజ వేసి, జమ్ము మరియు కశ్మీర్, ఇంకా లద్దాఖ్ ల స్థానిక ఉత్పత్తుల ను మొత్తం ప్రపంచాని కి చేర్చేందుకు చొరవ తీసుకోవాలని నేను
విజ్ఞప్తి చేస్తున్నాను.
మిత్రులారా,
ఒక కేంద్ర పాలిత ప్రాంతం గా అయిన తరువాత లద్దాఖ్ ప్రజల అభివృద్ధి భారత ప్రభుత్వ స్వాభావిక బాధ్యతే అవుతుంది. కేంద్ర ప్రభుత్వం స్థానిక ప్రతినిధుల సహకారం తో లద్దాఖ్, ఇంకా కార్ గిల్ అభివృద్ధి మండలుల యొక్క సహకారం తో అన్ని అభివృద్ధి పథకాల తాలూకు లబ్ధి ని వేగవంతమైన రీతి లో అందుబాటు లోకి తీసుకు వస్తుంది. లద్దాఖ్ ఆధ్యాత్మిక పర్యటన లకు, సాహస యాత్రల తో కూడినటువంటి పర్యటన లకు మరియు పర్యావరణ సంబంధ పర్యటన లకు పేరు తెచ్చుకొన్న కేంద్రాల లో ఒక కేంద్రం గా అయ్యేందుకు అవకాశం ఉంది. లద్దాఖ్ లో ఒక విశాలమైన కేంద్రం సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం గా మారేందుకు ఆస్కారం ఉంది.
ఇక, లద్దాఖ్ ప్రజల సత్తా ను సముచిత రీతి న వినియోగించుకోవడం జరుగుతుంది. ఏ విచక్షణ కు తావు ఉండనటువంటి అభివృద్ధి కి నూతన అవకాశం సైతం లభిస్తుంది.
లద్దాఖ్ యువత లోని నూతన ఆవిష్కరణ ల స్ఫూర్తి ఇప్పుడు ఉత్తేజాన్ని అందుకొంటుంది. వారు చక్కని విద్యాబోధన సంస్థల ను పొందగలుగుతారు. ప్రజలు మంచి వైద్య శాలల ను దక్కించుకోగలుగుతారు. మౌలిక సదుపాయాల కల్పన ను ప్రాథమ్య ప్రాతిపదిక న ఆధునికీకరించడం జరుగుతుంది.
మిత్రులారా,
ఈ నిర్ణయం తో కొంత మంది ఏకీభవించడం, మరి అలాగే, కొంతమంది దీని ని వ్యతిరేకించడం అనే విషయాలు ప్రజాస్వామ్యం లో జరిగేవే. వారి యొక్క అనంగీకారాన్ని, మరి వారి యొక్క అభ్యంతరాల ను నేను గౌరవిస్తాను. ఈ సందర్భం లో జరుగుతున్న వాదన లు ఏవైనప్పటి కీ, వాటి కి కేంద్ర ప్రభుత్వం సమాధానాల ను చెబుతోంది. మరి వాటి ని పరిష్కరించడం కోసం అది ప్రయత్నిస్తోంది. అది మన ప్రజాస్వామిక బాధ్యత గా ఉంది. అయితే, దేశ ప్రజల హితాన్ని సర్వోన్నతం గా భావించి, కార్యాచరణ కు పూనుకోవాలని, అలాగే జమ్ము, కశ్మీర్, ఇంకా లద్దాఖ్ ప్రాంతాల కు ఒక క్రొత్త దిశ ను అందించడం లో ప్రభుత్వాని కి సహాయం చేయాలని, వారి కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రండి, దేశాని కి సహాయం చేయడం కోసం అడుగులు ముందుకు వేయండి.
పార్లమెంటు లో ఎవరు ఓటు వేశారు, ఎవరు వేయలేదు, బిల్లు ను ఎవరు సమర్ధించారు, ఎవరు సమర్ధించ లేదు.. అనే అంశాల నుండి మనం ముందుకు సాగి, ఇక జమ్ము – కశ్మీర్ – లద్దాఖ్ ల హితం కోరి కలసికట్టు గా కృషి చేసేందుకు మనమందరమూ ఒక్కటవుదాము. జమ్ము, కశ్మీర్, ఇంకా లద్దాఖ్ ల ఆందోళనల ను మన సమష్టి ఆందోళనలు అనే విషయాన్ని నేను ప్రతి ఒక్క దేశ వాసి కి తెలియ జెప్పదలచాను. ఇవి 130 కోట్ల మంది పౌరుల ఆందోళనలు. మనం వారి సంతోషాలు, లేదా విచారాలు, లేదా ఇక్కట్టుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యాన్ని వహించడం లేదు. 370 వ అధికరణాని కి భరతవాక్యాన్ని పలకడం అనేది ఒక వాస్తవం. అయితే, ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి చిక్కులు ఈ చారిత్రక చర్యల ను వారు అడ్డుకొన్న కారణం గా ఎదురవుతున్నాయన్నది కూడా నిజం.
ఆ ప్రాంతం లోని మన సోదరీమణులు మరియు సోదరులు అక్కడి వాతావరణాన్ని కలుషితం చేయదలుస్తున్న కొద్ది మంది వ్యక్తుల కు ఎంతో ఓపిక గా సమాధానం చెప్తున్నారు. వేర్పాటువాదాన్ని మరియు ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ చేస్తున్న కుతంత్రాల ను బలం గా వ్యతిరేకిస్తున్నది జమ్ము-కశ్మీర్ యొక్క దేశ భక్తులే అన్నది మనం మరచిపోకూడదు.
భారతదేశ రాజ్యాంగాన్ని నమ్ముతున్న మన సోదరీమణులు మరియు సోదరులు నిజం గా ఒక ఉత్తమమైన జీవనాని కి అర్హులు. వారిని చూసుకొని మనం గర్విద్దాము. ఈ రోజు న, జమ్ము – కశ్మీర్ యొక్క మిత్రుల కు నేను హామీ ని ఇస్తున్నాను. ఏమని అంటే, పరిస్థితి క్రమం గా సాధారణ స్థాయి కి చేరుకొంటుంది; మరి వారి యొక్క కష్టాలు కూడా తగ్గుతాయి అని.
మిత్రులారా,
ఈద్ పండుగ రోజు త్వరలోనే రాబోతోంది. నేను అందరి కీ ఈద్ ను పురస్కరించుకొని నా యొక్క శుభాకాంక్షల ను తెలియ జేస్తున్నాను. జమ్ము- కశ్మీర్ ప్రజలు ఈద్ ను వేడుక గా జరుపుకోబోయే సమయం లో ఎటువంటి సమస్య ను ఎదుర్కోకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తల ను తీసుకొంటోంది. జమ్ము – కశ్మీర్ కు వెలుపల నివసిస్తున్న మరియు ఈద్ నాడు వారి యొక్క ఇళ్ళ కు తిరిగి రావాలని కోరుకొంటున్న మిత్రులు అందరి కీ శాయశక్తులా ప్రభుత్వం సహాయాన్ని అందజేస్తోంది.
మిత్రులారా,
ఈ రోజు న, జమ్ము- కశ్మీర్ ప్రజల భద్రత ను పరిరక్షించడం కోసం నియమించబడినటువంటి భద్రత దళాల లోని మన మిత్రుల కు నా యొక్క కృతజ్ఞత ను కూడా వ్యక్తం చేస్తున్నాను. జమ్ము- కశ్మీర్ పోలీసు సిబ్బంది మరియు పాలన యంత్రాంగాని కి చెందిన అధికారులు, రాష్ట్ర ఉద్యోగులు అక్కడి పరిస్థితి ని సంబాళిస్తున్నటువంటి తీరు నిజం గా ప్రశంసాయోగ్యం.
మీ యొక్క ఈ తత్పరత అనేది మార్పు సంభవమేనన్న విశ్వాసాన్ని నాలో పెంచుతోంది.
సోదరీమణులు మరియు సోదరులారా,
జమ్ము-కశ్మీర్ మన దేశాని కి కిరీటం గా ఉంది. దీని భద్రత కోసం జమ్ము-కశ్మీర్ కు చెందిన ఎంతో మంది సాహసికులైన పుత్రులు మరియు పుత్రికలు త్యాగాలు చేశారు. అంతేకాదు, వారు వారి యొక్క ప్రాణాల ను కూడా పణం గా పెట్టడం మనం గర్వించదగ్గది. 1965 యుద్ధ కాలం లో పాకిస్తానీ చొరబాటుదారుల గురించిన సంగతి ని భారతీయ సేనల కు ఉప్పందించింది పూంచ్ జిల్లా కు చెందిన మౌల్వి గులాం దీన్ గారు. ఆయన కు ‘అశోక్ చక్ర’తో సమ్మానించడం జరిగింది. కార్ గిల్ సమరం కాలం లో శత్రువులు మట్టి కరువక తప్పని పరిస్థితి ని కల్పించిన లద్దాఖ్ జిల్లా కు చెందిన కర్నల్ సోనమ్ వాంగ్ చుంగ్ ను ‘మహావీర్ చక్ర’ తో సమ్మానించుకొన్నాము. ఒక పెద్ద ఉగ్రవాది ని హతమార్చిన రాజౌరీ కి చెందిన రుఖ్ సానా కౌసర్ కు ‘కీర్తి చక్ర’ను ప్రదానం చేయడమైంది. కిందటి సంవత్సరం లో ఉగ్రవాదులు బలిగొన్న పూంచ్ కు చెందిన అమరవీరుడు ఔరంగజేబ్ సోదరులు ఇరువురు సైన్యం లో చేరి దేశాని కి సేవలు అందిస్తున్నారు. అటువంటి శూర పుత్రులు మరియు వీర పుత్రిక ల యొక్క జాబితా చాలా పెద్దది.
జమ్ము-కశ్మీర్ కు చెందిన అనేక మంది జవానులు మరియు అధికారులు కూడాను ఉగ్రవాదుల తో పోరాడుతూ వారి యొక్క ప్రాణాల ను త్యాగం చేశారు. మనం దేశం లోని ఇతర ప్రాంతాల కు చెందిన వేలాది ప్రజల ను సైతం కోల్పోయాము. వారందరి కీ ఒక్కటే కల. అది ఏమిటంటే శాంతియుతమైన భద్రమైన మరియు సమృద్ధమైనటువంటి జమ్ము, కశ్మీర్. వారి యొక్క స్వప్నాన్ని మనం అందరం కలసి సాకారం చేయవలసివుంది.
మిత్రులారా,
ఈ నిర్ణయం జమ్ము, కశ్మీర్, ఇంకా లద్దాఖ్ లతో పాటు యావత్తు దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి సాధన లో తోడ్పడగలుగుతుంది. భూ గోళం లో ఈ ముఖ్యమైన ప్రాంతం లో శాంతి మరియు సమృద్ధి నెలకొన్న తరుణం లో యావత్తు ప్రపంచం లో శాంతి సాధన కు చేసే ప్రయత్నాలు స్వాభావికం గానే బలవత్తరం అవుతాయి.
మనలో ఎంతటి శక్తి, ధైర్యం, ఇంకా ఉద్వేగం ఉన్నాయో ప్రపంచాని కి చాటడం కోసం జమ్ము, కశ్మీర్, ఇంకా లద్దాఖ్ ల లోని నా సోదరీమణులను మరియు సోదరుల ను కలసి ముందుకు రావలసింది గా నేను పిలుపును ఇస్తున్నాను. ఒక ‘న్యూ ఇండియా’ను, మరి అలాగే ఒక న్యూ జమ్ము- కశ్మీర్ ఇంకా లద్దాఖ్ ను నిర్మించడం కోసం మనము అందరమూ ఏకం అవుదాము.
మీకు అందరికీ అనేకానేక ధన్యవాదాలు.
జయ్ హింద్.
एक राष्ट्र के तौर पर, एक परिवार के तौर पर, आपने, हमने, पूरे देश ने एक ऐतिहासिक फैसला लिया है।
— PMO India (@PMOIndia) August 8, 2019
एक ऐसी व्यवस्था, जिसकी वजह से जम्मू-कश्मीर और लद्दाख के हमारे भाई-बहन अनेक अधिकारों से वंचित थे, जो उनके विकास में बड़ी बाधा थी, वो अब दूर हो गई है: PM
जो सपना सरदार पटेल का था, बाबा साहेब अंबेडकर का था, डॉक्टर श्यामा प्रसाद मुखर्जी का था, अटल जी और करोड़ों देशभक्तों का था, वो अब पूरा हुआ है: PM
— PMO India (@PMOIndia) August 8, 2019
समाज जीवन में कुछ बातें, समय के साथ इतनी घुल-मिल जाती हैं कि कई बार उन चीजों को स्थाई मान लिया जाता है। ये भाव आ जाता है कि, कुछ बदलेगा नहीं, ऐसे ही चलेगा: PM
— PMO India (@PMOIndia) August 8, 2019
अनुच्छेद 370 के साथ भी ऐसा ही भाव था। उससे जम्मू-कश्मीर और लद्दाख के हमारे भाई-बहनों की जो हानि हो रही थी, उसकी चर्चा ही नहीं होती थी। हैरानी की बात ये है कि किसी से भी बात करें, तो कोई ये भी नहीं बता पाता था कि अनुच्छेद 370 से जम्मू-कश्मीर के लोगों के जीवन में क्या लाभ हुआ: PM
— PMO India (@PMOIndia) August 8, 2019
हमारे देश में कोई भी सरकार हो, वो संसद में कानून बनाकर, देश की भलाई के लिए काम करती है।
— PMO India (@PMOIndia) August 8, 2019
किसी भी दल की सरकार हो, किसी भी गठबंधन की सरकार हो, ये कार्य निरंतर चलता रहता है।
कानून बनाते समय काफी बहस होती है, चिंतन-मनन होता है, उसकी आवश्यकता को लेकर गंभीर पक्ष रखे जाते हैं: PM
इस प्रक्रिया से गुजरकर जो कानून बनता है,
— PMO India (@PMOIndia) August 8, 2019
वो पूरे देश के लोगों का भला करता है।
लेकिन कोई कल्पना नहीं कर सकता कि संसद इतनी बड़ी संख्या में कानून बनाए और वो देश के एक हिस्से में लागू ही नहीं हों: PM
देश के अन्य राज्यों में सफाई कर्मचारियों के लिए सफाई कर्मचारी एक्ट लागू है,
— PMO India (@PMOIndia) August 8, 2019
लेकिन जम्मू-कश्मीर के सफाई कर्मचारी इससे वंचित थे।
देश के अन्य राज्यों में दलितों पर अत्याचार रोकने के लिए सख्त कानून लागू है,
लेकिन जम्मू-कश्मीर में ऐसा नहीं था: PM
देश के अन्य राज्यों में अल्पसंख्यकों के हितों के संरक्षण के लिए माइनॉरिटी एक्ट लागू है, लेकिन जम्मू-कश्मीर में ऐसा नहीं था।
— PMO India (@PMOIndia) August 8, 2019
देश के अन्य राज्यों में श्रमिकों के हितों की रक्षा के लिए Minimum Wages Act लागू है, लेकिन जम्मू-कश्मीर में ये सिर्फ कागजों पर ही मिलता था: PM
नई व्यवस्था में केंद्र सरकार की ये प्राथमिकता रहेगी कि राज्य के कर्मचारियों को, जम्मू-कश्मीर पुलिस को, दूसरे केंद्र शासित प्रदेश के कर्मचारियों और वहां की पुलिस के बराबर सुविधाएं मिलें: PM
— PMO India (@PMOIndia) August 8, 2019
जल्द ही जम्मू-कश्मीर और लद्दाख में केंद्रीय और राज्य के रिक्त पदों को भरने की प्रक्रिया शुरू की जाएगी। इससे स्थानीय नौजवानों को रोजगार के अवसर उपलब्ध होंगे।
— PMO India (@PMOIndia) August 8, 2019
केंद्र की पब्लिक सेक्टर यूनिट्स और प्राइवेट सेक्टर की कंपनियों को भी रोजगार उपलब्ध कराने के लिए प्रोत्साहित किया जाएगा: PM
हमने जम्मू-कश्मीर प्रशासन में एक नई कार्यसंस्कृति लाने, पारदर्शिता लाने का प्रयास किया है।
— PMO India (@PMOIndia) August 8, 2019
इसी का नतीजा है कि IIT, IIM, एम्स, हों, तमाम इरिगेशन प्रोजेक्ट्स हो,
पावर प्रोजेक्ट्स हों, या फिर एंटी करप्शन ब्यूरो, इन सबके काम में तेजी आई है: PM
आप ये जानकर चौंक जाएंगे कि जम्मू-कश्मीर में दशकों से, हजारों की संख्या में ऐसे भाई-बहन रहते हैं, जिन्हें लोकसभा के चुनाव में तो वोट डालने का अधिकार था, लेकिन वो विधानसभा और स्थानीय निकाय के चुनाव में मतदान नहीं कर सकते थे: PM
— PMO India (@PMOIndia) August 8, 2019
ये वो लोग हैं जो बंटवारे के बाद पाकिस्तान से भारत आए थे।
— PMO India (@PMOIndia) August 8, 2019
क्या इन लोगों के साथ अन्याय ऐसे ही चलता रहता?: PM
हम सभी चाहते हैं कि आने वाले समय में जम्मू-कश्मीर विधानसभा के चुनाव हों,
— PMO India (@PMOIndia) August 8, 2019
नई सरकार बने, मुख्यमंत्री बनें।
मैं जम्मू-कश्मीर के लोगों को भरोसा देता हूं कि आपको बहुत ईमानदारी के साथ,
पूरे पारदर्शी वातावरण में अपने प्रतिनिधि चुनने का अवसर मिलेगा: PM
जैसे पंचायत के चुनाव पारदर्शिता के साथ संपन्न कराए गए, वैसे ही
— PMO India (@PMOIndia) August 8, 2019
विधानसभा के भी चुनाव होंगे।
मैं राज्य के गवर्नर से ये भी आग्रह करूंगा कि ब्लॉक डवलपमेंट काउंसिल का गठन, जो पिछले दो-तीन दशकों से लंबित है, उसे पूरा करने का काम भी जल्द से जल्द किया जाए: PM
मुझे पूरा विश्वास है कि अब अनुच्छेद 370 हटने के बाद, जब इन पंचायत सदस्यों को नई व्यवस्था में काम करने का मौका मिलेगा तो वो कमाल कर देंगे।
— PMO India (@PMOIndia) August 8, 2019
मुझे पूरा विश्वास है कि जम्मू-कश्मीर की जनता अलगाववाद को परास्त करके नई आशाओं के साथ आगे बढ़ेगी: PM
मुझे पूरा विश्वास है कि जम्मू-कश्मीर की जनता, Good Governance और पारदर्शिता के वातावरण में, नए उत्साह के साथ अपने लक्ष्यों को प्राप्त करेगी: PM
— PMO India (@PMOIndia) August 8, 2019
दशकों के परिवारवाद ने जम्मू-कश्मीर के युवाओं को नेतृत्व का अवसर ही नहीं दिया।
— PMO India (@PMOIndia) August 8, 2019
अब मेरे युवा, जम्मू-कश्मीर के विकास का नेतृत्व करेंगे और उसे नई ऊंचाई पर ले जाएंगे।
मैं नौजवानों, वहां की बहनों-बेटियों से आग्रह करूंगा कि अपने क्षेत्र के विकास की कमान खुद संभालिए: PM
जम्मू-कश्मीर के केसर का रंग हो या कहवा का स्वाद,
— PMO India (@PMOIndia) August 8, 2019
सेब का मीठापन हो या खुबानी का रसीलापन,
कश्मीरी शॉल हो या फिर कलाकृतियां,
लद्दाख के ऑर्गैनिक प्रॉडक्ट्स हों या हर्बल मेडिसिन,
इसका प्रसार दुनियाभर में किए जाने का जरूरत है: PM
Union Territory बन जाने के बाद अब लद्दाख के लोगों का विकास, भारत सरकार की विशेष जिम्मेदारी है।
— PMO India (@PMOIndia) August 8, 2019
स्थानीय प्रतिनिधियों, लद्दाख और कारगिल की डवलपमेंट काउंसिल्स के सहयोग से केंद्र सरकार, विकास की तमाम योजनाओं का लाभ अब और तेजी से पहुंचाएगी: PM
लद्दाख में स्पीरिचुअल टूरिज्म, एडवेंचर टूरिज्म औरइकोटूरिज्म का सबसे बड़ा केंद्र बनने की क्षमता है।
— PMO India (@PMOIndia) August 8, 2019
सोलर पावर जनरेशन का भी लद्दाख बहुत बड़ा केंद्र बन सकता है।
अब वहां के सामर्थ्य का उचित इस्तेमाल होगा और बिना भेदभाव विकास के लिए नए अवसर बनेंगे: PM
अब लद्दाख के नौजवानों की इनोवेटिव स्पिरिट को बढ़ावा मिलेगा, उन्हें अच्छी शिक्षा के लिए बेहतर संस्थान मिलेंगे, वहां के लोगों को अच्छे अस्पताल मिलेंगे,
— PMO India (@PMOIndia) August 8, 2019
इंफ्रास्ट्रक्चर का और तेजी से आधुनिकीकरण होगा: PM
लोकतंत्र में ये भी बहुत स्वाभाविक है कि कुछ लोग इस फैसले के पक्ष में हैं और कुछ को इस पर मतभेद है।
— PMO India (@PMOIndia) August 8, 2019
मैं उनके मतभेद का भी सम्मान करता हूं और उनकी आपत्तियों का भी।
इस पर जो बहस हो रही है, उसका केंद्र सरकार जवाब भी दे रही है।
ये हमारा लोकतांत्रिक दायित्व है: PM
लेकिन मेरा उनसे आग्रह है कि वो देशहित को सर्वोपरि रखते हुए व्यवहार करें और जम्मू-कश्मीर-लद्दाख को नई दिशा देने में सरकार की मदद करें।
— PMO India (@PMOIndia) August 8, 2019
संसद में किसने मतदान किया, किसने नहीं किया, इससे आगे बढ़कर अब हमें
जम्मू-कश्मीर-लद्दाख के हित में मिलकर, एकजुट होकर काम करना है: PM
मैं हर देशवासी को ये भी कहना चाहता हूं कि जम्मू-कश्मीर और लद्दाख के लोगों की चिंता, हम सबकी चिंता है, उनके सुख-दुःख, उनकी तकलीफ से हम अलग नहीं हैं: PM
— PMO India (@PMOIndia) August 8, 2019
अनुच्छेद 370 से मुक्ति एक सच्चाई है,
— PMO India (@PMOIndia) August 8, 2019
लेकिन सच्चाई ये भी है कि इस समय ऐहतियात के तौर पर उठाए गए कदमों की वजह से जो परेशानी हो रही है, उसका मुकाबला भी वही लोग कर रहे हैं।
कुछ मुट्ठी भर लोग जो वहां हालात बिगाड़ना चाहते हैं,
उन्हें जवाब भी वहां के स्थानीय लोग दे रहे हैं: PM
हमें ये भी नहीं भूलना चाहिए कि आतंकवाद और अलगाववाद को बढ़ावा देने की पाकिस्तानी साजिशों के विरोध में जम्मू-कश्मीर के ही देशभक्त लोग डटकर खड़े हुए हैं: PM
— PMO India (@PMOIndia) August 8, 2019
जम्मू-कश्मीर के साथियों को भरोसा देता हूं कि धीरे-धीरे हालात सामान्य हो जाएंगे और उनकी परेशानी भी कम होती चली जाएगी।
— PMO India (@PMOIndia) August 8, 2019
ईद का मुबारक त्योहार भी नजदीक ही है।
ईद के लिए मेरी ओर से सभी को बहुत-बहुत शुभकामनाएं: PM
सरकार इस बात का ध्यान रख रही है कि जम्मू-कश्मीर में ईद मनाने में लोगों को कोई परेशानी न हो।
— PMO India (@PMOIndia) August 8, 2019
हमारे जो साथी जम्मू-कश्मीर से बाहर रहते हैं और ईद पर अपने घर वापस जाना चाहते हैं, उनको भी सरकार हर संभव मदद कर रही है: PM
जम्मू-कश्मीर के लोगों की सुरक्षा में तैनात सुरक्षाबलों के साथियों का आभार व्यक्त करता हूं।
— PMO India (@PMOIndia) August 8, 2019
प्रशासन से जुड़े लोग, राज्य के कर्मचारी और जम्मू-कश्मीर पुलिस जिस तरह से स्थितियों को सँभाल रही है वो प्रशंसनीय है
आपके इस परिश्रम ने मेरा ये विश्वास और बढ़ाया है कि बदलाव हो सकता है: PM
ये फैसला जम्मू-कश्मीर और लद्दाख के साथ ही पूरे भारत की आर्थिक प्रगति में सहयोग करेगा।
— PMO India (@PMOIndia) August 8, 2019
जब दुनिया के इस महत्वपूर्ण भूभाग में शांति और खुशहाली आएगी, तो स्वभाविक रूप से विश्व शांति के प्रयासों को मजबूती मिलेगी: PM
मैं जम्मू-कश्मीर के अपने भाइयों और बहनों से,
— PMO India (@PMOIndia) August 8, 2019
लद्दाख के अपने भाइयों और बहनों से आह्वान करता हूं।
आइए, हम सब मिलकर दुनिया को दिखा दें कि इस क्षेत्र के लोगों का सामर्थ्य कितना ज्यादा है, यहां के लोगों का हौसला, उनका जज्बा कितना ज्यादा है: PM
आइए, हम सब मिलकर, नए भारत के साथ अब नए जम्मू-कश्मीर और नए लद्दाख का भी निर्माण करें: PM
— PMO India (@PMOIndia) August 8, 2019