‘‘ ‘సిఎజి వర్సస్ ప్రభుత్వం’ తాలూకు మనస్తత్వం మారింది. ప్రస్తుతం ఆడిట్ ను విలువ జోడింపు లో ఒక ముఖ్యమైన భాగం గా భావించడం జరుగుతున్నది’’
‘‘మేం ఇదివరకటి ప్రభుత్వాల తాలూకు వాస్తవాన్ని సంపూర్ణమైన నిజాయతీ తో దేశం ఎదుట కు తెచ్చాం. సమస్యల ను గుర్తించినప్పుడే పరిష్కారాల ను మనం కనుగొనగలుగుతాం ’’
‘‘కాంటాక్ట్ లెస్ కస్టమ్స్, ఆటోమేటిక్ రిన్యూవల్స్, ఫేస్ లెస్ అసెస్ మెంట్స్, సేవ ను అందించడం కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు లు.. ఈ సంస్కరణ లు అన్నీ కూడాను ప్రభుత్వం యొక్క అనవసర జోక్యాన్ని అంతం చేసివేశాయి’’
‘‘ఆధునిక ప్రక్రియల ను అనుసరించడం ద్వారా సిఎజి శర వేగం గా మార్పునకు లోనైంది. ప్రస్తుతం మీరు అడ్ వాన్స్ డ్ ఎనలిటిక్స్ టూల్స్ ను, జియో స్పేశల్ డేటా ను, శాటిలైట్ ఇమేజరీ ని వినియోగిస్తున్నారు’’
‘‘21వ శతాబ్దం లో డేటా యే సమాచారం గా ఉన్నది, మరి రాబోయే కాలాల్లో మన చరిత్ర ను కూడా డేటా మాధ్యమం ద్వారానే గమనించడం, అర్థం చేసుకోవడం జరుగుతాయి. భవిష్యత్తు లో చరిత్ర ను చెప్పి రాయించేది డేటా యే’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒకటో ఆడిట్ దివస్ ఉత్సవం సూచకం గా ఏర్పాటైన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సర్ దార్ వల్లభ్ బాయి పటేల్ యొక్క విగ్రహాన్ని కూడా ఆయన ఈ సందర్భం లో ఆవిష్కరించారు. కంప్ట్రోలర్ ఎండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ గిరీశ్ చంద్ర ముర్ము సహా పలువురు ప్రముఖులు ఈ సందర్భం లో పాలుపంచుకొన్నవారిలో ఉన్నారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, సిఎజి అనేది దేశం యొక్క ఖాతాల ను గురించి పరిశీలన చేస్తూ ఉండడం ఒక్కటే కాకుండా ఉత్పాదకత, ఇంకా ప్రావీణ్యాల లో విలువ ను జోడించే పని ని కూడా చేస్తుంది. అందువల్ల ఆడిట్ డే నాడు జరిగే చర్చోపచర్చల కు తోడు సంబంధిత కార్యక్రమాలు మన మెరుగుదల మరియు ప్రత్యామ్నాయాన్ని కల్పించే కార్యాల లో ఒక భాగం గా ఉంటాయి. సిఎజి అనే సంస్థ యొక్క ప్రాముఖ్యం వృద్ధి చెందింది; కాలం గడుస్తున్న కొద్దీ ఒక ఉత్తరదాయిత్వాన్ని ఆ సంస్థ సృష్టించింది అన్నారు.

మహాత్మ గాంధీ కి, సర్ దార్ పటేల్ కు, ఇంకా బాబా సాహెబ్ ఆమ్బేడ్ కర్ కు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ మహా నాయకులు పెద్ద లక్ష్యాల ను ఏ విధం గా నిర్దేశించుకోవాలో, మరి వాటి ని ఏ విధం గా సాధించాలో మనకు బోధించారు అని ఆయన అన్నారు.

దేశం లో ఆడిటింగ్ ను ఆందోళన తోను, భయం తోను చూసిన కాలం అంటూ ఒకటి ఉండేది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘సిఎజి వర్సస్ గవర్నమెంట్’ అనేది మన వ్యవస్థ లో ఒక సామాన్యమైన ఆలోచన గా మారిపోయింది అని యన అన్నారు. కానీ, ప్రస్తుతం ఈ మనస్తత్వం మారింది అని ఆయన చెప్పారు. ఇవాళ ఆడిట్ ను విలువ జోడింపు లో ఒక ముఖ్య భాగం గా పరిగణించడం జరుగుతోంది అని ఆయన వివరించారు.

మునుపు, బ్యాంకింగ్ రంగం లో పారదర్శకత్వం లోపించినందువల్ల రక రకాల తప్పుడు పద్ధతుల ను ఆచరించడం జరిగింది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఫలితం గా బ్యాంకు ల వసూలు కాని రుణాలు (ఎన్ పిఎ స్) పెరుగుతూ పోయాయి అని ఆయన అన్నారు. ‘‘మీకు చాలా బాగా తెలుసు, గతం లో ఎన్ పిఎ స్ ను తివాచీ కింద కు తోసివేసిన సంగతి ని గురించి. ఏమైనప్పటి కీ, మేం ఇదివరకటి ప్రభుత్వాల తాలూకు వాస్తవాన్ని పూర్తి చిత్తశుద్ధి తో దేశం ఎదుట నిలిపాం. సమస్యల ను గుర్తించినప్పుడు మాత్రమే పరిష్కారాల ను మనం కనుగొనగలుగుతాం’’ అని ఆయన అన్నారు.

‘‘ప్రస్తుతం ‘సర్ కార్ సర్వమ్’ తాలూకు భావజాలం తగ్గుముఖం పడుతూ ఉన్నటువంటి ఒక వ్యవస్థ ను మేం తీర్చిదిద్దుతున్నాం. మరి మీ పని కూడా సులభం అవుతోంది’’ అని ప్రధాన మంత్రి ఆడిటర్ లతో అన్నారు. ఇది ‘మినిమమ్ గవర్నమెంట్ మేక్సిమమ్ గవర్నెన్స్’ (కనీస స్థాయి ప్రభుత్వం, గరిష్ఠ స్థాయి పాలన) కు అనుగుణం గా ఉంది. ‘‘కాంటాక్ట్ లెస్ కస్టమ్స్, ఆటోమేటిక్ రిన్యూవల్స్, ఫేస్ లెస్ అసెస్ మెంట్స్, సేవ ను అందించడం కోసం ఆన్ లైన్ మాధ్యమం ద్వారా దరఖాస్తు లు.. ఈ సంస్కరణ లు అన్నీ ప్రభుత్వ అనవసర జోక్యాన్ని అంతం చేశాయి’’ అని ఆయన వివరించారు.

ప్రభుత్వ ఫైళ్ళ లో , ఖాతా పుస్తకాల లో అదే పని గా తలదూర్చి బుర్ర బద్దలు కొట్టుకొనేటటువంటి ఒక సంస్థ గా పేరుపడగా ఆ ఇమేజి ని సిఎజి అధిగమించడం పట్ల ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘సిఎజి ఆధునిక విధానాల ను ఆచరించడం ద్వారా శరవేగం గా పరివర్తన చెందింది. ప్రస్తుతం మీరు అధునాతనమైనటువంటి విశ్లేషాత్మక సాధనాల ను, ఫలానా ప్రదేశాని కి చెందినటువంటి సమాచారాన్ని వెల్లడించడాన్ని, ఉపగ్రహాలు అందించే దృశ్యాల మాలికల ను ఉపయోగించుకొంటున్నారు’’ అని ఆయన ప్రస్తావించారు.

వందేళ్ళ లో తల ఎత్తిన అతి పెద్ద అంటువ్యాధి ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, దీనికి వ్యతిరేకం గా దేశం సలిపిన పోరు సైతం అసాధారణమైందన్నారు. ప్రస్తుతం మనం ప్రపంచం లోనే అత్యంత భారీ ది అయినటువంటి టీకాకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కొద్ది వారాల కిందటే, దేశం 100 కోట్ల వ్యాక్సీన్ డోజు ల మైలురాయి ని అధిగమించింది అని ఆయన చెప్పారు. ఈ ఘనమైన సమరం కాలం లో రూపు దిద్దుకొన్న అభ్యాసాల ను సిఎజి అధ్యయనం చేయవచ్చును అంటూ ఆయన ఒక సలహా ను ఇచ్చారు.

పాత కాలాల్లో, సమాచారాన్ని కథ ల ద్వారా అందించడం చేసేవారు అని ప్రధాన మంత్రి అన్నారు. చరిత్ర ను కథల రూపం లో రాయడం జరిగేది. కానీ, ప్రస్తుతం 21వ శతాబ్దం లో, డేటా యే సమాచారం గా ఉంది. మరి రాబోయే కాలాల్లో మన చరిత్ర ను కూడా డేటా ద్వారానే పరిశీలించడం, అర్థం చేసుకోవడం జరుగుతాయి. భవిష్యత్తు లో, డేటా యే చరిత్ర ను చెప్పి రాయిస్తుంది అంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage