‘‘రక్షణ రంగం లో ఆత్మనిర్భరత పై ఇటీవల కొన్నేళ్ల లో వహిస్తున్న శ్రద్ధ అనేది బడ్జెటులో స్పష్టం గా కనిపించింది’’
‘‘సామగ్రి మీ సొంత దేశం లో తయారు అయినప్పుడు మాత్రమే అద్వితీయత మరియుఆశ్చర్యకారక అంశాలు చోటు చేసుకొంటాయి’’
‘‘దేశం లోపలే తయారీ కోసం పరిశోధన, డిజైను, ఇంకా వికాసం లకై ఉద్దేశించిన ఒకచైతన్యవంతమైన ఇకోసిస్టమ్ ను అభివృద్ధి పరచడాని కి ఈ సంవత్సర బడ్జెటు ఒక నమూనా నుఆవిష్కరించింది’’
‘‘ఒక హుషారైన రక్షణ పరిశ్రమ వృద్ధిచెందాలి అంటే పారదర్శకమైన, కాలబద్ధమైన, ఆచరణీయమైన, నిష్పాక్షికమైన ట్రయల్, టెస్టింగ్,సర్టిఫికేశన్ వ్యవస్థ లు అత్యవసరం’’
వెబినార్ ను రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి ప్రసంగించిన బడ్జెటు సమర్పణ అనంతరం నిర్వహిస్తున్నటువంటి వెబినార్ ల వరుస లో ఈ వెబినార్ నాలుగో వెబినార్.

బడ్జెటు లో చేసిన ప్రకటన ల సందర్భం లో ‘ఆత్మనిర్భరత ఇన్ డిఫెన్స్ - కాల్ టు యాక్శన్’ (రక్షణ రంగం లో స్వయంసమృద్ధి- కార్యాచరణ కై పిలుపు) అనే శీర్షిక తో ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వెబినార్ ను రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి ప్రసంగించిన బడ్జెటు సమర్పణ అనంతరం నిర్వహిస్తున్నటువంటి వెబినార్ ల వరుస లో ఈ వెబినార్ నాలుగో వెబినార్.

‘ఆత్మనిర్భరత ఇన్ డిఫెన్స్ - కాల్ టు యాక్శన్’ పేరు తో ఏర్పాటైన ఈ వెబినార్ యొక్క ఇతివృత్తం దేశ ప్రజల భావన ను సూచిస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. రక్షణ రంగం లో స్వయంసమృద్ధి ని పటిష్ట పరచడం కోసం ఇటీవలి కొన్నేళ్ళ లో జరిగిన కృషి ఈ సంవత్సరం బడ్జెటు లో స్పష్టం గా కనిపిస్తోంది అని ఆయన అన్నారు. దేశం బానిసత్వం లో మగ్గిన కాలం లోనూ, ఇంకా స్వాతంత్యం తరువాతి కాలం లోనూ భారతదేశ రక్షణ తయారీ చాలా బలం గా ఉన్న సంగతి ని ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు. భారతదేశం లో తయారు చేసిన ఆయుధాలు రెండో ప్రపంచ యుద్ధ కాలం లో ఒక ప్రధానమైన పాత్ర ను పోషించాయి అని ఆయన అన్నారు. ‘‘తదనంతర కాలం లో మనదైన సత్తా కొంత మేరకు క్షీణించింది. అయినప్పటి కీ కూడాను అప్పుడు గాని లేదా ఇప్పుడు గాని దాని సామర్ధ్యం లో లోటేమీ రాలేదు’’ అని ఆయన అన్నారు.

ప్రత్యర్థులపై ఒక ఆశ్చర్యకరమైనటువంటి పైచేయి ని సాధించాలి అంటే గనుక రక్షణ వ్యవస్థల లో అద్వితీయత తో పాటు కస్టమైజేశన్ కు కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘సామగ్రి ని మీ సొంత దేశం లో తయారు చేసుకొన్నప్పుడు మాత్రమే అద్వితీయత, ఇంకా ఆశ్చర్యకరమైన అంశాలు చోటు చేసుకోగలుగుతాయి’’ అని ఆయన అన్నారు. ఈ సంవత్సరం బడ్జెటు లో దేశం లోపలే పరిశోధన పరం గా, డిజైన్ పరం గా, వికాసం పరం గా ఒక చైతన్యవంతమైనటువంటి ఇకోసిస్టమ్ ను కల్పించడానికి ఉద్దేశించిన ఒక బ్లూప్రింట్ ను పొందుపరచడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. రక్షణ బడ్జెటు లో ఇంచుమించు 70 శాతం భాగాన్ని స్వదేశీ పరిశ్రమ కోసం అట్టిపెట్టడం జరిగింది అని కూడా ఆయన వివరించారు.

రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు 200కు పైగా డిఫెన్స్ ప్లాట్ ఫార్మ్ స్ ఎండ్ ఎక్విప్ మెంట్స్ తాలూకు ఒక సకారాత్మక స్వదేశీకరణ జాబితాల ను విడుదల చేసింది. ఈ ప్రకటన వెలువడిన తరువాత, 54 వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందం దేశవాళీ కొనుగోళ్ల నిమిత్తం కుదుర్చుకోవడం జరిగింది అని ప్రధాన మంత్రి తెలిపారు. దీనికి అదనం గా 4.5 లక్షల కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగి ఉండే సామగ్రి కొనుగోలు ప్రక్రియ వివిధ దశల లో ఉంది అని ప్రధాన మంత్రి వెల్లడించారు. మూడో జాబితా త్వరలోనే వచ్చేందుకు అవకాశం ఉంది అని ఆయన అన్నారు.

ఆయుధాల కొనుగోలు తాలూకు ప్రక్రియ ఎంతటి దీర్ఘకాల ప్రక్రియ గా ఉంటూ వచ్చింది అంటే వాటిని చేర్చుకొంటూ ఉండే క్రమం లోనే అవి పాతబడిపోతాయి అంటూ ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. ‘‘దీనికి కూడా పరిష్కార మార్గం ‘ఆత్మనిర్భర్ భారత్’ లో మరియు ‘మేక్ ఇన్ ఇండియా’ లోనే ఉంది అని ఆయన స్పష్టం చేశారు. నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఆత్మనిర్భరత యొక్క ప్రాధాన్యాన్ని దృష్టి లో పెట్టుకొంటున్నందుకు సాయుధ దళాల ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఆయుధాలు, ఇంకా సామగ్రి వ్యవహారాల లో జవానుల గౌరవం, వారి భావాల పట్ల శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ఈ రంగాల లో మనం స్వయం సమృద్ధి ని అలవరచుకొంటేనే ఇది సాధ్యపడుతుంది అని ఆయన అన్నారు.

సైబర్ సెక్యూరిటీ అనేది డిజిటల్ ప్రపంచాని కి ఇక ఎంత మాత్రం పరిమితం కాదు. అది జాతీయ భద్రత కు సంబంధించిన ఒక అంశం అయిపోయింది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘మనం మనకు ఉన్నటువంటి బలవత్తరమైన ఐటి శక్తి ని రక్షణ రంగం లో ఎంత అధికం గా మోహరిస్తామో మన భద్రత కు సంబంధించినంత వరకు అంత అధిర విశ్వాసం తోనూ ఉండగలుగుతాం’’ అని ఆయన అన్నారు.

కాంట్రాక్టు ల కోసం రక్షణ తయారీదారు సంస్థ ల మధ్య స్పర్థ నెలకొనడం గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఇది అనేక సందర్భాల లో అవినీతి కి, డబ్బు మీది యావ కు దారితీసింది అన్నారు. ఆయుధాల వాంఛనీయత కు, ఆయుధాల నాణ్యత కు సంబంధించి బోలెడంత అయోమయాని కి తావు ఇవ్వడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఈ సమస్య ను పరిష్కరించ గలుగుతుంది అని ఆయన అన్నారు.

ఆయుధ కర్మాగారాలు దృఢ సంకల్పం తో ప్రగతి ని సాగిస్తున్నందుకు ఒక ఉజ్జ్వలమైనటువంటి ఉదాహరణ గా నిలచాయి అంటూ ప్రధాన మంత్రి కొనియాడారు. గడచిన కొన్నేళ్ళ లో ఆరంభించిన 7 కొత్త రక్షణ సంస్థ లు వాటి వ్యాపారాన్ని శరవేగం గా విస్తరించుకొంటూ, కొత్త కొత్త బజారుల కు చేరుకొంటూ ఉండటం పట్ల ప్రధాన మంత్రి ప్రసన్నత ను వ్యక్తం చేశారు. ‘‘మనం గడచిన అయిదారు సంవత్సరాల లో రక్షణ సంబంధి ఎగుమతుల ను 6 రెట్ల మేర పెంచుకొన్నాం. ప్రస్తుతం 75 కు పైగా దేశాల కు మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ ఉపకరణాల ను, సేవల ను సమకూర్చడం జరుగుతోంది’’ అని ప్రధాన మంత్రి తెలిపారు.

‘మేక్ ఇన్ ఇండియా’ కు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం ఫలితం గా గత 7 సంవత్సరాల లో రక్షణ సంబంధి తయారీ కోసం 350 కి పైగా కొత్త పారిశ్రామిక లైసెన్సులు జారీ చేయడమైంది అని ప్రధాన మంత్రి తెలిపారు. 2001వ సంవత్సరం నుంచి 2014వ సంవత్సరం మధ్య 14 ఏళ్ళ లో 200 లైసెన్సు లు మాత్రమే జారీ అయ్యాయి అని ఆయన పేర్కొన్నారు. డిఆర్ డిఒ మరియు పిఎస్ యుల తో సమానం గా ప్రైవేటు రంగం సైతం పనిచేయాలి అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ విషయాన్ని దృష్టి లో పెట్టుకొని రక్షణ సంబంధి పరిశోధన, అభివృద్ధి బడ్జెటు లో 25 శాతాన్ని పరిశ్రమ, స్టార్ట్-అప్స్, ఇంకా విద్య జగతి కోసం అట్టేపెట్టడమైంది. బడ్జెటు లో స్పెశల్ పర్పస్ వెహికల్ నమూనా ను కూడా పొందుపొరచాము. ‘‘ఇది ప్రైవేటు పరిశ్రమ యొక్క పాత్ర ను విక్రేతగానో లేక సరఫరాదారు గానో పరిమితం చేసే కన్నా ఒక భాగస్వామి స్థాయి కి చేర్చుతుంది’’ అని ఆయన అన్నారు.

ఒక చైతన్యవంతమైన రక్షణ పరిశ్రమ యొక్క వృద్ధి కి ట్రయల్, టెస్టింగ్, సర్టిఫికేశన్ లకు సంబంధించిన పారదర్శకమైనటేవంటి, కాలబద్ధమైనటువంటి, ఆచరణీయమైనటువంటి మరియు నిష్పాక్షికమైనటువంటి వ్యవస్థ లు ఎంతో అవసరం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ విషయం లో సమస్యల ను పరిష్కరించడం లో ఒక స్వతంత్ర వ్యవస్థ ఉండటం అనేది ఉపయోగకరం గా నిరూపణ కాగలదని కూడా ఆయన అన్నారు.

బడ్జెటు లో పేర్కొన్న అంశాల ను కాలబద్ధ రీతి లో అమలు పరచేందుకు కొత్త ఉపాయాల తో ముందుకు రావలసింది గా సంబంధిత వర్గాల కు ప్రధాన మంత్రి ఉద్బోధించారు. ఇటీవలి కొన్ని సంవత్సరాల లో బడ్జెటు తేదీ ని ఒక నెల ముందుకు జరిపిన చర్య తాలూకు పూర్తి అవకాశాన్ని స్టేక్ హోల్డర్స్ వినియోగించుకోవాలి, మరి బడ్జెటు అమలు తేదీ దగ్గరపడే సరికి రంగం లోకి దిగాలి అని ఆయన అన్నారు.

 

 

 

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi