భారత్ రత్న లు జయప్రకాశ్ నారాయణ్ కు, నానాజీ దేశ్ ముఖ్ కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
‘‘భారతదేశం లో ఇటువంటి నిర్ణయాత్మకమైన ప్రభుత్వం ఎన్నడూలేదు; అంతరిక్షరంగం లో, అంతరిక్ష సంబంధిత సాంకేతిక రంగం లో ప్రధానమైన సంస్కరణలే దీనికి ఒక ఉదాహరణ’’
‘‘అంతరిక్ష రంగ సంస్కరణ ల పట్ల ప్రభుత్వ విధానం 4 స్తంభాల పైన ఆధారపడి ఉంది’’
‘‘130 కోట్ల మంది దేశవాసుల ప్రగతి కి అంతరిక్ష రంగం ఒకపెద్ద మాధ్యమం గా ఉంది. భారతదేశాని కి అంతరిక్ష రంగం అంటే ఉత్తమమైన మేపింగ్, ఇమేజింగ్ సదుపాయాల తో పాటు సామాన్య ప్రజల కుఉత్తమమైన సంధాన సదుపాయాలు కూడాను అని అర్థం’’
‘‘ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమం ఓ దృష్టి కోణం మాత్రమే కాదు; అది బాగా ఆలోచించినటువంటి, చక్కనైన ప్రణాళిక తో కూడినటువంటి, ఏకీకృతమైనటువంటి ఆర్థిక వ్యూహం కూడా’’
‘‘ప్రభుత్వ రంగ సంస్థ ల విషయం లో ప్రభుత్వం ఒకస్పష్టమైన విధానం తో ముందుకు సాగుతోంది. మరి అది ఈ రంగాల లో ప్రభుత్వ ప్రమేయం ఉండనక్కరలేని చాలారంగాల తలుపుల ను ప్రైవేటు వాణిజ్య సంస్థల కోసం తెరుస్తున్నది. ఎయర్ ఇండియా విషయం లో తీసుకొన్న నిర్ణయం మా నిబద్ధత ను, గంభీరత్వాన్ని చాటుతున్నది’’
‘‘గత ఏడేళ్ళ కాలం లో స్పేస్ టెక్నాలజీ ని వ్యవస్థ లోనిఆఖరి స్థానం వరకు చేరుకొనే ఒక పరికరం గాను,లీకేజిలకు తావు ఉండనటువంటిదిగాను,పారదర్శకమైనపాలన కలిగిందిగాను మార్చడం జరిగింది’’
‘‘ఒక బలమైన స్టార్ట్-అప్ ఇకో సిస్టమ్ ను అభివృద్ధిపరచడం కోసం ప్లాట్ ఫార్మ్ అప్రోచ్ అనేది ఎంతో ముఖ్యం. ప్లాట్ ఫార్మ్ సిస్టమ్ అంటేఅందులో భాగం గా సులభ ప్రవేశానికి వీలు ఉన్నటువంటి, సార్వజనిక నియంత్రణ కలిగినటువంటి వేదికల ను ప్రభుత్వం నిర్మించి పరిశ్రమ కు,వాణిజ్యసంస్థల కు అందించడమే. ఈ మౌలిక వేదిక ఆధారం గా నవ పారిశ్రామికవేత్తలు కొత్త పరిష్కార మార్గాల నురూపొందిస్తారు’’

ఇండియన్ స్పేస్ అసోసియేశన్ (ఐఎస్ పిఎ) ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భం లో స్పేస్ ఇండస్ట్రీ కి చెందిన ప్రతినిధుల తో ఆయన సమావేశమయ్యారు.

శ్రోతల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు న ఇద్దరు దేశ గొప్ప పుత్రుల జయంతి కూడాను. వారే భారత్ రత్న జయప్రకాశ్ నారాయణ్, భారత్ రత్న నానాజీ దేశ్ ముఖ్ లు అని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారతదేశాని కి ఒక దిశ ను చూపడం లో ఈ మహానుభావులు ఇరువురూ ఒక పెద్ద పాత్ర ను పోషించారు అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రతి ఒక్కరి ని వెంట తీసుకు పోతూ, అందరి ప్రయాసల తో దేశం లో పెద్ద పెద్ద మార్పుల ను ఏ విధం గా సాకారం చేయవచ్చో వీరు నిరూపించారు అని ఆయన అన్నారు. జీవనం పట్ల వారికి ఉన్న సిద్ధాంతం మనకు ఈ రోజు కు కూడా ప్రేరణ ను ఇస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. ఆ మహనీయులిద్దరికి ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు.

భారతదేశం లో ప్రస్తుతం ఉన్నంతటి ఒక నిర్ణయాత్మక ప్రభుత్వం మునుపు ఎన్నడు లేదు అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ప్రస్తుతం అంతరిక్ష రంగం లో, స్పేస్ టెక్నాలజీ లో చోటు చేసుకొంటున్న ప్రధాన సంస్కరణ లు దీనికి ఒక ఉదాహరణ గా ఉన్నాయి అని ఆయన అన్నారు. ఇండియన్ స్పేస్ అసోసియేశన్ (ఐఎస్ పిఎ) స్థాపన కోసం ముందుకు వచ్చిన వారందరికీ ఆయన అభినందన లు తెలిపారు.

అంతరిక్ష రంగ సంస్కరణ ల విషయం లో భారత ప్రభుత్వ విధానం 4 స్తంభాల పై ఆధారపడి ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. వాటిలో ఒకటో స్తంభం - నూతన ఆవిష్కరణ ల కోసం ప్రైవేటు రంగాని కి స్వేచ్ఛ ను ఇవ్వడం, రెండో స్తంభం- ప్రభుత్వం ఒక సమన్వయ కర్త పాత్ర ను వహించడం, మూడో స్తంభం – భవిష్యత్తు కై యువత ను సిద్ధం చేయడం, ఇక నాలుగో స్తంభం ఏమిటి అంటే, అది సామాన్య మానవుడు పురోగతి చెందేందుకు అంతరిక్ష రంగాన్ని ఒక వనరు లాగా గుర్తించడం అని ప్రధాన మంత్రి వివరించారు. అంతరిక్ష రంగం అనేది 130 కోట్ల దేశ ప్రజల ప్రగతి కి ఒక ప్రధానమైన మాధ్యమం గా ఉంది అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. భారతదేశం విషయానికి వస్తే అంతరిక్ష రంగం అంటే సామాన్య ప్రజల కు ఉద్దేశించిన మెరుగైనటువంటి సంధాన సదుపాయాలు, మ్యాపింగ్ సదుపాయాలు, ఇంకా ఇమేజింగ్ సదుపాయాలు అని అర్థమని ఆయన అన్నారు. అంతేకాకుండా, అంతరిక్ష రంగం అంటే.. నవ పారిశ్రామికవేత్తల కు సరకుల ను మరింత వేగవంతంగా చేరవేయడం అని అర్థం. అంతేకాదు, అంతరిక్ష రంగం అనేది మత్స్యకారుల కు మరింత భద్రత, ఇతోధిక ఆదాయాన్ని అందించడం కోసం కూడా; అలాగే, ప్రాకృతిక విపత్తుల ను మరింత మెరుగ్గా ముందుగానే తెలుసుకోవడం కోసం కూడాను అని ఆయన వివరించారు.

స్వయం సమృద్ధియుతమైన భారతదేశం అనే ఉద్యమం కేవలం ఒక దృష్టి కోణమనే కాకుండా, బాగా ఆలోచించిన చక్కని ప్రణాళిక తో కూడిన ఏకీకృత ఆర్థిక వ్యూహం కూడా అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఈ వ్యూహం భారతదేశాన్ని భారతదేశం లోని యువత తో పాటు, భారతదేశం లోని నవ పారిశ్రామిక వేత్త ల సామర్ధ్యాల ను, నైపుణ్యాల ను పెంపొందింప చేయడం ద్వారా దేశాన్ని ఒక గ్లోబల్ మేన్యుఫాక్చరింగ్ పవర్ హౌస్ గా తీర్చిదిద్దగలదు అని ఆయన అన్నారు. ఈ వ్యూహం భారతదేశాని కి ఉన్న సాంకేతిక విజ్ఞాన పరమైన ప్రావీణ్యాన్ని ఆధారం గా చేసుకొని భారతదేశాన్ని నూతన ఆవిష్కరణల కు లక్షించిన ఒక ప్రపంచ కేంద్రం గా మార్చుతుంది అని ఆయన తెలిపారు. ఈ వ్యూహం ప్రపంచ అభివృద్ధి లో ఒక పెద్ద పాత్ర ను పోషిస్తుంది. ఇది భారతదేశం లోని మానవ వనరుల ప్రతిష్ట ను, భారతదేశం లోని ప్రతిభ ను ప్రపంచం అంతటా ఇనుమడింప చేస్తుంది అని కూడా ఆయన వివరించారు.

ప్రభుత్వ రంగ సంస్థల కు సంబంధించినంతవరకు ఒక స్పష్టమైన విధానం తో ప్రభుత్వం ముందుకు పయనిస్తున్నదని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రంగాల లో ప్రభుత్వం ప్రమేయం అక్కర లేనటువంటి చాలా వరకు రంగాల తలుపుల ను విధం గా ప్రైవేటు వాణిజ్య సంస్థల కోసం తెరుస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఎయర్ ఇండియా విషయం లో తీసుకొన్న నిర్ణయం మా వచన బద్ధత ను, మా గంభీరత్వాన్ని సూచిస్తున్నది అని ఆయన అన్నారు.

గడచిన 7 సంవత్సరాల లో లాస్ట్-మైల్ డెలివరీ కి, లీకేజీ లకు తావు ఉండనటువంటి, పారదర్శకమైనటువంటి పాలన కు ఒక సాధనం గా స్పేస్ టెక్నాలజీ ని మలచడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. పేదల కు ఉద్దేశించిన గృహ నిర్మాణం, రహదారులు, ఇంకా మౌలిక సదుపాయల కల్పన ప్రాజెక్టుల లో జియో ట్యాగింగ్ వినియోగాన్ని ఆయన ఈ సందర్భం లో ఉదాహరించారు. అభివృద్ధి పథకాల ను ఉపగ్రహాలు పంపే దృశ్యాల అండతో పర్యవేక్షించడం జరుగుతోంది అని ఆయన అన్నారు. ఫసల్ బీమా యోజన క్లెయిముల ను పరిష్కరించడం లో స్పేస్ టెక్నాలజీ ని ఉపయోగించడం జరుగుతోంది. మత్స్యకారుల కు నావిక్ (ఎన్ఎవిఐసి) సిస్టమ్ తోడ్పడుతోంది. అంతేకాకుండా, ఈ టెక్నాలజీ ద్వారా ప్రాకృతిక విపత్తుల వేళల్లో తగిన కార్యాచరణ ను కూడా చేపట్టడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి తెలిపారు. సాంకేతిక విజ్ఞానాన్ని అందరి అందుబాటు లోకి తీసుకు పోవడానికి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. డిజిటల్ టెక్నాలజీ కి సంబంధించి ఒక ఉదాహరణ ను ఆయన ఇస్తూ, ప్రస్తుతం భారతదేశం అగ్రగామి డిజిటల్ ఇకానమీ ల సరసన స్థానం సంపాదించుకొంది అంటే అందుకు కారణం మనం డేటా కు ఉన్న శక్తి ని నిరుపేద ల చెంత కు సైతం చేర్చగలగడమే అని ఆయన అన్నారు.

యువ నవ పారిశ్రామికవేత్త లు, మరియు స్టార్ట్-అప్ స్ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, పరిశ్రమ, యువ నూతన ఆవిష్కర్తలు, స్టార్ట్-అప్ స్ ను ప్రతి ఒక్క స్థాయి లోను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఒక బలమైన స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ ను అభివృద్ధి పరచాలి అంటే అందుకు ఒక ప్లాట్ ఫార్మ్ అప్రోచ్ ఎంతైనా ముఖ్యం అని ఆయన వివరించారు. ‘‘ఈ ప్లాట్ ఫార్మ్ సిస్టమ్ అనేది ఏమిటి అంటే దీనిలో భాగం గా ప్రభుత్వం, ఓపెన్-యాక్సెస్ పబ్లిక్ కంట్రోల్డ్ ప్లాట్ ఫార్మ్ లను నిర్మిస్తుంది, ఆ ప్లాట్ ఫార్మ్ స్ ను పరిశ్రమ కు, వాణిజ్య సంస్థల కు అందుబాటు లోకి తీసుకు పోతుంది అంటూ ఆయన విడమరచి చెప్పారు. ఈ మౌలిక ప్లాట్ ఫార్మ్ ఆధారం గా నవ పారిశ్రామిక వేత్త లు నూతన పరిష్కార మార్గాల ను సిద్ధం చేస్తారు’’ అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి దీనిని ఒక ఉదాహరణ ద్వారా పూసగుచ్చినట్లు వివరించారు. యుపిఐ ప్లాట్ ఫార్మ్ ఒక బలమైన ఫిన్ టెక్ నెట్ వర్క్ కు ప్రాతిపదిక అయింది అని ఆయన అన్నారు. ఈ తరహా ప్లాట్ ఫార్మ్ లను అంతరిక్ష రంగం లో, జియోస్పేశల్ రంగం లో, ఇంకా వివిధ రంగాల లో డ్రోన్ లను వినియోగించేటట్లుగా ప్రోత్సహించడం జరుగుతోంది అని ఆయన అన్నారు.

సభికులు ఈ రోజు న అందించే సూచనలు, సలహాల ద్వారాను, ఈ రంగం తో సంబంధం గల వర్గాల క్రియాశీల చొరవ ద్వారాను అతి త్వరలోనే ఒక ఉత్తమమైన స్పేస్ కామ్ పాలిసీ తో పాటు రిమోట్ సెన్సింగ్ పాలిసీ కూడా రూపుదాల్చుతాయన్న ఆశాభావాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

20 వ శతాబ్దం లో అంతరిక్షాన్ని మరియు అంతరిక్ష సంబంధి రంగాన్ని పరిపాలించడానికి జరిగిన ప్రయత్నాలు ఏ విధం గా ప్రపంచం లోని దేశాల ను విభజించిందీ ప్రధాన మంత్రి తన ప్రసంగం లో ప్రస్తావించారు. ఇప్పుడు ఈ 21 వ శతాబ్దం లో, ప్రపంచాన్ని కలుపుతూ ఒక్కటి గా చేయడం లో అంతరిక్షం ఒక ముఖ్య పాత్ర ను పోషించేటట్లు గా భారతదేశం చూడవలసివుంది అని ఆయన చెప్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'

Media Coverage

'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi condoles loss of lives due to stampede at New Delhi Railway Station
February 16, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives due to stampede at New Delhi Railway Station. Shri Modi also wished a speedy recovery for the injured.

In a X post, the Prime Minister said;

“Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.”