ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ప్రధానమంత్రి సంగ్రహాలయం’ ను సందర్శించవలసింది గా ప్రతి ఒక్కరినీ కోరారు.
ప్రధానమంత్రి సంగ్రహాలయ పర్యటన గురించి పూర్వ ప్రధాని దివంగత శ్రీ చంద్ర శేఖర్ కుమారుడు శ్రీ నీరజ్ శేఖర్ చేసిన ట్వీట్ కు, ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -
“గొప్ప వ్యక్తిత్వం గల చంద్రశేఖర్ గారి తో సమయాన్ని గడపడం, తద్వారా అనేక విషయాలు ఆయన నుండి నేర్చుకోవడం నా అదృష్టం గా భావిస్తున్నాను. ఈ ‘ప్రధానమంత్రి సంగ్రహాలయం’ లో శ్రీ చంద్ర శేఖర్ గారి తోపాటు ఇతర ప్రధాన మంత్రులు దేశాని కి చేసిన సేవలను, వారి జీవితాన్ని గురించిన విశేషాలను తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరు దీనిని సందర్శించాలని నేను కోరుతున్నాను’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
यह मेरा सौभाग्य था कि चंद्रशेखर जी जैसे महान व्यक्तित्व के साथ मुझे समय बिताने का मौका मिला और बहुत कुछ सीखने को मिला। प्रधानमंत्री संग्रहालय में देशवासी चंद्रशेखर जी के साथ ही अपने सभी प्रधानमंत्रियों के योगदान को देख पाएंगे। मैं हर किसी से अनुरोध करूंगा कि वो यहां जरूर जाएं। https://t.co/8Mm2z4Dpzl
— Narendra Modi (@narendramodi) April 18, 2023