దేశ విభజన విషాద సంస్మరణ దినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆనాటి బాధితులకు నివాళి అర్పించారు. అప్పటి భయానక విధ్వంసం సందర్భంగా మాతృభూమితో అనుబంధం కూకటివేళ్లతో పెకలించి వేయబడిన క్షణాల్లో వారనుభవించిన వేదనను గుర్తుచేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“దేశ విభజన విషాద సంస్కరణ దినం నేపథ్యంలో ఆనాడు అమరులైన భారతీయులకు శ్రద్ధాంజలి ఘటించాల్సిన సందర్భమిది. దీంతోపాటు మాతృభూమి నుంచి దూరం కావాల్సిన విషాద సమయంలో వారి వేదన, పోరాటం ఎంతటిదో ఇది మనకు గుర్తుచేస్తుంది. ఆనాటి త్యాగమూర్తులందరికీ నమస్కరిస్తూ నివాళి అర్పిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
विभाजन विभीषिका स्मृति दिवस उन भारतवासियों को श्रद्धापूर्वक स्मरण करने का अवसर है, जिनका जीवन देश के बंटवारे की बलि चढ़ गया। इसके साथ ही यह दिन उन लोगों के कष्ट और संघर्ष की भी याद दिलाता है, जिन्हें विस्थापन का दंश झेलने को मजबूर होना पड़ा। ऐसे सभी लोगों को मेरा शत-शत नमन।
— Narendra Modi (@narendramodi) August 14, 2023