స్వామి వివేకనంద 1893లో అమెరికాలోని షికాగోలో ఇచ్చిన ప్రఖ్యాత ఉపన్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.
భారతదేశం యుగయుగాలుగా అందిస్తున్న ఏకత్వం, శాంతి, సోదరభావాలతో కూడిన సందేశాన్ని ప్రపంచానికి వివేకనంద పరిచయం చేశారని, ఆ సందేశం తరాల తరబడి ప్రేరణను అందిస్తూనే ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘స్వామి వివేకనంద 1893లో ఇదే రోజున షికాగోలో గొప్ప ప్రసంగాన్నిచ్చారు. భారతదేశం యుగాలుగా అందిస్తూ వస్తున్న ఏకత్వం, శాంతి, ఇంకా సోదరభావాల సందేశాన్ని ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన చెప్పిన మాటలు తరాల తరబడి ప్రేరణను అందిస్తూ వస్తున్నాయి. కలివిడితనానికీ, సామరస్యానికీ ఎంతటి శక్తి ఉందో ఆయన పలుకులు మనకు గుర్తు చేస్తున్నాయి’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
On this day in 1893, Swami Vivekananda delivered his iconic address in Chicago. He introduced India’s ages old message of unity, peace and brotherhood to the world. His words continue to inspire generations, reminding us of the power of togetherness and harmony.…
— Narendra Modi (@narendramodi) September 11, 2024