రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెను స్మరించుకున్నారు. ఆమె ధైర్యసాహసాలు, దేశం కోసం చేసిన అనిర్వచనీయ త్యాగం చిరస్మరణీయమని శ్రీ మోదీ అన్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“రాణి లక్ష్మీబాయి జయంతి నేపథ్యంలో ఆమెను స్మరించుకుంటున్నాను. ఆమె ధైర్యసాహసాలు దేశం కోసం చేసిన త్యాగం చిరస్మరణీయం. వలస పాలనపై ఆమె మొక్కవోని పోరాటం మనకెంతో స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా గత సంవత్సరం ఇదేరోజున నేను ఝాన్సీని సందర్శించిన జ్ఞాపకాలను మీతో పంచుకుంటున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Remembering Rani Lakshmibai on her Jayanti. Her courage and monumental contribution to our nation can never be forgotten. She is a source of inspiration for her steadfast opposition to colonial rule. Sharing glimpses from my visit to Jhansi on this day last year. pic.twitter.com/76oWhwL9bn
— Narendra Modi (@narendramodi) November 19, 2022