ఆచార్య కృపలానీ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. ఆచార్య కృపలానీ భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఒక సమున్నతమైన వ్యక్తి గా ఆయనను స్మరించుకొంటున్నాం. మేధాసంపత్తి, నైతిక నిష్ఠ, ధైర్య సాహసాలు ఆయనలో మూర్తీభవించి ఉన్నాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పేద ప్రజలకు, సమాజంలో ఆదరణకు నోచుకోని వర్గాల వారికి సాధికారితను అందించే సమృద్ధమైన, శక్తిమంతమైన భారతదేశాన్ని నిర్మించాలన్న ఆయన పవిత్ర ఆశయాలను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.
సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘ఆచార్య కృపలానీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకొంటున్నాను. మన దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆయన ఒక సమున్నత వ్యక్తి; అంతేకాదు, మేధాసంపత్తి, నైతిక నిష్ఠ, ఇంకా ధైర్య- సాహసాలకు ప్రతీకగా నిలిచారు. ప్రజాస్వామ్య విలువలకు, సామాజిక న్యాయ సిద్ధాంతాలకు ఆయన ఎంతో ప్రాధాన్యాన్ని ఇచ్చారు.
అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఆచార్య కృపలానీ ఎన్నడూ భయపడలేదు. పేద ప్రజలకు, సమాజంలో ఆదరణకు నోచుకోని వర్గాల వారికి సాధికారితను కల్పించే సమృద్ధమైన, శక్తిమంతమైన భారతదేశాన్నిఆవిష్కరించాలన్న ఆయన పవిత్ర ఆశయనాన్ని నెరవేర్చడానికి మా నిబద్ధతను మేం పునరుద్ఘాటిస్తున్నాం.’’
Remembering Acharya Kripalani on his birth anniversary. He was a towering figure in India’s freedom struggle and an embodiment of intellect, integrity and courage. He was deeply committed to democratic values and principles of social justice.
— Narendra Modi (@narendramodi) November 11, 2024
Acharya Kripalani was unafraid to…