Quote9.75 కోట్లపై చిలుకు లబ్దిదారు రైతు కుటుంబాల ఖాతాల లోకి 19,500 కోట్ల రూపాయలకు పైగా నేరు గా బదలాయించడమైంది
Quoteభారతదేశంస్వాతంత్య్రం తరువాతి 100 సంవత్సరాల ను పూర్తి చేసుకొనే 2047వసంవత్సరం వచ్చే సరికి దేశం ఏ స్థితి లో ఉండాలో నిర్ణయించడం లో మనవ్యవసాయానికి, మన రైతుల కు ఒక ప్రధానమైన పాత్ర ఉంది:ప్రధాన మంత్రి
Quoteఎమ్ఎస్పి ల వద్ద రైతుల నుంచి అత్యంత భారీ స్థాయి లో కొనుగోళ్లు జరిగాయి; ఫలితంగా, 1,70,000 కోట్ల రూపాయలు ధాన్యం రైతుల ఖాతాల లోకి , దాదాపుగా 85,000 కోట్ల రూపాయలు గోధుమల రైతుల ఖాతాల లోకినేరు గా చేరాయి: ప్రధాన మంత్రి
Quoteతనఅభ్యర్థన ను విని, గడిచిన 50 సంవత్సరాలలో కాయధాన్యాల దిగుబడి ని పెంచినందుకు రైతుల కు ఆయన ధన్యవాదాలు తెలిపారు
Quoteదేశం ఖాద్యతైలాల రంగం లో స్వావలంబన సాధన కు ఒక ప్రతిన ను పూనింది.. అదే నేశనల్ ఎడిబుల్ ఆయిల్మిశన్-ఆయిల్ పామ్.. ఎన్ఎమ్ఇఒ-ఒపి; 11,000 కోట్ల రూపాయల కు పైగా పెట్టుబడి నికుకింగ్ ఆయిల్ ఇకోసిస్టమ్ లో పెట్టడం జరుగుతుంది: ప్రధాన మంత్రి
Quoteభారతదేశంవ్యవసాయ ఎగుమతుల పరం గా చూసినప్పుడు, ప్రపంచం లోని అగ్రగామి 10 దేశాలలో ఒకటి గా తొలిసారి నిలచింది: ప్రధాన మంత్రి
Quoteచిన్న రైతుల కు ప్రస్తుతం దేశ వ్యవసాయ రంగ విధానాల లో అత్యంత ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతోంది: ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ (పిఎమ్ -కిసాన్) లో భాగం గా ఇచ్చే ఆర్థిక ప్రయోజనం తాలూకు తరువాతి కిస్తీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు అంటే ఆగస్టు 9న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా విడుదల చేశారు. దీనితో 9.75 కోట్లకు పై చిలుకు లబ్ధిదారు రైతు కుటుంబాల కు 19,500 కోట్ల రూపాయల ఎంతో విలువైన సొమ్ము ను బదలాయించడానికి వీలు చిక్కింది. ఇది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్) లో భాగం గా ఇచ్చినటువంటి ఆర్థిక ప్రయోజనం తాలూకు తొమ్మిదో కిస్తీ. ఈ కార్యక్రమం లో లబ్ధిదారు రైతుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.

|

శ్రోత ల సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, నాటు ల కాలం గురించి ప్రస్తావించారు. ఈరోజు రైతుల కు అందిన సొమ్ము వారికి సహాయకారి కాగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఒక లక్ష కోట్ల రూపాయల మూల నిధి తో ప్రవేశపెట్టిన కిసాన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పథకం ఈరోజు న ఒక సంవత్సర కాలాన్ని కూడా పూర్తి చేసుకొందని ఆయన పేర్కొన్నారు. ‘మిశన్ హనీ బీ’, ఇంకా జమ్ము- కశ్మీర్ కేసరి నాఫెడ్ దుకాణాల లో లభ్యం అయ్యేటట్టు చూడడం వంటి కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. ‘మిశన్ హనీ బీ’ లో భాగం గా 700 కోట్ల రూపాయల విలువైన తేనె ఎగుమతి ద్వారా రైతుల కు అదనపు ఆదాయం అందిందన్నారు.

|

త్వరలో రానున్న 75వ స్వాతంత్య్ర దినాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, ఆ సందర్భం గర్వ కారణమైందే కాకుండా నవ సంకల్పాల కు ఒక అవకాశం కూడాను అని వ్యాఖ్యానించారు. రానున్న 25 సంవత్సరాల లో భారతదేశం ఎక్కడ కు చేరుకోవాలో నిర్ధారణ చేయడం కోసం ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవలసి ఉంది అని ఆయన అన్నారు. 2047 వ సంవత్సరం లో భారత దేశం 100 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పూర్తి చేసుకోబోయేటప్పటికల్లా దేశం స్థితి ని ఖాయపరచడంలో మన వ్యవసాయాని కి మన రైతుల కు ఒక ప్రముఖ పాత్ర ఉంటుంది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. కొత్త సవాళ్ల ను ఎదుర్కోవడానికి, నూతన అవకాశాల తాలూకు ప్రయోజనాల ను పొందడానికి భారతదేశ వ్యవసాయ రంగాని కి ఒక దిశ ను అందించే కాలం ఆసన్నం అయ్యిందన్నారు. మారుతున్న కాలాల డిమాండుల కు అనుగుణం గా భారతదేశ వ్యవసాయం లో మార్పు చేర్పు లు అవసరం అని ఆయన పిలుపునిచ్చారు. మహమ్మారి కాలం లో రికార్డ్ స్థాయి ఉత్పత్తి ని సాధించినందుకు రైతుల ను ఆయన కొనియాడారు. కష్ట కాలం లో రైతుల కు ఇబ్బందుల ను తగ్గించడానికి ప్రభుత్వం తీసుకొన్న చర్యల ను గురించి ఆయన వివరించారు. విత్తనాలు, ఎరువుల సరఫరా లో అంతరాయాలు ఎదురవకుండా చూడటంతో పాటు బజారు లు అందుబాటు లో ఉండేలా ప్రభుత్వం పూచీ పడింది అని ఆయన తెలిపారు. యూరియా లభ్యత లో కొదవంటూ లేదు, అంతర్జాతీయ బజారు లో డిఎపి ధరలు అనేక రెట్లు పెరిగినప్పుడు రైతులపై ఎలాంటి భారం పడకుండాప్రభుత్వం తక్షణం 12000 కోట్ల రూపాయల ను అందుకోసం సర్దుబాటు చేసిందన్నారు.

|

కనీస మద్దతు ధర (ఎమ్ఎస్ పి) వద్ద రైతుల నుంచి అత్యంత భారీ స్థాయి లో ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టిందని ప్రధాన మంత్రి అన్నారు. ఫలితం గా దాదాపు 1,70,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల లోకి, అలాగే సుమారు 85,000 కోట్ల రూపాయలు గోధుమ రైతుల ఖాతాల లోకి నేరు గా చేరాయి అని వివరించారు.

కాయ ధాన్యాల ఉత్పత్తి ని పెంచవలసిందిగా రైతుల కు తాను విజ్ఞప్తి చేసినట్లు ప్రధాన మంత్రి గుర్తు చేశారు. దీని ఫలితం గా గత ఆరు సంవత్సరాల లో దేశం లో కాయధాన్యాల ఉత్పత్తి దాదాపు 50 శాతం మేర వృద్ది చెందిందని ఆయన అన్నారు.

|

ఖాద్య తైలం విషయం లో ఆత్మనిర్భరత ను సాధించడం కోసం నేశనల్ ఎడిబుల్ ఆయిల్ మిశన్- ఆయిల్ పామ్.. అదే, ఎన్ఎమ్ఒఒ-ఒపి ని ఒక ప్రతిజ్ఞ గా స్వీకరించిన సంగతి ని ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొన్నారు. ఈ రోజు న, దేశం క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్మరించుకొంటున్న ఈ చరిత్రాత్మకమైనటువంటి రోజు న, ఈ విధమైన సంకల్పం మనలో ఒక కొత్త శక్తి ని నింపుతోందని ఆయన అన్నారు. నేశనల్ ఎడిబుల్ ఆయిల్ మిశన్- ఆయిల్ పామ్ మిశన్ ద్వారా కుకింగ్ ఆయిల్ పామ్ మిషన్ ఇకోసిస్టమ్ లో 11,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టడం జరుగుతుందన్నారు. నాణ్యమైన విత్తనాలు మొదలుకొని సాంకేతిక విజ్ఞానం వరకు అన్ని సౌకర్యాల ను రైతులు పొందేటట్లు గా ప్రభుత్వం జాగ్రత వహిస్తుందన్నారు. ఈ రోజు న మొట్టమొదటి సారి గా భారతదేశం వ్యవసాయ సంబంధిత ఎగుమతుల విషయం లో ప్రపంచం లో అగ్రగామి 10 దేశాల సరసన నిలచిందని ప్రధాన మంత్రి తెలిపారు. కరోనా కాలం లో వ్యావసాయక ఎగుమతుల లో దేశం కొత్త రెకార్డుల ను నెలకల్పిందన్నారు. ప్రస్తుతం ఒక పెద్ద వ్యవసాయ ఎగుమతి దేశం గా భారతదేశం గుర్తింపు ను పొందుతూ ఉన్నటువంటి తరుణం లో, ఖాద్య తైలాల అవసరాల కోసమని దిగుమతుల మీద ఆధారపడటం సరి కాదు అని ఆయన అన్నారు.

దేశం లో వ్యవసాయ విధానాల లో చిన్న రైతుల కు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ స్ఫూర్తి తో గత కొన్ని సంవత్సరాలు గా ఈ చిన్న రైతుల కు భద్రత ను, సౌకర్యాన్ని అందించడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి లో బాగం గా ఇంతవరకు రైతుల కు 1 లక్షా 60 కోట్ల రూపాయల ను ఇవ్వడమైందన్నారు. ఆ మొత్తం లో 1 లక్ష కోట్ల రూపాయల ను మహమ్మారి కాలం లో చిన్న రైతులకు బదలాయిండం జరిగిందని తెలిపారు. 2 కోట్ల కు పైగా కిసాన్ క్రెడిట్ కార్డుల ను కరోనా కాలం లో జారీ చేయగా వాటిలో చాలా వరకు చిన్న రైతుల కు ఇవ్వడం జరిగిందన్నారు. వ్యవసాయ రంగం లో మౌలిక సదుపాయాలు, సంధాన సంబంధి మౌలిక సదుపాయాలు ఆ తరహా రైతుల కు ప్రయోజనకరం గా ఉంటాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఫూడ్ పార్కులు, కిసాన్ రైళ్లు వంటి కార్యక్రమాలు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వంటివి చిన్న రైతుల కు సహాయకారి గా ఉంటాయన్నారు. కిందటి సంవత్సరం లో 6 వేలకు పైగా పథకాల కు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లో భాగం గా ఆమోదం తెలియజేయడమైందన్నారు. ఈ విధానాలు చిన్న రైతుల కు బజారు లు అందుబాటులోకి రావడాన్ని విస్తృతం చేస్తాయని, అంతేకాకుండా ఎఫ్ పిఒ ల రూపం లో చిన్న రైతు బేరమాడే శక్తి పెరుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Over 100K internships on offer in phase two of PM Internship Scheme

Media Coverage

Over 100K internships on offer in phase two of PM Internship Scheme
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 ఫెబ్రవరి 2025
February 20, 2025

Citizens Appreciate PM Modi's Effort to Foster Innovation and Economic Opportunity Nationwide