ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ (పిఎమ్ -కిసాన్) లో భాగం గా ఇచ్చే ఆర్థిక ప్రయోజనం తాలూకు తరువాతి కిస్తీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు అంటే ఆగస్టు 9న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా విడుదల చేశారు. దీనితో 9.75 కోట్లకు పై చిలుకు లబ్ధిదారు రైతు కుటుంబాల కు 19,500 కోట్ల రూపాయల ఎంతో విలువైన సొమ్ము ను బదలాయించడానికి వీలు చిక్కింది. ఇది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్) లో భాగం గా ఇచ్చినటువంటి ఆర్థిక ప్రయోజనం తాలూకు తొమ్మిదో కిస్తీ. ఈ కార్యక్రమం లో లబ్ధిదారు రైతుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.
శ్రోత ల సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, నాటు ల కాలం గురించి ప్రస్తావించారు. ఈరోజు రైతుల కు అందిన సొమ్ము వారికి సహాయకారి కాగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఒక లక్ష కోట్ల రూపాయల మూల నిధి తో ప్రవేశపెట్టిన కిసాన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పథకం ఈరోజు న ఒక సంవత్సర కాలాన్ని కూడా పూర్తి చేసుకొందని ఆయన పేర్కొన్నారు. ‘మిశన్ హనీ బీ’, ఇంకా జమ్ము- కశ్మీర్ కేసరి నాఫెడ్ దుకాణాల లో లభ్యం అయ్యేటట్టు చూడడం వంటి కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. ‘మిశన్ హనీ బీ’ లో భాగం గా 700 కోట్ల రూపాయల విలువైన తేనె ఎగుమతి ద్వారా రైతుల కు అదనపు ఆదాయం అందిందన్నారు.
త్వరలో రానున్న 75వ స్వాతంత్య్ర దినాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, ఆ సందర్భం గర్వ కారణమైందే కాకుండా నవ సంకల్పాల కు ఒక అవకాశం కూడాను అని వ్యాఖ్యానించారు. రానున్న 25 సంవత్సరాల లో భారతదేశం ఎక్కడ కు చేరుకోవాలో నిర్ధారణ చేయడం కోసం ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవలసి ఉంది అని ఆయన అన్నారు. 2047 వ సంవత్సరం లో భారత దేశం 100 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని పూర్తి చేసుకోబోయేటప్పటికల్లా దేశం స్థితి ని ఖాయపరచడంలో మన వ్యవసాయాని కి మన రైతుల కు ఒక ప్రముఖ పాత్ర ఉంటుంది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. కొత్త సవాళ్ల ను ఎదుర్కోవడానికి, నూతన అవకాశాల తాలూకు ప్రయోజనాల ను పొందడానికి భారతదేశ వ్యవసాయ రంగాని కి ఒక దిశ ను అందించే కాలం ఆసన్నం అయ్యిందన్నారు. మారుతున్న కాలాల డిమాండుల కు అనుగుణం గా భారతదేశ వ్యవసాయం లో మార్పు చేర్పు లు అవసరం అని ఆయన పిలుపునిచ్చారు. మహమ్మారి కాలం లో రికార్డ్ స్థాయి ఉత్పత్తి ని సాధించినందుకు రైతుల ను ఆయన కొనియాడారు. కష్ట కాలం లో రైతుల కు ఇబ్బందుల ను తగ్గించడానికి ప్రభుత్వం తీసుకొన్న చర్యల ను గురించి ఆయన వివరించారు. విత్తనాలు, ఎరువుల సరఫరా లో అంతరాయాలు ఎదురవకుండా చూడటంతో పాటు బజారు లు అందుబాటు లో ఉండేలా ప్రభుత్వం పూచీ పడింది అని ఆయన తెలిపారు. యూరియా లభ్యత లో కొదవంటూ లేదు, అంతర్జాతీయ బజారు లో డిఎపి ధరలు అనేక రెట్లు పెరిగినప్పుడు రైతులపై ఎలాంటి భారం పడకుండాప్రభుత్వం తక్షణం 12000 కోట్ల రూపాయల ను అందుకోసం సర్దుబాటు చేసిందన్నారు.
కనీస మద్దతు ధర (ఎమ్ఎస్ పి) వద్ద రైతుల నుంచి అత్యంత భారీ స్థాయి లో ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టిందని ప్రధాన మంత్రి అన్నారు. ఫలితం గా దాదాపు 1,70,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల లోకి, అలాగే సుమారు 85,000 కోట్ల రూపాయలు గోధుమ రైతుల ఖాతాల లోకి నేరు గా చేరాయి అని వివరించారు.
కాయ ధాన్యాల ఉత్పత్తి ని పెంచవలసిందిగా రైతుల కు తాను విజ్ఞప్తి చేసినట్లు ప్రధాన మంత్రి గుర్తు చేశారు. దీని ఫలితం గా గత ఆరు సంవత్సరాల లో దేశం లో కాయధాన్యాల ఉత్పత్తి దాదాపు 50 శాతం మేర వృద్ది చెందిందని ఆయన అన్నారు.
ఖాద్య తైలం విషయం లో ఆత్మనిర్భరత ను సాధించడం కోసం నేశనల్ ఎడిబుల్ ఆయిల్ మిశన్- ఆయిల్ పామ్.. అదే, ఎన్ఎమ్ఒఒ-ఒపి ని ఒక ప్రతిజ్ఞ గా స్వీకరించిన సంగతి ని ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొన్నారు. ఈ రోజు న, దేశం క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్మరించుకొంటున్న ఈ చరిత్రాత్మకమైనటువంటి రోజు న, ఈ విధమైన సంకల్పం మనలో ఒక కొత్త శక్తి ని నింపుతోందని ఆయన అన్నారు. నేశనల్ ఎడిబుల్ ఆయిల్ మిశన్- ఆయిల్ పామ్ మిశన్ ద్వారా కుకింగ్ ఆయిల్ పామ్ మిషన్ ఇకోసిస్టమ్ లో 11,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టడం జరుగుతుందన్నారు. నాణ్యమైన విత్తనాలు మొదలుకొని సాంకేతిక విజ్ఞానం వరకు అన్ని సౌకర్యాల ను రైతులు పొందేటట్లు గా ప్రభుత్వం జాగ్రత వహిస్తుందన్నారు. ఈ రోజు న మొట్టమొదటి సారి గా భారతదేశం వ్యవసాయ సంబంధిత ఎగుమతుల విషయం లో ప్రపంచం లో అగ్రగామి 10 దేశాల సరసన నిలచిందని ప్రధాన మంత్రి తెలిపారు. కరోనా కాలం లో వ్యావసాయక ఎగుమతుల లో దేశం కొత్త రెకార్డుల ను నెలకల్పిందన్నారు. ప్రస్తుతం ఒక పెద్ద వ్యవసాయ ఎగుమతి దేశం గా భారతదేశం గుర్తింపు ను పొందుతూ ఉన్నటువంటి తరుణం లో, ఖాద్య తైలాల అవసరాల కోసమని దిగుమతుల మీద ఆధారపడటం సరి కాదు అని ఆయన అన్నారు.
దేశం లో వ్యవసాయ విధానాల లో చిన్న రైతుల కు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ స్ఫూర్తి తో గత కొన్ని సంవత్సరాలు గా ఈ చిన్న రైతుల కు భద్రత ను, సౌకర్యాన్ని అందించడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి లో బాగం గా ఇంతవరకు రైతుల కు 1 లక్షా 60 కోట్ల రూపాయల ను ఇవ్వడమైందన్నారు. ఆ మొత్తం లో 1 లక్ష కోట్ల రూపాయల ను మహమ్మారి కాలం లో చిన్న రైతులకు బదలాయిండం జరిగిందని తెలిపారు. 2 కోట్ల కు పైగా కిసాన్ క్రెడిట్ కార్డుల ను కరోనా కాలం లో జారీ చేయగా వాటిలో చాలా వరకు చిన్న రైతుల కు ఇవ్వడం జరిగిందన్నారు. వ్యవసాయ రంగం లో మౌలిక సదుపాయాలు, సంధాన సంబంధి మౌలిక సదుపాయాలు ఆ తరహా రైతుల కు ప్రయోజనకరం గా ఉంటాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఫూడ్ పార్కులు, కిసాన్ రైళ్లు వంటి కార్యక్రమాలు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వంటివి చిన్న రైతుల కు సహాయకారి గా ఉంటాయన్నారు. కిందటి సంవత్సరం లో 6 వేలకు పైగా పథకాల కు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లో భాగం గా ఆమోదం తెలియజేయడమైందన్నారు. ఈ విధానాలు చిన్న రైతుల కు బజారు లు అందుబాటులోకి రావడాన్ని విస్తృతం చేస్తాయని, అంతేకాకుండా ఎఫ్ పిఒ ల రూపం లో చిన్న రైతు బేరమాడే శక్తి పెరుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు.
अब से कुछ दिन बाद ही 15 अगस्त आने वाला है।
— PMO India (@PMOIndia) August 9, 2021
इस बार देश अपना 75वां स्वतंत्रता दिवस मनाने जा रहा है।
ये महत्वपूर्ण पड़ाव हमारे लिए गौरव का तो है ही, ये नए संकल्पों, नए लक्ष्यों का भी अवसर है।
इस अवसर पर हमें तय करना है कि आने वाले 25 वर्षों में हम भारत को कहां देखना चाहते हैं: PM
देश जब आज़ादी के 100 वर्ष पूरे करेगा, 2047 में तब भारत की स्थिति क्या होगी, ये तय करने में हमारी खेती, हमारे किसानों की बहुत बड़ी भूमिका है।
— PMO India (@PMOIndia) August 9, 2021
ये समय भारत की कृषि को एक ऐसी दिशा देने का है, जो नई चुनौतियों का सामना कर सके और नए अवसरों का लाभ उठा सके: PM @narendramodi
सरकार ने खरीफ हो या रबी सीज़न, किसानों से MSP पर अब तक की सबसे बड़ी खरीद की है।
— PMO India (@PMOIndia) August 9, 2021
इससे, धान किसानों के खाते में लगभग 1 लाख 70 हज़ार करोड़ रुपए और गेहूं किसानों के खाते में लगभग 85 हज़ार करोड़ रुपए डायरेक्ट पहुंचे हैं: PM @narendramodi
कुछ साल पहले जब देश में दालों की बहुत कमी हो गई थी, तो मैंने देश के किसानों से दाल उत्पादन बढ़ाने का आग्रह किया था।
— PMO India (@PMOIndia) August 9, 2021
मेरे उस आग्रह को देश के किसानों ने स्वीकार किया।
परिणाम ये हुआ कि बीते 6 साल में देश में दाल के उत्पादन में लगभग 50 प्रतिशत की वृद्धि हुई है: PM @narendramodi
इस मिशन के माध्यम से खाने के तेल से जुड़े इकोसिस्टम पर 11 हज़ार करोड़ रुपए से अधिक का निवेश किया जाएगा।
— PMO India (@PMOIndia) August 9, 2021
सरकार ये सुनिश्चित करेगी कि किसानों को उत्तम बीज से लेकर टेक्नॉलॉजी, हर सुविधा मिले: PM @narendramodi
खाने के तेल में आत्मनिर्भरता के लिए अब राष्ट्रीय खाद्य तेल मिशन-ऑयल पाम यानि NMEO-OP का संकल्प लिया गया है।
— PMO India (@PMOIndia) August 9, 2021
आज जब देश भारत छोड़ो आंदोलन को याद कर रहा है, तो इस ऐतिहासिक दिन ये संकल्प हमें नई ऊर्जा से भर देता है: PM @narendramodi
आज भारत कृषि निर्यात के मामले में पहली बार दुनिया के टॉप-10 देशों में पहुंचा है। कोरोना काल में देश ने कृषि निर्यात के नए रिकॉर्ड बनाए हैं।
— PMO India (@PMOIndia) August 9, 2021
आज जब भारत की पहचान एक बड़े कृषि निर्यातक देश की बन रही है तब हम खाद्य तेल की अपनी ज़रूरतों के लिए आयात पर निर्भर रहें, ये उचित नहीं है: PM