జల్‌జీవన్ మిషన్‌ను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ప్రజారోగ్యంలో పరిశుభ్ర-సురక్షిత తాగునీటి సౌలభ్యం ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు. కాగా, సార్వత్రిక కొళాయి నీటి సరఫరా ద్వారా డయేరియా వంటి వ్యాధివల్ల సంభవించే మరణాల నుంచి 4 లక్షల మందికి ప్రారణరక్షణ లభిస్తుందని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదికలో వెల్లడించడాన్ని కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్ వరుస ట్వీట్లద్వారా ప్రకటించారు.
ఈ వరుస ట్వీట్లకు స్పందనగా పంపిన సందేశంలో:
“ప్రతి భారతీయుడికీ పరిశుభ్ర-సురక్షిత తాగునీటి సౌలభ్యమే ప్రజారోగ్యానికి పటిష్ట పునాది. అందుకే దేశంలో ప్రతి ఒక్కరికీ కొళాయిద్వారా నీరందించే లక్ష్యంతో జల్‌జీవన్ మిషన్ రూపొందించబడింది. ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు నూతనోత్తేజం కల్పించడాన్ని కొనసాగిస్తాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Jal Jeevan Mission was envisioned to ensure that every Indian has access to clean and safe water, which is a crucial foundation for public health. We will continue to strengthen this Mission and boosting our healthcare system. https://t.co/lAwx6DSyfK
— Narendra Modi (@narendramodi) June 9, 2023