అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీశక్తికి వందనం చేస్తున్నానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
దేశంలోని మహిళల సాధికారత లక్ష్యంగా తమ ప్రభుత్వం సదా కృషి చేస్తున్నదని వివరిస్తూ- నేను ఇదివరకే వాగ్దానం చేసిన మేరకు విభిన్న రంగాలలో తమదైన ముద్ర వేస్తున్న మహిళామణులకు ఈ రోజున నా సామాజిక మాధ్యమ ఖాతాలను అప్పగిస్తున్నాను అని శ్రీ మోదీ ప్రకటించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా పంపిన సందేశంలో:
"#మహిళా దినోత్సవం సందర్భంగా మన నారీశక్తికి సగౌరవ వందనం! మా ప్రభుత్వం సదా మహిళల సాధికారత కోసం కృషి చేస్తుంది. మా పథకాలు, కార్యక్రమాలు ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక నేనిదివరకే వాగ్దానం చేసిన ప్రకారం- విభిన్న రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్న మహిళామణులకు ఇవాళ నా సామాజిక మాధ్యమ ఖాతాలను స్వాధీనం చేస్తున్నాను!" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
We bow to our Nari Shakti on #WomensDay! Our Government has always worked for empowering women, reflecting in our schemes and programmes. Today, as promised, my social media properties will be taken over by women who are making a mark in diverse fields! pic.twitter.com/yf8YMfq63i
— Narendra Modi (@narendramodi) March 8, 2025