గిర్ ను గురించి, ఆసియా సింహాలను గురించి రాజ్య సభ సభ్యుడు శ్రీ పరిమళ్ నాథ్ వానీ వ్రాసిన ఒక కాఫీ టేబుల్ బుక్ ‘‘కాల్ ఆఫ్ ద గిర్’’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వీకరించారు.
ఈ పుస్తకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి శ్రీ పరిమళ్ నాథ్ వానీ న్యూ ఢిల్లీలో అందజేశారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా తెలిపారు:
‘సోదరా పరిమళ్ నాథ్వానీ, మిమ్మల్ని కలసినందుకు, గిర్ ను గురించి మీరు వ్రాసిన పుస్తకం ప్రతి ని అందుకొన్నందుకు సంతోషం గా ఉంది. వన్యప్రాణులంటే మీకు ఎంతో మక్కువన్న సంగతి నాకు ముందే తెలుసు; మరి ఈ గ్రంథం రాజసం ఉట్టిపడే గిర్ సింహాల పట్ల ఆసక్తి ఉన్నవారందరికీ ఎంతో ఉపయోగపడుతుంది.
@mpparimal’’
Glad to have met you, Parimal Bhai and received a copy of your work on Gir. I’ve always known you as someone passionate about wildlife and this work will surely help all those interested in the majestic Gir Lion. @mpparimal https://t.co/mRKPOtK43D
— Narendra Modi (@narendramodi) July 31, 2024