ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్వామి సమర్థ్ జ్ఞాపిక (ప్రతిమ)ను కానుకగా స్వీకరించారు. స్వామి సామాజిక దృక్కోణాన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వం సదా కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘స్వామి సమర్థ్ జ్ఞాపికను కానుకగా స్వీకరించే భాగ్యం ఇవాళ నాకు కలిగింది. నాకు దక్కిన ఈ గౌరవాన్ని చిరకాలం హృదయంలో దాచుకుంటాను. ఆయన మహోన్నత ఆశయాలు, బోధనలు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిదాయకం. ఆ మహనీయుని సామాజిక దృక్కోణాన్ని సాకారం చేసేందుకు మేం సదా కృషి చేస్తాం’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
आज स्वामी समर्थ यांचे स्मृतिचिन्ह भेट म्हणून स्विकारण्याचे भाग्य मला लाभले. हे मी कायम जपणार आहे... त्यांचे उदात्त विचार आणि शिकवण कोट्यवधी लोकांना प्रेरणा देत आली आहे. त्यांचा आपल्या समाजाप्रति असलेला दृष्टिकोन प्रत्यक्षात आणण्यासाठी आम्ही सदैव प्रयत्नशील राहू. pic.twitter.com/iHu4HFVGNN
— Narendra Modi (@narendramodi) October 14, 2024