ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఓమాన్ యొక్క సుల్ తాన్ శ్రీ హైథమ్ బిన్ తారిక్ టెలిఫోన్ ద్వారా ఈ రోజు న సంభాషించారు.
ఇటీవలె జరిగిన సాధారణ ఎన్నికలు ముగిసిన దరిమిలా ప్రధాన మంత్రి మూడో పదవీకాలానికి గాను తిరిగి నియామకం కావడం పట్ల సుల్ తాన్ శ్రీ హైథమ్ బిన్ తారిక్ తన హృదయపూర్వక అభినందనల ను వ్యక్తం చేశారు.
ఓమాన్ కు మరియు భారతదేశాని కి మధ్య శతాబ్దాల నాటి నుండి ఉన్న మిత్రత్వాన్ని సుల్ తాన్ గారు నొక్కిపలుకుతూ భారతదేశం యొక్క ప్రజల ప్రగతి పథం లో మరియు సమృద్ధి బాట లో సాగిపోవాలంటూ తన శుభాకాంక్షల ను తెలియజేశారు.
సుల్ తాన్ గారు హార్దిక శుభాకాంక్షల ను తెలియజేసినందుకు ప్రధాన మంత్రి ధన్యవాదాల ను తెలిపారు. సుల్ తాన్ గారు 2023 వ సంవత్సరం డిసెంబరు లో భారతదేశాని కి విచ్చేసిన చారిత్రిక సందర్భం లో అన్ని రంగాల లోను ద్వైపాక్షిక సహకారం విస్తృతం కావడం తో పాటు బలోపేతం కావడాని కి ఆ పర్యటన దారి తీసిందన్న సంగతి ని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు.
భారతదేశం-ఓమాన్ భాగస్వామ్యాన్ని ఉభయ దేశాల కు పరస్పర ప్రయోజనకరం గా మరింతగా పటిష్టపరచడానికి కట్టుబడి ఉందాం అంటూ ఇద్దరు నేతలు వారి యొక్క వచనబద్ధత ను పునరుద్ఘాటించారు.
త్వరలో రానున్న ఈద్ అల్ అజ్ హా పండుగ ను పురస్కరించుకొని ఓమాన్ ప్రజల కు మరియు సుల్ తాన్ గారి కి హృదయపూర్వక శుభాకాంక్షలను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.