వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర యొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భం లో సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు.
దేశవ్యాప్తం గా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులు అయిన వేల కొద్దీ ప్రజలు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, విధాన సభ లకు చెందిన సభ్యులు మరియు స్థానిక స్థాయి ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఒక లక్ష ముప్ఫయ్ వేల మంది మహిళల తో కూడిన ఒక స్వయం సహాయ సమూహం (ఎస్‌హెచ్‌జి) లో ఒకరు గా ఉన్న రుబీనా ఖాన్ గారు మధ్య ప్రదేశ్ లోని దేవాస్ కు చెందిన వారు; ఆమె తన ఎస్‌హెచ్‌జి వద్ద నుండి రుణాన్ని తీసుకొని దుస్తుల ను విక్రయించే ఓ చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఆ తరువాత, ఆమె తన శ్రమికురాలి జీవనాన్ని విడచిపెట్టేశారు. తన వద్ద ఉన్న వస్తువుల ను విక్రయించడం కోసమని ఒక పాతదైన మారుతి వ్యాను ను తీసుకొనే స్థాయి కి ఎదిగిపోయారు. ఈ సంగతి ని విన్న ప్రధాన మంత్రి ‘నా దగ్గర అయితే సైకిల్ అయినా లేదు’ అంటూ చలోక్తి ని విసిరారు. అటు తరువాత ఆమె దేవాస్ లో ఒక దుకాణాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. ప్రభుత్వం వద్ద నుండి కూడా వర్క్ ఆర్డర్ ఆమె కు లభించింది.
మహమ్మారి విజృంభించిన కాలం లో మాస్కుల ను, పిపిపి కిట్ , ఇంకా సానిటైజర్ లను తయారు చేసి ఇవ్వడం ద్వారా వారు తమ వంతు తోడ్పాటు ను అందించారు. క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సిఆర్‌పి) గా ఆమె ప్రయాణాన్ని గురించి ఆయన గుర్తు చేస్తూ, నవపారిశ్రామికత్వం సంబంధి జీవనాన్ని గడిపే విధం గా మహిళల కు ఎలాగ ఆవిడ ప్రేరణ ను ఇచ్చిందీ తెలియ జేశారు. ఈ విధమైన సమూహాల ను 40 పల్లెల లో ఏర్పాటు చేయడం జరిగింది.
ఎస్‌హెచ్‌జి లకు చెందిన మహిళల లో సుమారు గా రెండు కోట్ల మంది సోదరీమణుల ను లఖ్‌పతి (లక్షాధికారి) గా తీర్చిదిద్దాలి అన్నదే తన అభిలాష అని ప్రధాన మంత్రి ఆమె కు చెప్పారు. ఈ కల నెరవేరడం లో ఒక భాగస్తురాలు అవుతాను అంటూ ప్రధాన మంత్రి కి ఆమె హామీ ని ఇచ్చారు. ‘ప్రతి ఒక్క సోదరి ఒక లక్షాధికారి గా మారాలి అని నేను కోరుకొంటున్నాను’ అని ఆమె అన్నారు. ప్రతి ఒక్క సోదరి ని లక్షాధికారి గా చేసే కార్యక్రమం లో భాగం పంచుకొంటామంటూ అక్కడ గుమికూడిన మహిళలు అందరూ వారి చేతుల ను పైకి ఎత్తి పట్టుకొన్నారు.
వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ‘‘మన మాతృమూర్తుల లో మరియు సోదరీమణుల లో వెల్లువెత్తిన విశ్వాసం మన దేశాన్ని స్వయం సమృద్ధం చేయ గలుగుతుంది’’ అని ఆయన అన్నారు. రుబీనా ఖాన్ గారి జీవన యాత్ర ను ప్రధాన మంత్రి కొనియాడుతూ, ఎస్‌హెచ్‌జి అనేది మహిళల కు స్వావలంబన మాధ్యం గా నిరూపణ అవుతున్నది, అది వారి విశ్వాసాన్ని పెంపొందింప చేస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. కనీసం 2 కోట్ల మంది సోదరీమణుల ను లక్షాధికారులు గా తీర్చిదిద్దడం కోసం ఎంతగానో శ్రమించేటట్లుగా తన కు ఉత్తేజాన్ని అందిస్తున్నది అని ఆయన అన్నారు. ఆమె యొక్క సంతానాని కి చదువు చెప్పించ వలసింది గా ప్రధాన మంత్రి ఆవిడ కు సూచించారు. తాను ఉంటున్న గ్రామం అంతా సమృద్ధం గా మారిపోయింది అని ఆమె తెలియజేశారు.