వుహాన్ లో చిక్కుకొన్న భారతీయుల ను తరలించే కార్యక్రమాన్ని నిర్వహించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు ఎయర్ ఇండియా అధికారులు కర్తవ్య పాలన లో కనబరచినటువంటి ఉన్నత స్థాయి నిబద్ధత ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. తరలింపు కార్యకలాపాల లో పాలుపంచుకొన్న జట్టు సభ్యుల కు ఒక అభినందన లేఖ ను ప్రధాన మంత్రి విడుదల చేశారు. ఆ సిబ్బంది కి ప్రధాన మంత్రి లేఖ ను పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి అందజేయనున్నారు.
విస్తృతం గా వ్యాపిస్తున్నటువంటి నావెల్ కరోనా వెరైస్ ఫ్లూ కు కేంద్రం గా ఉన్న వుహాన్ నగరం నుండి ప్రజల ను రక్షిత స్థానాల కు తరలించే కార్యకలాపాల ను ఎయర్ ఇండియా అత్యవసర ప్రాతిపదిక న చేపట్టింది. ఆ ప్రాంతం లో పైన ప్రస్తావించినటువంటి తీవ్రమైన పరిస్థితుల ను ఎరిగివుండి కూడాను ఎయర్ ఇండియా వరుస గా రెండు రోజుల పాటు 2020వ సంవత్సరం జనవరి 31వ తేదీ న మరియు ఫిబ్రవరి 1వ తేదీ న ఎయర్ ఇండియా జట్ల తో పాటు ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క బృందాల తో కూడిన బి-747 విమాన సర్వీసు లు రెండిటి ని అక్కడ కు పంపగా, ఆ విమానాలు ఆ మరుసటి రోజు అక్కడ నుండి తిరిగి వచ్చాయి.