సిమ్లాలో ఏర్పాటు చేసిన శానిటరీ న్యాప్‌కిన్ ప్లాంట్ మహిళల ఆరోగ్యం, ఉపాధి అవకాశాలను పెంచడంతోపాటు వారి సాధికారతకు దోహదం చేస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
దీనిపై ఎంపీ శ్రీ సురేష్ కశ్యప్ ట్వీట్‌కు స్పందిస్తూ పంపిన సందేశంలో:
“సిమ్లాలోని ఈ శానిటరీ న్యాప్‌కిన్ ప్లాంట్ మహిళా సాధికారత దిశగా చేపట్టిన ప్రశంసనీయ కృషికి నిదర్శనం. ఇది వారి ఆరోగ్యానికి తోడ్పడటమే కాకుండా ఉపాధి మార్గం కూడా కావడం ఎంతో సంతోషించాల్సిన అంశం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
शिमला का यह सेनेटरी नैपकिन प्लांट महिला सशक्तिकरण की दिशा में एक सराहनीय पहल है। बहुत खुशी की बात है कि यह उनके स्वास्थ्य के साथ-साथ रोजगार का भी साधन बना है। https://t.co/rBtJnDQbG3
— Narendra Modi (@narendramodi) April 22, 2023