వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర యొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ఈ రోజు న భేటీ అయ్యారు. ఈ కార్యక్రమం లో దేశ వ్యాప్తం గా వేల కొద్దీ ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ లబ్ధిదారులు, ఇంకా కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, విధాన సభ ల సభ్యులు మరియు స్థానిక ప్రతినిధులు పాలుపంచుకొన్నారు.
సేంద్రియ వ్యవసాయాన్ని 2017వ సంవత్సరం నుండి అవలంబిస్తూ వస్తున్న మిజోరమ్ లోని ఐజ్వాల్ ప్రాంతాని కి చెందిన శ్రీ శుయాయ రల్‌తే తనకు ఎదురైన అనుభవాలను ప్రధాన మంత్రి సమక్షం లో వివరించారు. అల్లం పంట ను, మిజో మిరప కాయల సాగు ను, ఇంకా ఇతర కూరగాయల ను పండిస్తున్న తాను తన ఫలసాయాన్ని న్యూ ఢిల్లీ వంటి దూర ప్రాంతాల కంపెనీల కు విక్రయించ గలుగుతున్నట్లు, తద్ద్వారా తన ఆదాయం 20,000 రూపాయలు మొదలుకొని 1,50,000 రూపాయల కు చేరుకొన్నట్లు శ్రీ రల్ తే తెలిపారు.
మీరు పండిస్తున్న పంటల ను బజారు లో అమ్ముకోగలుగుతున్నారా? అంటూ శ్రీ రల్‌తే ను ప్రధాన మంత్రి అడుగగా, ఈశాన్య ప్రాంతం లో మిశన్ ఆర్గానిక్ వేల్యూ చైన్ డెవలప్‌మెంట్ లో భాగం గా ఒక బజారు ను ఏర్పాటు చేయడం జరిగింది అని, అక్కడ రైతులు వారి పంటల ను ఏ ఇబ్బంది ఎదురవకుండా అమ్ముకోగలుగుతున్నారు అంటూ శ్రీ రల్ తే సమాధానం ఇచ్చారు. దేశం లో చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయం దిశ లో ముందుకు సాగుతూ ఉండడం పట్ల ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీ రల్‌తే వంటి రైతులు ఈశాన్య ప్రాంతం లోని మారుమూల ప్రదేశాల కు చెందిన వారు అయినప్పటికీ మార్గదర్శకులు గా నిలుస్తున్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. సేంద్రియ వ్యవసాయం ఇటు ప్రజల ఆరోగ్యాని కి అటు భూమి యొక్క స్వస్థత కు కీలకం గా ఉందని శ్రీ నరేంద్ర మోదీ నొక్కి పలికారు. గడచిన 9 సంవత్సరాల లో రసాయనాల ను వినియోగించకుండా పండించిన పంటల కు బజారు ఇంతలంతలైన ఫలితం గా రైతుల ఆదాయం లో ఏడింతల కు పైగా వృద్ధి తో పాటుగా వినియోగదారుల కు మెరుగైన ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తోంది అని ఆయన అన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరిస్తున్న రైతుల కు ప్రధాన మంత్రి ధన్యవాదాల ను తెలియ జేశారు. సంశయం లో పడి ఎటూ తేల్చుకోకుండా ఉన్న రైతులు కూడా ఈ విధమైన సేంద్రియ వ్యవసాయం బాట లో సాగాలి అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.