ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని మొఢేరా లో నెలకొన్న మొధేశ్వరి మాత దేవాలయాన్ని ఈరోజు న సందర్శించి, అక్కడ జరిగిన దైవ దర్శనం మరియు పూజ కార్యక్రమాల లో పాలుపంచుకొన్నారు. ప్రధాన మంత్రి ఆలయానికి చేరుకొన్న సందర్భం లో ఆయన ను సత్కరించడం జరిగింది. శ్రీ నరేంద్ర మోదీ గర్భగుడి లో గల మొధేశ్వరి మాత విగ్రహం సమక్షం లో శిరస్సు ను వంచి ప్రార్థనలు జరిపి, దేవి నుండి ఆశీర్వాదాల ను ముకుళిత హస్తాల తో స్వీకరించారు.
ప్రధాన మంత్రి వెంట గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ తో పాటు పార్లమెంట్ సభ్యుడు శ్రీ సి.ఆర్. పాటిల్ కూడా ఉన్నారు.
అంతక్రితం ఈ రోజు న, ప్రధాన మంత్రి గుజరాత్ లోని మెహసాణా పరిధి లో గల మొఢేరా లో 39 వందల కోట్లు రూపాయల పైచిలుకు విలువ కలిగిన అనేక ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేసి వాటిని దేశ ప్రజల కు సమర్పించారు. భారతదేశం లో సౌర శక్తి తో నిరంతరాయ నిర్వహణ సదుపాయాన్ని కలిగివున్నటువంటి ఒకటో గ్రామం గా మొఢేరా నిలచిందని ప్రధాన మంత్రి ప్రకటించారు.