ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధనుష్కోడిలోని కోదండరామస్వామి దేవాలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. ఈ దేవాలయం పూర్తిగా కోదండరామస్వామికే అంకితం అయింది. కోదండరామ అంటే విల్లు పట్టుకున్న రాముడు. ధనుష్కోడి అనే ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది. విభీషణుడు తొలి సారి శ్రీరాముని కలిసి శరణు కోరిన ప్రదేశంగా దీన్ని చెబుతారు. విభీషణునికి శ్రీరాములవారు పట్టాభిషేకం చేసిన ప్రదేశం ఇది అని కొందరు చెబుతారు.
ప్రధానమంత్రి ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ
“ప్రసిద్ధ కోదండరామస్వామి దేవాలయంలో ప్రార్థనలు చేశాను. అద్భుతమైన ఆశీస్సులు అందినట్టు భావిస్తున్నాను” అని పేర్కొన్నారు.
Prayed at the iconic Kothandaramaswamy Temple. Felt extremely blessed. pic.twitter.com/0rs58qqwex
— Narendra Modi (@narendramodi) January 21, 2024