ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్యామ్ జీ కృష్ణ వర్మ జయంతి నాడు ఆయన కు నమస్సు లు అర్పించారు. శ్రీ శ్యామ్ జీ కృష్ణ వర్మ గారి అస్థి భస్మాన్ని 2003 వ సంవత్సరం లో స్విట్జర్ లాండ్ నుంచి భారతదేశాని కి తిరిగి తీసుకు రావడమైంది. 2015 వ సంవత్సరం లో యుకె నుంచి ఆయన మరణానంతర పునః స్థాపన ప్రమాణ పత్రాన్ని సంపాదించడం కూడా జరిగింది అని కూడా ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు.
ప్రధాన మంత్రి తన అనేక ట్వీట్ లలో-
‘‘మహా క్రాంతి కారి, స్వాతంత్ర్య సంగ్రామం సేనానుల లో ఒకరు అయినటువంటి శ్యామ్ జీ కృష్ణ వర్మ గారి కి ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి. దేశాన్ని బానిసత్వం బారి నుంచి విముక్తం చేయడం కోసం ఆయన తన జీవనాన్ని అంకితం చేశారు. స్వాతంత్య్ర సంగ్రామం లో ఆయన అందించిన తోడ్పాటు ను కృతజ్ఞత నిండినటువంటి దేశం ఎప్పటికీ మరచిపోజాలదు.
శ్యామ్ జీ కృష్ణ వర్మ గారి కి ఆయన జయంతి సందర్భం లో ఇదే శ్రద్ధాంజలి.
శ్యామ్ జీ కృష్ణ వర్మ గారి అస్థి భస్మాన్ని 2003 వ సంవత్సరం లో స్విట్జర్ లాండ్ నుంచి వాపసు తెచ్చే అవకాశం తో పాటు 2015 వ సంవత్సరం లో నేను యుకె యాత్ర కు వెళ్లిన సందర్భం లో ఆయన మరణానంతర రీఇన్ స్టేట్ మెంట్ సర్టిఫికెటు ను అందుకొనే అవకాశం నాకు లభించడం.. వీటి ని నేను నాకు దక్కిన ఆశీర్వాదాలు అని భావిస్తున్నాను. ఆయన సాహసాన్ని గురించి, ఆయన గొప్పదనాన్ని గురించి భారతదేశం లోని యువత తెలుసుకోవలసిన అవసరం ఉంది.’’ అని పేర్కొన్నారు.
महान क्रांतिकारी और स्वतंत्रता सेनानी श्यामजी कृष्ण वर्मा को उनकी जयंती पर श्रद्धांजलि। देश को गुलामी से मुक्त कराने के लिए उन्होंने अपना जीवन समर्पित कर दिया। कृतज्ञ राष्ट्र आजादी की लड़ाई में उनके योगदान को कभी भुला नहीं पाएगा।
— Narendra Modi (@narendramodi) October 4, 2021
Tributes to Shyamji Krishna Varma on his Jayanti.
I consider myself blessed to have got the opportunity to bring back the ashes of Shyamji Krishna Varma back from Switzerland in 2003 and receive his reinstatement certificate during my UK visit in 2015. It is important that young India knows more about his courage and greatness. pic.twitter.com/WDoMN0BFmD
— Narendra Modi (@narendramodi) October 4, 2021