భారత నారీశక్తి ధైర్యసాహసాలకు ప్రతీక అయిన రాణీ లక్ష్మీబాయి జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు హృదయపూర్వక నివాళి అర్పించారు.
ఈ మేరకు 'ఎక్స్' ద్వారా పంపిన ఒక సందేశంలో:
“భారత మహిళా శక్తి ధైర్యసాహసాలకు ప్రతీక అయిన రాణి లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఆమెకు నా ప్రగాఢ నివాళి. పరాయి పాలకుల దురాగతాలను ఎదుర్కొనడంలో ఆమె ప్రదర్శించిన మొక్కవోని ధైర్యం, అసమాన త్యాగాల గాథ తరతరాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
भारतीय नारीशक्ति के पराक्रम की प्रतीक रानी लक्ष्मीबाई को उनकी जन्म-जयंती पर मेरा कोटि-कोटि नमन। विदेशी हुकूमत के अत्याचार के खिलाफ उनके साहस, संघर्ष और बलिदान की गाथा देश की हर पीढ़ी को प्रेरित करती रहेगी।
— Narendra Modi (@narendramodi) November 19, 2023