పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలిని ఘటించారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన అంత్యోదయ భావన అభివృద్ధి చెందిన భారతదేశం సంకల్పాన్ని సాధించడంలో ఘనమైన పాత్రను పోషిస్తుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధాన మంత్రి ఇలా రాశారు:
‘‘గొప్ప జాతీయవాదీ, ఆలోచనాపరుడూ అయిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయజీకి ఆయన జయంతి నాడు కోటి కోటి నమస్కారాలు. అంత్యోదయ తాలూకు ఆయన భావన వికసిత్ భారత్ సంకల్పాన్ని సిద్ధింప చేసుకోవడంలో వెలకట్టలేని భూమికను నిర్వహించనుంది. దేశమంటే ఆయనకు ఉన్న అంకితభావం, సేవ భావం మరువలేనివి’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
महान राष्ट्रवादी विचारक पंडित दीनदयाल उपाध्याय जी को उनकी जयंती पर कोटि-कोटि नमन। अंत्योदय की उनकी अवधारणा विकसित भारत के संकल्प की सिद्धि में अमूल्य भूमिका निभाने वाली है। देश के लिए उनका समर्पण और सेवा भाव अविस्मरणीय रहेगा। pic.twitter.com/0tZ4oxcZ01
— Narendra Modi (@narendramodi) September 25, 2024