ఈ రోజు గిరిజన నేత శ్రీ కార్తిక్ ఉరావ్ శత జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. గిరిజన సమూహాల హక్కులు, వారి ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నేత శ్రీ ఉరావ్ అని ప్రధాని కొనియాడారు. గిరిజనుల ప్రతినిధిగా వారి సంస్కృతి, గుర్తింపును రక్షించేందుకు ఎనలేని కృషి చేశారని తెలిపారు.
ఎక్స్ లో శ్రీ మోదీ చేసిన పోస్ట్:
‘‘ఆదీవాసీ సమాజం హక్కులు, ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు కార్తిక్ ఉరావ్ జయంతి సందర్భంగా సవినయంగా నివాళి అర్పిస్తున్నాను. ఆయన గిరిజన సమాజానికి ప్రతినిధి. గిరిజన సంస్కృతి, గుర్తింపును రక్షించడానికి నిరంతరం పోరాడారు. వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ఆయన చేసిన పోరాటం దేశ ప్రజల్లో ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపుతుంది.
आदिवासी समुदाय के अधिकार और आत्मसम्मान के लिए जीवनपर्यंत समर्पित रहे देश के महान नेता कार्तिक उरांव जी को उनकी जन्म-शताब्दी पर आदरपूर्ण श्रद्धांजलि। वे जनजातीय समाज के एक मुखर प्रवक्ता थे, जो आदिवासी संस्कृति और अस्मिता की रक्षा के लिए निरंतर संघर्षरत रहे। वंचितों के कल्याण के…
— Narendra Modi (@narendramodi) October 29, 2024