స్వాతంత్య్ర యోధులు అందరికీ, ఉద్యమాలకు, అలజడి లకు, స్వాతంత్య్ర ఉద్యమ సంఘర్షణ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ప్రత్యేకించి భారతదేశ భవ్య స్వాతంత్య్ర సమర గాథ లో లభించవలసినంతటి గుర్తింపు లభించని ఉద్యమాల కు, పోరాటాల కు, విశిష్ట వ్యక్తుల కు శ్రద్ధాంజలి అర్పించారు. అహమదాబాద్ లోని సాబర్‌మతీ ఆశ్రమం లో ఈ రోజు న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (India@75) ను ప్రారంభించిన అనంతరం ఆయన ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
తెర మరుగు న ఉండిపోయినటువంటి ఉద్యమాల, పోరాటాల తోడ్పాటు ను ప్రధాన మంత్రి కొనియాడుతూ, అసత్య శక్తుల మీద సత్యం తాలూకు భారతదేశం దృఢ సంకల్పాన్ని గురించి ప్రతి ఒక్క సంగ్రామం, ప్రతి ఒక్క పోరాటం చాటిచెప్పాయి; అంతేకాకుండా భారతదేశం స్వాతంత్య్ర తపన కు అవి నిదర్శనం గా నిలచాయన్నారు. ఈ పోరాటాలు రాముని రోజుల నాటి, మహాభారతం లోని కురుక్షేత్రం, హల్దీఘాటీ యుద్ధ కాలాల నాటి, వీర శివాజీ గర్జన నాటి పరాక్రమానికి, జాగరూకత కు ప్రతిరూపాలు అని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి తన ప్రసంగం లో కోల్, ఖాసీ, సంథాల్, నాగా, భీల్, ముండా క్రాంతి, సన్యాసీ ఆందోళన, రామోసీ సంఘర్షణ, కిత్తూరు ఉద్యమం, త్రావణ్ కోర్ ఉద్యమం, బార్ డోలీ సత్యాగ్రహం, చంపారణ్ సత్యాగ్రహం, సంభల్ పుర్, చువార్, బుందేల్, కూకా అలజడి మరియు ఉద్యమాలను గురించి గుర్తు చేశారు. అటువంటి అనేక పోరాటాలు దేశం లోని ప్రతి ప్రాంతం లో, ప్రతి కాలం లో స్వాతంత్య్రం తాలూకు జ్వాల ను కాంతివంతం గా వెలుగులీనేటట్లు చేశాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సిఖ్ గురువు ల పరంపర మన సంస్కృతి ని, సంప్రదాయాల ను పరిరక్షించుకోవడానికి దేశం లో శక్తి ని నింపింది అని ఆయన అన్నారు.
స్వాతంత్య్ర జ్వాల ను నిరంతరం వెలిగిస్తూ ఉంచే కార్యాన్ని మన సాధువులు, మహంతులు, ఆచార్యులు దేశం లోని ప్రతి ఒక్క ప్రాంతం లో అలుపెరుగక నేరవేర్చారనే సంగతి ని మనం ఎల్లప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాలి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. అది దేశం అంతటా స్వాతంత్య్ర పోరాటానికి ఒక గట్టి పునాది ని వేసింది అని ఆయన అన్నారు.
తూర్పు ప్రాంతం లో చైతన్య మహాప్రభు, శ్రీమంత్ శంకర దేవ్ ల వంటి సాధువులు సమాజానికి ఒక దిశ ను చూపారని, వారు ప్రజల ను లక్ష్యం పై దృష్టి ని కేంద్రీకరించేటట్లుగా చేశారని ప్రధాన మంత్రి అన్నారు. పశ్చిమ ప్రాంతం లో మీరాబాయి, ఏక్‌నాథ్, తుకారామ్, రామ్‌దాస్, నర్ సీ మెహతా, ఉత్తర ప్రాంతం లో సంత్ రామానంద్, కబీర్ దాస్, గోస్వామి తులసీదాస్, సూర్‌దాస్, గురు నానక్ దేవ్, సంత్ రైదాస్ లు ఈ బాధ్యత ను స్వీకరించారన్నారు. అదే మాదిరి గా దక్షిణ ప్రాంతం లో మధ్వాచార్య, నిమ్బార్కాచార్య, వల్లభాచార్య, రామానుజాచార్య ల పేర్ల ను ఆయన ప్రస్తావించారు.
భక్తి కాలం లో మాలిక్ మొహమ్మద్ జాయసీ, రస్ ఖాన్, సూర్‌దాస్, కేశవ్ దాస్ లతో పాటు విద్యాపతి లు సమాజం లోని లోపాల ను సంస్కరించడం కోసం ప్రేరణ గా నిలచారని ప్రధాన మంత్రి అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం అఖిల భారత స్వభావాన్ని అలవర్చుకోవడం లో ఈ మహనీయులు పోషించిన పాత్ర ఎంతయినా ఉందని ఆయన అన్నారు. ఈ కథానాయకుల, ఈ కథానాయికల జీవిత చరిత్ర లను ప్రజల చెంతకు చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ప్రేరణాత్మకమైన గాథలు ఐకమత్యాన్ని గురించి, అలాగే లక్ష్యాల ను సాధించాలన్న సంకల్పాన్ని గురించి మన నవ తరాల కు విలువైన పాఠాల ను నేర్పగలవు అని ప్రధాన మంత్రి చెప్తూ, తన ప్రసంగాన్ని ముగించారు.