పండిత్ శ్రీ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కు ఆయన వర్ధంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.
పండిత్ శ్రీ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సంస్కృతి ని మరియు వారసత్వాన్ని కేంద్ర స్థానం లో నిలుపుతూ దేశాన్ని ముందుకు నడిపేందుకు దారి ని చూపెట్టారు. ఈ మార్గమే వికసిత్ భారత్ యొక్క ఆవిష్కారం లో సైతం ప్రేరణ గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గారి కి ఆయన వర్థంతి సందర్భం లో దేశమంతటా ఉన్నటువంటి నా యొక్క కుటుంబ సభ్యుల పక్షాన ఇవే వందన శతాలు. ఆయన భారతీయ సంస్కృతి ని మరియు వారసత్వాన్ని కేంద్ర స్థానం లో నిలిపి ఉంచి, దేశాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి మార్గాన్ని చూపెట్టారు; ఆ మార్గమే వికసిత్ భారత్ యొక్క ఆవిష్కారం లోనూ ప్రేరణ గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
पंडित दीनदयाल उपाध्याय जी को उनकी पुण्यतिथि पर देशभर के अपने परिवारजनों की ओर से शत-शत नमन। उन्होंने भारतीय संस्कृति और विरासत को केंद्र में रखकर देश को आगे ले जाने का मार्ग दिखाया, जो विकसित भारत के निर्माण में भी प्रेरणास्रोत बना है।
— Narendra Modi (@narendramodi) February 11, 2024