జాతీయ చేనేత దినోత్సవం నేపథ్యంలో ఘనమైన భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి, కళాత్మక సంప్రదాయాల కొనసాగింపునకు కృషి చేస్తున్న వారందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివందనం చేశారు. అంకుర సంస్థల పర్యావరణంతో ముడిపడిన యువతరం ‘హ్యాండ్లూమ్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్’లో పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా పంపిన సందేశంలో;
“జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఘనమైన భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి, మన కళాత్మక సంప్రదాయాల కొనసాగింపునకు సదా కృషిచేస్తున్న వారందరికీ నా అభివందనాలు. #MyHandloomMyPride”…
“నేత కార్మికుల కోసం ఆలోచన-ఆవిష్కరణలకు ఇప్పుడో అద్భుతమైన అవకాశం వచ్చింది. అంకుర సంస్థల పర్యావరణంతో ముడిపడిన యువతరమంతా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను… #MyHandloomMyPride” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
On National Handloom Day, a tribute to India's rich cultural diversity and all those working to celebrate our artistic traditions. #MyHandloomMyPride pic.twitter.com/ethgFyHTlI
— Narendra Modi (@narendramodi) August 7, 2022
An excellent opportunity to ideate and innovate for weavers. Urging all those youngsters associated with the world of StartUps to take part...#MyHandloomMyPride https://t.co/BuAa8UGG00
— Narendra Modi (@narendramodi) August 7, 2022