భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా సమాజంలోని ప్రతి వర్గాన్నీ ప్రభావితం చేసిన నాయకుడుగా డాక్టర్ కలాం సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాంగారికి నివాళి అర్పిస్తున్నాను. దేశానికి శాస్త్రవేత్తగా, సమాజంలోని ప్రతి వర్గాన్నీ ప్రభావితం చేసిన రాష్ట్రపతిగా ఆయన కృషి ఎంతో ప్రశంసనీయం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Tributes to our former President Dr. APJ Abdul Kalam. He is greatly admired for his contribution to our nation as a scientist and as a President who struck a chord with every section of society. pic.twitter.com/vPwICWxA3u
— Narendra Modi (@narendramodi) October 15, 2022