ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భారత రత్న నానాజీ దేశ్ ముఖ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. దేశంలోని గ్రామీణ ప్రజల సాధికారత విషయంలో ఆయన అంకితభావం, సేవలను మోదీ స్మరించుకొని ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:
“భారతరత్న నానాజీ దేశ్ ముఖ్ జయంతి సందర్భంగా దేశ ప్రజల తరఫున ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. గ్రామీణ ప్రజల సాధికారత కోసం, ముఖ్యంగా దేశంలోని అణగారిన వర్గాల సాధికారత కోసం ఆయన చూపిన అంకితభావం, సేవా స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోతాయి.”
देशवासियों की ओर से भारत रत्न नानाजी देशमुख को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। देश के ग्रामीणों विशेषकर वंचित समाज के सशक्तिकरण के लिए उनके समर्पण और सेवा भाव को हमेशा याद किया जाएगा। pic.twitter.com/GNshnjxxcQ
— Narendra Modi (@narendramodi) October 11, 2024