ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాంగ్లాదేశ్ లో రెండు రోజుల యాత్ర కు వచ్చి రావడం తోనే ఆ దేశ జాతీయ కట్టడమైన జాతీయ అమరవీరుల స్మృతి చిహ్నం (JatiyoSritiShoudho) ను సందర్శించారు. 1971వ సంవత్సరం లో జరిగిన బాంగ్లాదేశ్ విమోచన యుద్ధం లో ప్రాణాలను అర్పించిన వ్యక్తుల పరాక్రమాన్ని, త్యాగాన్ని స్మరించుకోవడానికి ఏర్పాటైన ఈ జాతీయ స్మృతి సౌధం లో శ్రీ మోదీ నివాళులు అర్పించారు. ఈ కట్టడం ఢాకా కు వాయవ్య దిశ లో సుమారు 35 కిలో మీటర్ల దూరాన గల సావర్ లో ఉంది. దీనిని సైయద్ మైనుల్ హుస్సేన్ తీర్చి దిద్దారు.
ప్రధాన మంత్రి ఈ స్మారకం ఆవరణ లో అర్జున వృక్షం తాలూకు ఒక చిన్న మొక్క ను నాటారు; ఆయన అక్కడ గల సందర్శకుల పుస్తకం లో సంతకం కూడా చేశారు. ‘‘ వంచన, అణచివేత లపై సత్యం, పరాక్రమాలు సాధించినటువంటి పవిత్ర విజయాన్ని సదా స్మరణ కు తెచ్చేది గా సావర్ లో శాశ్వత జ్యోతి వెలుగులీనుతూ ఉండాలంటూ నేను ప్రార్థిస్తున్నాను’’ అని సందర్శకుల పుస్తకం లో ప్రధాన మంత్రి రాశారు.
On the 50th Independence Day of Bangladesh, PM @narendramodi paid tributes at the National Martyr’s Memorial in Savar.
— PMO India (@PMOIndia) March 26, 2021
The courage of those who took part in the Liberation War of Bangladesh motivates many. pic.twitter.com/q7bZwATNHt