శ్రీ సర్ దార్ పటేల్ వర్థంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించడం తో పాటు భారతదేశాని కి శ్రీ సర్ దార్ పటేల్ అందించిన చిర స్థాయి లో నిలచిపోయేటటువంటి తోడ్పాటు ను ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ సర్ దార్ పటేల్ వర్థంతి సందర్భం లో ఆయన కు నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. భారతదేశాని కి ఆయన అందించినటువంటి చిరస్థాయి లో నిలచిపోయే తోడ్పాటు ను, ప్రత్యేకించి మన దేశాన్ని ఏకం చేయడం లో, అలాగే మన దేశం యొక్క సర్వతోముఖ అభివృద్ధి కి ఉత్తేజాన్ని ఇవ్వడం లో ఆయన తోడ్పాటు ను స్మరించుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
I pay homage to Sardar Patel on his Punya Tithi and recall his everlasting contribution to India, especially in uniting our nation and giving impetus to all-round development.
— Narendra Modi (@narendramodi) December 15, 2022