ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీ పింగళి వెంకయ్య కు ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని సమర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మహనీయుడు శ్రీ పింగళి వెంకయ్య కు ఆయన జయంతి నాడు నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. మనం ఎంతగానో గర్వపడేటటువంటి త్రివర్ణ పతాకాన్ని అందించేందుకు ఆయన చేసిన ప్రయాసల కు గాను మన దేశ ప్రజలు ఆయన కు ఎల్లప్పటికీ రుణపడి ఉంటారు. మువ్వన్నెల జెండా ద్వారా శక్తి ని మరియు ప్రేరణ ను అందుకొంటూ, మనం దేశం యొక్క ప్రగతి కోసం కార్యాలను కొనసాగిద్దాం.’’ అని పేర్కొన్నారు.
I pay homage to the great Pingali Venkayya on his birth anniversary. Our nation will forever be indebted to him for his efforts of giving us the Tricolour, which we are very proud of. Taking strength and inspiration from the Tricolour, may we keep working for national progress.
— Narendra Modi (@narendramodi) August 2, 2022