ఈ రోజు మౌలానా ఆజాద్ జయంతి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. మౌలానా ఆజాద్ గొప్ప మేధావి అనీ, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన మహత్తర భూమికను నిర్వహించారనీ శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
‘‘ఈ రోజు మౌలానా ఆజాద్ జయంతి సందర్భంగా ఆయనకు అంజలి ఘటిద్ధాం. మేధావిగా, స్వాతంత్ర్యోద్రమంలో కీలక భూమికను పోషించిన వ్యక్తిగా ఆయన మనకు ఎప్పుడూ గుర్తుంటారు. ఆయన గొప్ప ఆలోచనపరుడు, గొప్ప రచయిత కూడా. ఆయన కన్న కలలు... ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశాన్ని శక్తిమంతంగా నిర్మించుకునేందుకూ మనకు ఎప్పటికీ స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి’’.
On his birth anniversary today, we pay homage to Maulana Azad. He is fondly remembered as a beacon of knowledge and for his role in India’s freedom movement. He was also a deep thinker and prolific writer. We remain motivated by his vision for a developed and empowered India.
— Narendra Modi (@narendramodi) November 11, 2024