శ్రీ చంద్ర శేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:
‘‘మహనీయుడు శ్రీ చంద్ర శేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా, నేను ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆయన భయమెరుగని నాయకుడు; ఆయనకు అచంచల ధైర్య, సాహసాలతో పాటు భారతదేశ స్వాతంత్ర్యం పట్ల నిబద్ధత వరదానం గా ప్రాప్తించాయి. ఆయన ఆదర్శాలు, ఆయన ఆలోచనలు లక్షల కొద్దీ ప్రజల, మరీ ముఖ్యంగా యువజనుల హృదయాలలోను, మస్తిష్కంలోను మారుమ్రోగుతూ ఉంటాయి.’’
On his birth anniversary, I pay homage to the great Chandra Shekhar Azad. He was a fearless hero, blessed with unwavering courage and commitment to India’s freedom. His ideals and thoughts continue to resonate in the hearts and minds of millions of people, particularly the youth.
— Narendra Modi (@narendramodi) July 23, 2024