‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో ఈ రోజు న జరుగగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. ఈ సందర్భం లో ఏర్పాటైన స్టాల్స్ ను, వికసిత్ భారత్ యాత్ర వ్యాను ను మరియు తత్సంబంధి క్విజ్ కార్యక్రమాన్ని శ్రీ నరేంద్ర మోదీ పరిశీలించారు. ప్రభుత్వ వివిధ పథకాల లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి భేటీ కావడం తో పాటు వారి ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో భాగం గా ‘వికసిత్ భారత్ సంకల్ప్ సంబంధఇ ప్రమాణ పాఠాన్ని సభికుల చేత స్వీకరింపచేయడమైంది.
ప్రధాన మంత్రి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ పథకాల ప్రభావాన్ని స్వయం గా తెలుసుకోవడం యొక్క పరివర్తన పూర్వకమైన శక్తి ని గురించి చెప్పసాగారు. ఈ పథకాలు వంట ఇళ్ళ లో ఎగసే పొగ ను పారద్రోలుతున్నాయి. పక్కా ఇళ్ళు ఒక క్రొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి పేద లు వారు సశక్తం అవుతున్నామన్న భావన కు లోనవుతున్నారు. మరి కలవారు లేనివారు అనే తేడాలు తగ్గుతూ పోతున్నాయి ఇవన్నీ గొప్ప సంతృప్తి ని ఇస్తున్నాయి అన్నారు.
సఫలం అయినటువంటి పథకాలు పౌరుల లో స్వామిత్వ తరహా భావన ను రేకెత్తిస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. రుణాన్ని మరియు ఇతర సదుపాయాల ను అందుకొన్న వ్యక్తి ఇది అతడి దేశం, అతడి కి చెందిన రైల్ వే లు, అతడి కి చెందిన కార్యాలయం, అతడి కి చెందిన ఆసుపత్రి అని భావిస్తాడు. ఈ తరహా స్వామిత్వ భావన ఎప్పుడైతే కలుగుతుందో, దేశం కోసం ఏదైనా చేయాలి అనేటటువంటి కోరిక కూడా ఉదయిస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇది రాబోయే తరాల కోసం ఒక మెరుగైన భవిష్యత్తు ను ఆవిష్కరించడం పట్ల ప్రజల లో విశ్వాసాన్ని నింపుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
ఒక స్వతంత్ర భారతదేశాన్ని ఆవిష్కరించాలి అనే ఉమ్మడి లక్ష్యాన్ని చేరుకోవడం కోసమే స్వాతంత్య్రం సాధన కు పూర్వ కాలం లో దేశం లో ప్రతి ఒక్క పని ని మొదలు పెట్టడం జరిగిన విషయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తీసుకు వచ్చారు. ‘‘ప్రతి ్క పౌరుడు, ప్రతి ్క పౌరురాలు వారివైన పద్ధతుల లో స్వాతంత్య్రం సాధన కై తోడ్పాటు ను అందించారు.’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ వాతావరణం ఏకత్వాన్ని నెలకొల్పి, చివర కు బ్రిటిషు వారు భారతదేశాన్ని వీడిపోయేటట్లు గా చేసింది అని ఆయన అన్నారు. వికసిత్ బారత్ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం అదే తరహా దృష్టి ని కలిగి ఉండాలి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ్క వ్యక్తి ని గౌరవిస్తూ, దేశాన్ని ముందుకు తీసుకు పోవాలి అని ఆయన నొక్కి చెప్పారు. ‘‘వికసిత్ భారత్ తాలూకు విత్తుల ను చల్లడం జరిగిందా అంటే, రాబోయే 25 సంవత్సరాల యొక్క ఫలితాన్ని మన భావి తరాల వారు అందుకొంటారు’’ అని ఆయన అన్నారు. ‘‘భారతదేశం లో ప్రతి ్కరి కి ఈ మనస్తత్వం మరియు ఇటువంటి సంకల్పం అవసరం’’ అని ఆయన అన్నారు.
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అనేది దేశ ప్రజల పరిశ్రమ, అది ఏ రాజకీయ పక్షం యొక్క కార్యమో కాదు, ఒక పవిత్ర బాధ్యత. ప్రజలు దీనిలో ప్రత్యక్షం గా పాల్గొనాలి అని అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఎవరైనా దీనిని గురించి వార్త పత్రికల లో చదివినంతనే సంతృప్తి చెందారు అంటే, ఆ వ్యక్తి ముఖ్యమైనటువంటి దేని లోనో పాల్గొనలేకపోతున్నట్లే’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ యాత్ర తాలూకు వేరు వేరు దశల లో పాలుపంచుకో గలుగుతున్నందుకు ఆయన స్వీయ సంతృప్తి ని కూడ వ్యక్తం చేశారు.
‘‘సకాతాత్మక వైఖరి సకారాత్మకమైన వాతావరణానికి దారి తీస్తుంది అంటూ, యాత్ర ను గురించి చురుకు గా ప్రయాచం చేయండని ప్రధాన మంత్రి లబ్ధిదారుల కు మరియు పౌరుల కు సూచించారు. విబిఎస్‌వై అనేది ఒక విశాల సంకల్పం అని ప్రధాన మంత్రి అభివర్ణిస్తూ, దీనిని ‘సబ్ కా ప్రయాస్’ (‘అందరి ప్రయత్నాల’) ద్వారా సాకారం చేయాలి అని ప్రధాన మంత్రి ఉద్భోదించారు. ఆర్థికం గా బలమైన వికసిత్ భారత్ రూపుదాల్చినట్లయితే, అది దేశ పౌరుల సమస్య లు అన్నిటిని తీర్చ గలుగుతుంది అని చెప్తూ, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ‘‘అన్ని ఇక్కట్టుల ను పారద్రోలేటటువంటి బాట ‘వికసిత్ బారత్’ సంబంధి సంకల్పం ద్వారానే ప్రయాణిస్తుంది. కాశీ ప్రజల కు నేను ఇస్తున్న హామీ ఏమిటి అంటే, అది మీ యొక్క ప్రతినిధి గా, మీరు అప్పజెప్పినటువంటి జాతీయ బాధ్యత ను నెరవేర్చడానికి ఎటువంటి ప్రయాసల ను నేను వదులుకోను.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి తో పాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.