వస్త్రాలు మరియు హస్తకళల పోర్టల్ అయిన ‘భారతీయ వస్త్ర ఏవమ్ శిల్ప కోశ్’ ను ఆయన ప్రారంభించారు
‘‘ప్రస్తుతంభారతదేశం అంటే ఒక్క ‘లోకల్ ఫార్ వోకల్’ యే కాదు, అది ప్రపంచం లోకి దూసుకుపోయేందుకు ఒక గ్లోబల్ ప్లాట్ఫార్మ్ ను కూడా అందిస్తున్నది’
‘‘స్వదేశీ విషయం లోదేశం లో ఒక కొత్త క్రాంతి బయలుదేరింది’’
‘‘ ‘వోకల్ ఫార్ లోకల్’ తాలూకు స్ఫూర్తి తో పౌరులు దేశవాళీ ఉత్పత్తుల ను హృదయపూర్వకం గా కొనుగోలు చేస్తున్నారు, మరి ఇది ఒక ప్రజా ఉద్యమం గా మారిపోయింది’’
‘‘ఉచితం గా ఆహార పదార్థాలు, పక్కా ఇల్లు, అయిదు లక్షల రూపాయల వరకు విలువ గల ఉచిత వైద్య చికిత్స.. ఇదే మోదీ యొక్క హామీ గా ఉంది’’
‘‘నేతకారుల శ్రమ నుసులభతరం చేయడం, వారి ఉత్పాదకత నుపెంచడం మరియు నాణ్యత ను, అలాగే డిజైన్ లను మెరుగు పరచడం.. ఇదే ప్రభుత్వం యొక్క నిరంతర ప్రయాస గా ఉంది’’
‘‘ప్రతి ఒక్కరాష్ట్రం నుండి మరియు ప్రతి ఒక్క జిల్లా నుండి తయారయ్యే హస్తకళల కు మరియు ఉత్పత్తులకు ఒకే నిలయం లో ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసమని ప్రతి రాష్ట్ర రాజధాని నగరం లో ‘ఏకత మాల్’ ను అభివృద్ధి పరచడం జరుగుతున్నది’’
‘‘చేనేతకారుల కుప్రపంచం లో అతి పెద్దదైన బజారు ను అందించడం కో
ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను సైతం ప్రధాన మంత్రి సందర్శించి, నేతకారుల తో మాట్లాడారు.
భారతదేశం తన నేతకారుల కార్యసాధనల రూపం లో సఫలత ను సాధించడం తనకు ఎంతో గర్వం గా ఉంది అని ఆయన అన్నారు.

జాతీయ చేనేత దినం ఉత్సవాన్ని ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో గల భారత్ మండపం లో నిర్వహించగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమం లో పాలుపంచుకొని, సభికుల ను ఉద్దేశించి ప్రసంగించారు. నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఫేశన్ టెక్నాలజీ రూపుదిద్దిన ఇ-పోర్టల్ అయిన ‘భారతీయ వస్త్ర ఏవమ్ శిల్ప కోశ్ - ఎ రిపాజిటరి ఆఫ్ టెక్స్ టైల్స్ ఎండ్ క్రాఫ్ట్స్’ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను సైతం ప్రధాన మంత్రి సందర్శించి, నేతకారుల తో మాట్లాడారు.

ఈ కార్యక్రమాని కి తరలి వచ్చిన జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారత్ మండపం ప్రారంభ కార్యక్రమం జరగడాని కి పూర్వం ప్రగతి మైదాన్ లో ఏర్పాటు చేసే ఒక ప్రదర్శన లో పాలుపంచుకొనే ప్రదర్శకులు వారి ఉత్పత్తుల ను ఏ విధం గా ఒక గుడారం లో ప్రదర్శించే వారో ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు. భారత్ మండపం యొక్క వైభవాన్ని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, అది భారతదేశం లో చేనేత పరిశ్రమ యొక్క తోడ్పాటు కు నిదర్శన గా ఉంది, ఇక్కడ కొలువుదీరినటువంటి పాత, క్రొత్త ల కలయిక ఈ నాటి ‘న్యూ ఇండియా’ కు అద్దం పడుతోంది అన్నారు. ‘‘ఈ నాటి భారతదేశం ఒక్క ‘లోకల్ ఫార్ వోకల్’ మాత్రమే కాదు, అది భారతదేశాన్ని ప్రపంచం ముంగిట కు తీసుకు పోయేటటువంటి ఒక గ్లోబల్ ప్లాట్ ఫార్మ్ ను కూడా అందుబాటు లోకి తీసుకు వచ్చింది అని ఆయన అన్నారు. ఈ రోజు న ఈ కార్యక్రమం మొదలవడానికంటే ముందు తాను నేతకారుల తో జరిపిన మాటామంతీ ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, దేశం నలుమూలల నుండి వేరు వేరు హేండ్ లూమ్ క్లస్టర్ లు ఈ నాటి వైభవోపేతమైన ఉత్సవాల కు తరలి వచ్చినట్లు చెప్తూ నేతకారుల కు ఇదే స్వాగతం అన్నారు.

 

‘‘ఆగస్టు నెల అంటేనే క్రాంతి మాసం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం యొక్క స్వాతంత్య్రం కోసం చేసిన ప్రతి ఒక్క త్యాగాన్ని స్మరించుకోవలసిన కాలం ఇది అని ఆయన స్పష్టం చేశారు. స్వదేశీ ఉద్యమాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, అది విదేశాల లో తయారైన వస్త్రాల ను బహిష్కరించడానికి మాత్రమే పరిమితం కాదు, అది భారతదేశం లో స్వతంత్ర ఆర్థిక వ్యవస్థ కు ప్రేరణ ను ఇచ్చిన సాధనం కూడా ను అని పేర్కొన్నారు. భారతదేశం యొక్క నేతకారుల ను ప్రజల తో పెనవేసే ఉద్యమం అది; అంతేకాదు, ఈ దినాన్ని ‘జాతీయ చేనేత దినం’ గా ప్రభుత్వం ఎంపిక చేయడం వెనుక అది ఒక ప్రేరణ గా కూడా ఉంది అని ఆయన అన్నారు. గడచిన కొద్ది సంవత్సరాల లో చేనేత పరిశ్రమ ను, నేతకారుల స్థితి ని మెరుగు పరచడం కోసం మునుపు ఎరుగని స్థాయి లో కృషి జరిగింది అని ప్రధాన మంత్రి నొక్కి పలికారు. ‘‘దేశం లో స్వదేశీ పరం గా ఒక క్రొత్త క్రాంతి నెలకొంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం తన నేతకారుల కార్యసాధనల రూపం లో సఫలత ను సాధించడం తనకు ఎంతో గర్వం గా ఉంది అని ఆయన అన్నారు.

 

ఎవరి గుర్తింపు అయినా సరే వారు ధరించే దుస్తుల తో ముడిపడి ఉంటుంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. మరి ఈ సందర్భం లో రకరకాల వస్త్రాల ను గమనించవచ్చును అని ఆయన నొక్కి పలికారు. ఇది వేరు వేరు ప్రాంతాల దుస్తుల రూపేణా భారతదేశం యొక్క వైవిధ్యాన్ని సంబురం గా జరుపుకొనేటటువంటి సందర్భం కూడా ను అని ఆయన అన్నారు. ‘‘భారతదేశం వస్త్రధారణ విషయం లో ఒక సుందరమైన ఇంద్రధనుస్సు వంటిది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ వైవిధ్యాన్ని రుమూల ప్రాంతాల లో నివసించే ఆదివాసి సముదాయాలు మొదలుకొని మంచు ముసుగు వేసినట్లు ఉన్నటువంటి పర్వత ప్రాంతాల లో మనుగడ సాగించే ప్రజల వరకు, ఇంకా కోస్తా తీర ప్రాంతాల లో ఉండే ప్రజానీకం మొదలుకొని ఎడారి ప్రాంతాల లో జీవనాన్ని గడిపే వారితో పాటు భారతదేశం లోని బజారుల లో లభ్యమవుతున్న వస్త్రాల వరకు తాను గమనించినట్లు వివరించారు. భారతదేశం లోని విభిన్న శ్రేణుల దుస్తుల ను సంకలనం చేసి పట్టికీకరించవలసిన అవసరం ఉంది అని ఆయన అన్నారు. ‘భారతీయ వస్త్ర ఏవమ్ శిల్ప కోశ్’ ను ప్రారంభించడం తో ఈ కార్యం ఈ రోజు న ఫలప్రదం అయిందంటూ ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

గత కొన్ని వందల సంవత్సరాలుగా భారతదేశం యొక్క వస్త్ర పరిశ్రమ సువ్యవస్థితం అయింది అని ప్రధాన మంత్రి అన్నారు. అయితే స్వాతంత్య్రం అనంతర కాలాల్లో ఆ పరిశ్రమ ను బలపరచడం కోసం ఎటువంటి నిర్దిష్ట ప్రయాస లు జరుగకపోవడం శోచనీయం అని ఆయన అన్నారు. ‘‘చివరకు ఖాదీ ని సైతం పట్టించుకొన్న వారు లేకపోయారు’’ ని ఆయన అన్నారు. ఖాదీ వస్త్రాల ను ధరిస్తున్న వారిని చిన్నచూపు చూడడం జరిగింది అని ఆయన అన్నారు. 2014 వ సంవత్సరం తరువాత ప్రభుత్వం ఈ స్థితి ని మార్చడం కోసం పాటుపడుతూ వస్తోందని ఆయన అన్నారు. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ఆరంభ దశ లో ఖాదీ ఉత్పాదనల ను కొనుగోలు చేయండి అంటూ పౌరుల కు తాను విజ్ఞప్తి ని చేసిన విషయాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వచ్చారు. తత్ఫలితం గా గడచిన తొమ్మిది సంవత్సరాల లో ఖాదీ యొక్క ఉత్పత్తి లో మూడింతల కు మించిన వృద్ధి చోటు చేసుకొంది అని ఆయన వివరించారు. ఖాదీ దుస్తుల అమ్మకం అయిదింతలు వృద్ధి చెందింది, దీనితోపాటు గా విదేశాల లో ఖాదీ కి గిరాకీ సైతం పెరుగుతోంది అని ఆయన తెలిపారు. పేరిస్ ను తాను సందర్శించిన కాలం లో ఒక భారీ ఫేశన్ బ్రాండు యొక్క సిఇఒ తో సమావేశమైన సంగతి ని కూడా శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొంటూ, ఖాదీ అన్నా, భారతీయ చేనేత వస్త్రాలన్నా ఆకర్షణ అంతకంతకు అధికం అవుతోందని ఆ సిఇఒ తనకు చెప్పారన్నారు.

 

తొమ్మిది సంవత్సరాల కిందట ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమ ల యొక్క టర్నోవర్ సుమారు 25 వేల కోట్ల రూపాయల నుండి 30 వేల కోట్ల రూపాయల మధ్య ఉంది, అయితే అది ప్రస్తుతం ఒక లక్షా ముప్ఫై వేల కోట్ల రూపాయల కు పైచిలుకు స్థాయి కి చేరుకొంది అని ప్రధాన మంత్రి వెల్లడించారు. దీనికి అదనం గా, ఒక లక్ష కోట్ల రూపాయలు పల్లెల లో మరియు ఆదివాసి సముదాయాలు ఉండే ప్రాంతాల లో చేనేత రంగం తో ముడిపడ్డ వారి కి చేరువ అయ్యాయి అని ఆయన చెప్పారు. గత అయిదు సంవత్సరాల లో 13.5 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డట్టు తెలిపిన నీతి ఆయోగ్ నివేదిక ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, టర్నోవర్ లో నమోదు అవుతున్న వృద్ధి కి ఈ అంశం యొక్క తోడ్పాటు ఉంది అని గుర్తించారు. ‘‘ ‘వోకల్ ఫార్ లోకల్’ స్ఫూర్తి తో పౌరులు స్వదేశీ ఉత్పాదనల ను హృదయ పూర్వకం గా కొనుగోలు చేస్తున్నారు, మరి ఇది ఒక ప్రజా ఉద్యమం గా మారింది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. త్వరలో రానున్న రక్షా బంధన్, గణేశ్ ఉత్సవ్, దసరా, ఇంకా దీపావళి ల వంటి పర్వదినాల లో నేతకారులు మరియు హస్తకళ ల నిపుణుల కు అండగా నిలవడం కోసం స్వదేశీ సంకల్పాన్ని మరోమారు స్వీకరించవలసిన అవసరం ఉంది అని కూడా ఆయన పునరుద్ఘాటించారు.

 

దేశ వ్యాప్తంగా గ్రామాల లో, నగరాల లో నేత సంబంధి కార్యాల లో లక్షల కొద్దీ ప్రజలు తలమునుకలు గా ఉంటున్నారు అని ప్రధాన మంత్రి చెబుతూ, వస్త్ర రంగం కోసం అమలు పరుస్తున్న పథకాలు సామాజిక న్యాయం ఆశయ సాధన కు ఒక ప్రధానమైన సాధనం గా మారుతున్నాయంటూ సంతృప్తి ని వ్యక్తం చేశారు. ఈ ప్రజానీకం లో చాలా వరకు దళితులు, వెనుకబడిన వర్గాల వారు, పస్ మాందా, ఇంకా ఆదివాసి సమాజాల వారేనని ప్రధాన మంత్రి చెబుతూ, ప్రభుత్వం యొక్క ప్రయాస లు పెద్ద సంఖ్యల లో ఉపాధి అధికం కావడాని కి, మరి అలాగే ఆదాయం లో వృద్ధి కి దారి తీశాయన్నారు. ఈ సందర్భం లో విద్యుత్తు, నీరు, గ్యాస్ కనెక్షన్ లకు ఉద్దేశించిన పథకాల తో పాటు స్వచ్ఛ్ భారత్ ను గురించి ఆయన ఉదాహరణలు గా పేర్కొన్నారు. వారు ఈ పథకాల నుండి గరిష్ఠ ప్రయోజనాల ను అందుకొన్నారని ఆయన వివరించారు. ‘‘ఉచితం గా ఆహార పదార్థాలు, పక్కా ఇల్లు, అయిదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స.. ఇదీ మోదీ ఇచ్చే హామీ’’ అని ప్రధాన మంత్రి అన్నారు. మౌలిక సదుపాయాల కోసమని నేతకారుల సముదాయం దశాబ్దాల తరబడి వేచి ఉంటూ వచ్చిన ధోరణి కి ప్రస్తుత ప్రభుత్వం స్వస్తి పలికింది అని ఆయన స్పష్టం చేశారు.

 

వస్త్ర రంగం తో సంబంధం గల సంప్రదాయాల ను కాపాడడం కోసం ప్రభుత్వం నడుం కట్టడం ఒక్కటే కాకుండా, ఈ విషయం లో ప్రపంచాన్ని ఒక సరిక్రొత్త అవతారం లో ఆకట్టుకోవడాని కి కూడాను కృషి చేస్తున్నది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఈ కారణం గానే ప్రభుత్వం ఈ పని తో సంబంధం ఉన్న వారి యొక్క విద్య, శిక్షణ మరియు ఆదాయం లపై శ్రద్ధ తీసుకొంటోందని, నేతకారుల మరియు హస్తకళ ల వృత్తి లో ఉన్న వారి యొక్క పిల్లల ఆకాంక్ష లు సాకారం అయ్యేటట్టు వారి కి తోడ్పాటు ను ఇస్తోందని ప్రధాన మంత్రి తెలిపారు. నేతకారుల సంతానాని కి శిక్షణ ఇవ్వడం కోసం టెక్స్ టైల్ ఇన్స్ టిట్యూట్స్ లో రెండు లక్షల రూపాయాల వరకు ఉపకార వేతనాన్ని ఇస్తున్న సంగతి ని గురించి ఆయన ప్రస్తావించారు. గడచిన తొమ్మిది సంవత్సరాల లో 600 కు పైగా హేండ్ లూమ్ క్లస్టర్స్ ను అభివృద్ధి పరచడం జరిగింది. అంతేకాకుండా, వేల సంఖ్య లో నేతకారుల కు శిక్షణ ను ఇవ్వడమైంది అని శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. నేతకారుల పని ని సులభతరం గా మార్చడం కోసం, వారి ఉత్పాదకత ను అధికం చేయడం కోసం మరియు నాణ్యత ను, డిజైన్ లను మెరుగు పరచడం కోసం ప్రభుత్వం అదే పని గా పాటుపడుతోంది అని ఆయన అన్నారు. కంప్యూటర్ ద్వారా పని చేసే పంచింగ్ మెశీన్ లను కూడా వారికి అందజేయడం జరుగుతోంది. దీని ద్వారా క్రొత్త క్రొత్త డిజైన్ లను త్వర త్వరగా రూపొందించడం సాధ్యపడుతుంది అని కూడా ఆయన తెలియజేశారు. ‘‘మోటార్ ల సాయం తో పని చేసే యంత్రాలు రంగ ప్రవేశం చేయడం తో పడుగు (నేత లో నిలువుపోగుల) తయారీ సైతం సులభతరం గా మారుతోంది. ఆ తరహా సామగ్రి ని, అటువంటి అనేక యంత్రాల ను నేతకారుల కు అందుబాటు లోకి తీసుకు రావడం జరుగుతోంది’’ అని ఆయన వివరించారు. నేతకారుల కు నూలు వంటి ముడిపదార్థాల ను తగ్గింపు ధరల కు ప్రభుత్వం అందిస్తున్నది, అలాగే ముడి పదార్థాన్ని రవాణా చేసేందుకు అయ్యేటటువంటి ఖర్చు ను కూడా భరిస్తోంది అని ఆయన చెప్పారు. ముద్ర యోజన ను గురించి కూడా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఎటువంటి పూచీకత్తు ను సమర్పించకుండానే రుణాల ను అందుకోవడం ప్రస్తుతం నేతకారుల కు సాధ్యపడుతోందన్నారు.

 

గుజరాత్ లోని నేత కార్మికులతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న

ప్రధాన మంత్రి, తన నియోజకవర్గం అయిన మొత్తం కాశీ ప్రాంతంలో చేనేత పరిశ్రమ చేసిన కృషిని వివరించారు.

చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను విక్రయించడంలో ఎదుర్కొంటున్న సరఫరా చైన్, మార్కెటింగ్ సవాళ్లను ప్రస్తావిస్తూ, భారత్ మండపం తరహాలో దేశవ్యాప్తంగా ఎగ్జిబిషన్లు నిర్వహించడం ద్వారా చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ కు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వారికి ఉచిత స్టాల్ తో పాటు రోజువారీ భత్యాన్ని కూడా అందిస్తున్నట్లు శ్రీ మోదీ తెలియజేశారు.

కుటీర పరిశ్రమలు, చేనేతలు తయారు చేసే ఉత్పత్తులకు మెళకువలు, నమూనాల్లో నూతన ఆవిష్కరణలు, మార్కెటింగ్ పద్ధతులను తీసుకువచ్చిన స్టార్టప్ లు, యువతను ప్రధాని అభినందించారు. 'వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్' పథకం గురించి ప్రస్తావిస్తూ, ప్రతి జిల్లా నుంచి ప్రత్యేక ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఇలాంటి ఉత్పత్తుల అమ్మకాల కోసం దేశంలోని రైల్వే స్టేషన్లలో ప్రత్యేక స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి రాష్ట్రం, జిల్లా నుంచి తయారైన చేనేత హస్తకళలు, ఉత్పత్తులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రతి రాజధాని నగరంలో అభివృద్ధి చేస్తున్న ఏక్తా మాల్ వల్ల చేనేత రంగంతో సంబంధం ఉన్నవారికి ప్రయోజనం కలుగుతుందన్నారు. స్టాట్యూ  ఆఫ్ యూనిటీ వద్ద ఉన్న ఏక్తా మాల్ ను గురించి కూడా శ్రీ మోదీ ప్రస్తావించారు. ఇది పర్యాటకులకు భారతదేశ ఐక్యతను అనుభూతి చెందడానికి, ఏ రాష్ట్రం ఉత్పత్తులను అయినా ఒకే చోట  కొనుగోలు చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది.

 

తన విదేశీ పర్యటనల సందర్భంగా ప్రముఖులకు ఇచ్చే వివిధ బహుమతుల గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, వీటిని వారు ప్రసంసిస్తున్నప్పుడే కాకుండా వాటిని తయారు చేసే వారి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి

చూపిస్తున్నప్పుడు అమిత ప్రభావాన్ని సృష్టిస్తుందని అన్నారు.

 

జి ఇఎమ్ పోర్టల్ లేదా గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ గురించి ప్రస్తావిస్తూ, చిన్న చేతివృత్తులవారు , హస్తకళాకారులు లేదా నేత కార్మికులు కూడా తమ వస్తువులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించవచ్చని, చేనేత , హస్తకళలకు సంబంధించిన సుమారు 1.75 లక్షల సంస్థలు నేడు జి ఇ ఎమ్ పోర్టల్ కు అనుసంధానించబడి ఉన్నాయని ప్రధాన మంత్రి తెలియజేశారు. చేనేత రంగంలోని సోదర సోదరీమణులకు డిజిటల్ ఇండియా ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు.

"నేత కార్మికులకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ను అందించడానికి ప్రభుత్వం స్పష్టమైన వ్యూహంతో పనిచేస్తోంది" అని ప్రధాన మంత్రి చెప్పారు. భారతదేశంలోని ఎంఎస్ఎంఇ లు, నేత కార్మికులు, చేతివృత్తులు, రైతుల ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు తీసుకెళ్లడానికి ప్రపంచంలోని పెద్ద కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు.

 

ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్టోర్లు, రిటైల్ సప్లై చైన్లు, ఆన్ లైన్ వ్యవస్థలు, దుకాణాలు ఉన్న పలు కంపెనీల నాయకులతో తాము జరిపిన చర్చలను ఆయన ప్రస్తావించారు. అలాంటి కంపెనీలు ఇప్పుడు భారతదేశం స్థానిక ఉత్పత్తులను ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకెళ్లాలని సంకల్పించాయని ఆయన పేర్కొన్నారు. చిరుధాన్యాలు లేదా చేనేత ఉత్పత్తులు ఏదైనా సరే, ఈ పెద్ద అంతర్జాతీయ కంపెనీలు వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు తీసుకువెళతాయి" అని ఆయన అన్నారు.

 

ఉత్పత్తులు భారత్ లోనే తయారవుతాయని, సరఫరా గొలుసును ఈ బహుళజాతి కంపెనీలు ఉపయోగించుకుంటాయని ఆయన ఉద్ఘాటించారు.

 

టెక్స్ టైల్ పరిశ్రమ, ఫ్యాషన్ ప్రపంచంతో సంబంధమున్న వారి గురించి ప్రస్తావిస్తూ, ప్రపంచంలోని టాప్ -3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదగడానికి తీసుకున్న చర్యలతో పాటు మన ఆలోచన, పని పరిధిని పెంచాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. భారతదేశ చేనేత, ఖాదీ, జౌళి రంగాన్ని ప్రపంచ ఛాంపియన్ లుగా తీర్చిదిద్దేందుకు 'సబ్ కా ప్రయాస్ ' (ప్రతి ఒక్కరి కృషి) అవసరమని ఆయన స్పష్టం చేశారు. "కార్మికుడు, నేత కార్మికుడు, డిజైనర్ లేదా పరిశ్రమ ఏదైనా, ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలి", అని ఆయన అన్నారు. నేత కార్మికుల నైపుణ్యాన్ని స్కేల్, టెక్నాలజీతో అనుసంధానం చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. భారత దేశంలో కొత్త మధ్య తరగతి (నియో మిడిల్ క్లాస్) ఆవిర్భావాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ప్రతి ఉత్పత్తికి ఒక భారీ యువ వినియోగ వర్గం సిద్ధం అవుతోందని, ఇది టెక్స్ టైల్ కంపెనీల కు గొప్ప అవకాశాలను అందిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

అందువల్ల, స్థానిక సరఫరా గొలుసును బలోపేతం చేయడం , దానిలో పెట్టుబడులు పెట్టడం కూడా ఈ కంపెనీల బాధ్యత అని ప్రధాన మంత్రి అన్నారు. రెడీమేడ్ దుస్తులు భారతదేశం వెలుపల లభిస్తే వస్త్రాలను దిగుమతి చేసుకునే విధానాన్ని ఆయన ఖండించారు.

స్థానిక సరఫరా గొలుసులో పెట్టుబడులు పెట్టడం, భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం గురించి ఆయన చెప్పారు ఈ రంగంలోని పెద్ద సంస్థలు ఇంత తక్కువ నోటీసుతో ఇది ఎలా జరుగుతుందనే సాకులు చెప్పకూడదని అన్నారు. భవిష్యత్తులో మనం అవకాశంగా చేసుకోవాలంటే స్థానిక సరఫరా గొలుసులో ఈ రోజు పెట్టుబడులు పెట్టాలి. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి , ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలను సాకారం చేయడానికి ఇది మార్గం" అని ఆయన అన్నారు.

ఈ మార్గాన్ని అనుసరించడం ద్వారానే మన స్వాతంత్ర్య సమరయోధుల స్వదేశీ కల సాకారమవుతుందని ఆయన అన్నారు. "ఆత్మనిర్భర్ భారత్ కలలను అల్లేవారు , 'మేక్ ఇన్ ఇండియా' కు బలాన్ని అందించే వారు ఖాదీని కేవలం దుస్తులుగా కాకుండా ఒక ఆయుధంగా భావిస్తారు" అని ప్రధాన మంత్రి అన్నారు.

ఆగస్టు 9  ఔచిత్యం గురించి ప్రస్తావిస్తూ, బ్రిటిష్ వారికి క్విట్ ఇండియా సందేశాన్ని పంపిన పూజ్య మహాత్మాగాంధీ నాయకత్వంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమానికి ఈ తేదీ సాక్షిగా నిలిచిందని ప్రధాన మంత్రి అన్నారు. ఇది జరిగిన కొద్దికాలానికే బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చిందని ప్రధాన మంత్రి అన్నారు. దేశం సంకల్ప బలంతో ముందుకు సాగుతున్న ఆగస్టు 9  ప్రాముఖ్యతను ప్రధాని వివరించారు.

' వికసిత్ భారత్' లేదా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలని దేశం సంకల్పిస్తున్నప్పుడు అడ్డంకిగా మారిన శక్తులను తరిమికొట్టడానికి ఒకప్పుడు ఉపయోగించిన మంత్రాన్ని ఉపయోగించవచ్చని ఆయన అన్నారు.

"యావత్ భారతదేశం ఒకే స్వరంతో ప్రతిధ్వనిస్తోంది - అవినీతి, వంశపారంపర్యం, బుజ్జగింపుల విధానాలను, వాటిని ప్రోత్సహించే శక్తులను క్విట్ ఇండియా అంటూ తప్పక వ్యతిరేకించాలి" అని శ్రీ మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. భారత్ లో ఈ దురాచారాలు దేశానికి పెద్ద సవాలు అని, ఈ దురాచారాలను దేశం ఓడిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

"దేశం విజయం సాధిస్తుంది, భారత ప్రజలు విజయం సాధిస్తారు", అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ, ఎన్నో ఏళ్లుగా త్రివర్ణ పతాకాన్ని నేసేందుకు అంకితమైన మహిళలతో తన సంభాషణను వివరించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి మరోసారి 'హర్ ఘర్ తిరంగా'ను జరుపుకోవాలని ఆయన ప్రజలను కోరారు. " ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు, అది మనలో కూడా ఎగురుతుంది" అని ప్రధాన మంత్రిఅన్నారు. .

కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీమతి దర్శనా జర్దోష్, కేంద్ర సూక్ష్మ, చిన్న,  మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నారాయణ్ తాతు రాణే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

దేశంలోని గొప్ప కళానైపుణ్య సంప్రదాయాన్ని సజీవంగా ఉంచుతున్న చేతివృత్తుల వారికి, హస్తకళాకారులకు ప్రోత్సాహం, విధానపరమైన మద్దతు ఇవ్వడానికి ప్రధాన మంత్రి ధృఢ సంకల్పం తో ఉన్నారు. ఈ దార్శనికతతో ప్రభుత్వం 2015, ఆగష్టు-7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 1905 ఆగస్టు 7 న ప్రారంభమైన స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఈ తేదీని ప్రత్యేకంగా ఎంపిక చేశారు. దేశీయ పరిశ్రమలను, ముఖ్యంగా చేనేత కార్మికులను ప్రోత్సహించారు.

 

ఈ ఏడాది 9వ జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) అభివృద్ధి చేసిన టెక్స్ టైల్స్ అండ్ క్రాఫ్ట్స్ రిపాజిటరీ అయిన భారతీయ వస్త్ర ఎవం శిల్పా కోష్ ఇ-పోర్టల్ ను ప్రధాన మంత్రి ప్రారంభించారు.

 

ఈ కార్యక్రమంలో 3000 మందికి పైగా చేనేత, ఖాదీ నేత కార్మికులు, చేతివృత్తులవారు, టెక్స్ టైల్, ఎంఎస్ ఎం ఇ రంగాలకు చెందిన భాగస్వాములు పాల్గొన్నారు. భారతదేశంలోని హ్యాండ్లూమ్ క్లస్టర్లు, నిఫ్ట్ క్యాంపస్ లు,, వీవర్ సర్వీస్ సెంటర్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ క్యాంపస్ లు, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హ్యాండ్లూమ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, కె వి ఐ సి సంస్థలు, వివిధ రాష్ట్ర చేనేత విభాగాలను ఏకతాటిపైకి తీసుకు రావడానికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi