దేశ సమున్నత వైవిధ్యతను ప్రదర్శించేలా రిపబ్లిక్‌ దినోత్సవ శకటాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో భారత్‌ పర్వ్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి.
పరాక్రమ దివస్‌ సందర్భంగా, నేతాజీ ఆశయాలు, వారి కలలకు అనుగుణమైన భారతదేశాన్ని నిర్మించేందుకు మన నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం.
సమర్థులైన దేశ అమృత్‌ తరానికి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఆదర్శవంతమైన ఒక పెద్ద నమూనా. నేతాజీ జీవితం అసమాన ధైర్యానికి , కష్టపడే తత్వానికి శిఖరసమానమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ప్రజాస్వామ్యానికి ఇండియా మాతృక అని ప్రపంచం ఎదుట నేతాజీ బలంగా రుజువుచేశారు. బానిస మనస్తత్వంనుంచి యువతను బయటపడేసేందుకు నేతాజీ కృషిచేశారు.
‘‘ ఇవాళ, దేశయువత తమ సంస్కృతి, విలువలు, భారతీయతను మునుపెన్నడూ లేని రీతిలో సగర్వంగా చాటుతోంది’’
‘‘ కేవలం మన యువత, మహిళాశక్తి మాత్రమే దేశ రాజకీయాలను బంధుప్రీతి, అవినీతి వంటి దుర్లక్షణాలనుంచి బయటపడేయగలదు’’
‘‘ మన లక్ష్యం ఇండియాను ఆర్థికంగా సుసంపన్న దేశంగా తీర్చిదిద్దడం, సాంస్కృతికంగా బలోపేతం చేయడం,వ్యూహాత్మకంగా సమర్థవంతంగా తీర్చిదిద్దడం.’’
‘‘ మనం అమృత్‌ కాల్‌ లోని ప్రతి క్షణాన్ని జాతీయ ప్రయోజనాలకోసం వినియోగించ
దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రముఖులను గౌరవించుకోవాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా పరాక్రమ్‌ దివస్‌ను పాటిస్తున్నారు.
దేశ అమ్రుత్ తరం యువతకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక గొప్ప ఆదర్శం’’ అని ప్రధానమంత్రి అన్నారు.

ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ ఈరోజు , ఢల్లీిలోని ఎర్రకోటవద్ద జరిగిన పరాక్రమ్‌ దివస్‌ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి భారత్‌ పర్వ్‌ ను ప్రారంభించారు. ఇందులో దేశ సుసంపన్న వైవిధ్యతను రిపబ్లిక్‌ దినోత్సవ శకటాలను, సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. నేషనల్‌ ఆర్కైవ్స్‌  నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పై ఫోటోలు, పెయింటింగ్స్‌, పుస్తకాలు, శిల్పాలతో కూడిన సాంకేతికత ఆధారిత ఇంటరాక్టివ్‌ ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి తిలకించారు. నేతాజీ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా వారు నేతాజీ జీవితంపై ప్రదర్శించిన డ్రామాను ప్రధానమంత్రి తిలకించారు. ఐఎన్‌ఎ కి సంబంధించి జీవించి ఉన్న ఏకైక ప్రముఖుడు లెఫ్టినెంట్‌ ఆర్‌.మాధవన్‌ ను ప్రధానమంత్రి ఈ సందర్భంగా సత్కరించారు. పరాక్రమ్‌దివస్‌ను 2021 నుంచి నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతి రోజు జరుపుకుంటున్నారు. దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రముఖులను గౌరవించుకోవాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా పరాక్రమ్‌ దివస్‌ను పాటిస్తున్నారు.

 

ఈ సందర్భంగా హాజరైన వారినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, నేతాజీ  సుభాష్ చంద్ర  బోస్ జన్మదినం రోజును జరుపుకుంటున్నపరాక్రమ్  దివస్ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఒకప్పుడు అజాద్ హింద్ ఫౌజ్   ధైర్య సాహసాలకు సాక్షిగానిలిచిన ఎర్రకోట నేడు కొత్త శక్తితో వెలుగొందుతోందని అన్నారు.  ఆజాదికా అమ్రుత్ కాల్  తొలి నాళ్ల విజయాల గురించి ప్రధానమంత్రి  ప్రస్తావించారు. సంకల్పం ద్వారా  విజయసాధన జరిగిన తీరును  తెలియజేశారు. నిన్న జరిగిన  ఈవెంట్ గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి  భారతదేశంలో  సాంస్క్రుతిక చైతన్యం వెల్లివిరిస్తున్న  విషయాన్ని ప్రపంచం చూసిందని  అన్నారు.

’’అయోధ్యలో బాలరాముడి  విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా  మహోత్సవాన్ని   ప్రపంచ మానవాళి మొత్తం తిలకించిందని, ఆ ఉత్సాహం, విశ్వాసాన్ని ప్రపంచం  చూసిందని  చెప్పారు.ఇవాళ నేతాజీ సుభాష్ చంద్ర బోస్  జయంతి ఉత్సవాలు జరుగుతన్నాయన్నారు. పరాక్రమ్ దివస్ ను ప్రకటించినప్పటి  నుంచి ఈ  ఉత్సవాలు మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయని చెప్పారు.  ఈ ఉత్సవాలతో జనవరి  23నుంచి, మహాత్మాగాంధీ వర్థంతి అయిన జనవరి 30 వరకు రిపబ్లిక్  దినోత్సవాలు మరింత విస్త్రుతమయ్యాయని చెప్పారు. జనవరి  22 ఉత్సవాలు కూడా  ప్రజాస్వామ్య  ఉత్సవంలో భాగంగా మారాయన్నారు.’’జనవరి మాసం  చివరి రోజులు భారతీయ విశ్వాసాలు, సంస్క్రుతి, సాంస్క్రుతిక  చైతన్యం, ప్రజాస్వామ్యం, దేశభక్తికి  ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి  ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

 ఈ ఈవెంట్ నిర్వహణలొ  పాల్గొన్న  ప్రతిఒక్కరికీ  ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ  కార్యక్రమానికి ముందు ప్రధానమంత్రి  రాష్ట్రీయ  బాల పురస్కార్ అవార్డు  గ్రహీతలైన బాలలతో మాట్లాడారు.‘‘ నేను భారతీయ యువతను కలుసుకున్నప్పుడల్లా

 

వికసిత్ భారత్ కు సంబంధించి  నా  కలలు మరింత బలోపేతం  అవుతుంటాయి. దేశ అమ్రుత్ తరం  యువతకు నేతాజీ  సుభాష్ చంద్రబోస్ ఒక గొప్ప ఆదర్శం’’ అని  ప్రధానమంత్రి  అన్నారు.

ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించిన ,భారత్ పర్వ్ గురించి కూడా మాట్లాడారు. రాగల 9 రోజులపాటు జరిగే కార్యక్రమాలను ప్రధానమంత్రి వివరించారు.‘‘ భారత్  పర్వ్  నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదర్శాలకు ప్రతిరూపం. స్థానిక ఉత్పత్తులకు ఓకల్ ఫర్  లోకల్ ద్వారా ప్రాధాన్యతనిచ్చే  పర్వ్ ఇది.పర్యాటకం, దేశ  వైవిధ్యతను గౌరవించుకోవడం, ఏక్ భారత్ , శ్రేష్ఠ్ భారత్  ను సమున్నత శిఖరాలకు  తీసుకెళ్లడం  ఇందులోని ముఖ్యాంశాలని చెప్పారు.

 

ఐఎన్ఎ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న  సందర్భంగా అదే ఐ.ఎన్.ఎ వద్ద జాతీయపతాకాన్ని  ఎగురవేయడం గురించి ప్రస్తావిస్తూ  ప్రధానమంత్రి, ‘‘నేతాజీ సుభాష్ చంద్రబోస్  జీవితం, కష్టించి పనిచేసే తత్వానికి, అసమాన శౌర్యానికి  శిఖర  సమానమైనదన్నారు. నేతాజీ త్యాగాలను స్మరించుకుంటూ ప్రధానమంత్రి, బ్రిటిష్ వారిని ఎదిరించడంతో పాటు,  భారతనాగరికతపై ప్రశ్నలు సంధించిన  వారికి  ఆయన ధీటైన సమాధానం ఇచ్చారని  అన్నారు. భారతదేశం  , ప్రజాస్వామ్యానికి మాత్రుక  అన్న విషయాన్ని నేతాజీ , ప్రపంచానికి తెలియజెప్పారన్నారు.

బానిసత్వానికి వ్యతిరేకంగా నేతాజీ సాగించిన పోరాటం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, 

ఇవాల్టి భారతదేశ యువతలో వెల్లివిరిస్తున్న నూతన చైతన్యాన్ని చూసి , నేతాజీ ఎంతో సంతోషపడేవారని అన్నారు.  ఈ నూతన ఉత్సాహం వికస్ భారత్ స్రుష్టికి కొత్త శక్తిని ఇస్తోందన్నారు. ఇవాల్టి యువత పంచ్ ప్రాణ్ను అనుసరిస్తోంది. బానిసత్వం నుంచి బయటకు వస్తోంది అని ఆయన అన్నారు.                                                                                                                                        నేతాజీ జీవితం, ఆయన సేవలు భారత  యువతకు ప్రేరణనిస్తాయని  ప్రధానమంత్రి  అన్నారు.  ఈ స్పూర్తి ని ఇలాగే నిరంతరం ముందుకు తీసుకువెళ్లగలరన్న ఆశాభావాన్ని ఆకాంక్షను వ్యక్తం  చేశారు.  ఈ నమ్మకంతోనే ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా సాగిస్తున్న క్రుషిని ప్రధానమంత్రి ప్రస్తావించారు.నేతాజీ సుభాష్  చంద్రబోస్  విగ్రహాన్ని కర్తవ్యపథ్ లో ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ విగ్రహం , విధినిర్వహణలో అంకితభావాన్ని  ప్రతి  పౌరుడికి గుర్తుచేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఆజద్  హింద్ ఫౌజ్ తొలిసారిగా త్రివర్ణ  పతాకాన్ని ఎగురవేసిన  అండమాన్ నికోబార్ దీవులలో కొన్నింటికి నేతాజీ ని గుర్తుచేసుకునేలా పేర్లుమార్చిన  విషయాన్ని  ప్రధానమంత్రి ఈ  సందర్భంగా గుర్తుచేశారు. నేతాజీ పేరుమీద స్మారకాన్ని అభివ్రుద్ధి  చేస్తున్నట్టు తెలిపారు. ఎర్రకోటలో నేతాజీ, ఆజాద్ హింద్ ఫౌజ్ పై ప్రత్యేక మ్యూజియం ఏర్పాటుచేయడం జరుగుతోందన్నారు.తొలిసారిగా జాతీయ విపత్తు సహాయ అవార్డును నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుమీద ప్రకటించినట్టు తెలిపారు. అజాద్ హింద్  ఫౌజ్ కు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం  , స్వతంత్రభారత చరిత్రలో మరి ఏ ఇతర ప్రభుత్వం చేయనంత  చేసిందని ఆయన అన్నారు.  నేతాజీ ఆశీస్సులు తమకు ఉన్నాయని ప్రధానమంత్రి తెలిపారు.

 

భారతదేశ సవాళ్లపై నేతాజీకి లోతైన అవగాహన ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రజాస్వామిక సమాజ పునాదిపై  భారత దేశ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగలమన్నది తన విశ్వాసమని ప్రధానమంత్రి అన్నారు. అయితే స్వాతంత్ర్యానంతరం నేతాజీ ఆదర్శాలపై దాడి జరిగిందని, బంధుప్రీతి, పక్షపాతం వంటివి భారత ప్రజాస్వామ్యంలో వచ్చి చేరాయని, ఫలితంగా భారతదేశ అభివ్రుద్ధి మందగించిందని ప్రధానమంత్రి  విమర్శించారు.

సమాజంలోని మెజారిటీ  ప్రజలు తమకు దక్కవలసిన అవకాశాలను అందుకోలేకపోయారని, వారి అభ్యున్నతికి అవసరమైన మౌలికసదుపాయాలకు వారు దూరమయ్యారని ప్రధానమంత్రి  తెలిపారు. రాజకీయ, ఆర్ధిక, అభివ్రుద్ధి విధానాలలో  కొద్దికుటుంబాల పలుకుబడి పెరిగిపోయిన విషయాన్ని ఈ సందర్బంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు.దీనివల్ల దేశ యువత , మహిళలు నష్టపోతున్నారన్నారు. గతంలో దేశ యువత , మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రధానమంత్రి  ప్రస్తావిస్తూ, సబ్ కా సాథ్, సబ్ కా  వికాస్  స్ఫూర్తి ప్రాధాన్యతను ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. 2014లో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి  నుంచి సబ్ కా  సాథ్, సబ్  కా వికాస్ నినాదాన్ని  అందుకున్నట్టు తెలిపారు.గత 10 సంవత్సరాలలో జరిగిన క్రుషి ఫలితాలను ప్రస్తుతం ప్రతి ఒక్కరూ గమనించగలుగుతున్నారని ఆయన తెలిపారు. పేద ప్రజల కుమారులు, కుమార్తెలు ప్రస్తుతం అద్భుత అవకాశాలు  పొందుతున్నారని ఆయన అన్నారు.

 

భారతదేశ మహిళల్లో నానాటికీ  పెరుగుతున్న విశ్వాసంగురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. వారి చిన్న చిన్న అవసరాల విషయంలో కూడా ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్నదన్నారు.   ఈ సందర్భంగా ప్రధానమంత్రి నారీశక్తి వందన్ అధినియంను ఎన్నో ఏళ్ల తర్వాత తీసుకురాగలిగినట్టు  చెప్పారు.  అమ్రుత్ కాల్తనతోపాటు ధైర్యం, సాహసం,దేశ రాజకీయ  భవిష్యత్తుకు పునర్ రూపకల్పన చేసే  అవకాశాన్ని  తీసుకువచ్చిందని ఆయన అన్నారు. ‘‘ యువ శక్తి, నారీశక్తి వికసిత్ భారత్ రాజకీయాల మార్పులో కీలక పాత్ర  వహించనుంది. మీ శక్తి  దేశ రాజకీయాలను బంధుప్రీతి,అవినీతి  వంటి వాటినుంచి విముక్తి చేయగలదు’’ అని ఆయన అన్నారు. రాజకీయాలలో కూడా  ఈ దుర్లక్షణాలను అంతంచేసేందుకు ధైర్యం ప్రదర్శించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

 

 అయోధ్యలో  ప్రాణప్రతిష్ఠ సందర్భంగా తాను  ప్రస్తావించిన అంశాలను  గుర్తుచేస్తూ ప్రధానమంత్రి, రాముడి పని నుంచి దేశ పనివైపు ప్రతి ఒక్కరూ  అంకితం కావాలని అన్నారు. భారతదేశం నుంచి  ప్రపంచం  ఎంతో ఆశిస్తున్నదని ఆయన  తెలిపారు. 2047 నాటికి  భారతదేశాన్ని అభివవ్రుద్ధి  చెందిన దేశంగా తీర్చిదిద్దడం మన లక్ష్యం. భారతదేశం ఆర్ధికంగా సుసంపన్న దేశంగా, సాంస్క్రుతికంగా బలమైన , వ్యూహాత్మకంగా  పటిష్టమైన దేశంగా  ఎదిగేలా చేయడం  మన లక్ష్యం. ఇందుకు రాగల  5 సంవత్సరాలలో మనం ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్ధిక  శక్తిగా   ఎదగడం అవసరం . ఈ లక్ష్యం చేరుకోలేనంతదేమీ  కాదు. గత పది సంవత్సరాలలో, దేశ ప్రజల క్రుషి, ప్రోత్సాహం వల్ల 25 కోట్లమంది ప్రజలు పేదరికం  నుంచి బయటపడ్డారు. ఇండియా ఇవాళ మున్నెన్నడూ సాధించగలమని ఊహించని స్థాయిలో లక్ష్యాలను సాధిస్తోంది’’ అని ప్రధానమంత్రి  తెలిపారు.

గత 10 సంవత్సరాలలో దేశ రక్షణ రంగాన్ని స్వావలంబనకు తీసుకున్న చర్యలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. దేశీయంగా  అత్యంత చైతన్యవంతమైన రక్షణ రంగం అభివ్రుద్ధికి  క్రుషి జరిగినట్టు  తెలిపారు. ఇండియా  ఒకప్పుడుప్రపంచంలోనే అతి పెద్ద రక్షణ రంగ ఎగుమతిదారుగా ఉంటూ  వచ్చిందని, ఇప్పుడు  మళ్లీ  ప్రపంచ పెద్ద  రక్షణ  రంగ  ఎగుమతిదారుల సరసన ఇండియా  చేరుతున్నదని  ప్రధానమంత్రి  తెలిపారు.

 ఇవాళ ఇండియా ప్రపంచం మొత్తాన్ని విశ్వ మిత్రగా అనుసంధానం కావడంలో బిజీగా ఉన్నదని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న  సవాళ్లకు ఇండియా  పరిష్కారాలను కనుగొనేందుకు క్రుషి చేస్తున్నదని చెప్పారు. ఒకవైపు ఇండియా ప్రపంచం కోసం యుద్ధం బదులు శాంతి మార్గాన్ని ప్రవచిస్తున్నదని, అదే విధంగా జాతీయ ప్రయోజనాలను రక్షించుకునేందుకు సంసిద్ధమై ఉందని తెలిపారు.

 

ఇండియాకు, దేశ ప్రజలకు రాగల 25 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని అంటూ ప్రధానమంత్రి, జాతీయ ప్రయోజానల కోసం అమ్రుత్ కాల్  లోని ప్రతి క్షణం అంకితం కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.‘‘ ఇందుకోసం మనం కష్టపడి పనిచేయాలి. మనం ధైర్యంగా ఉండాలి. వికసిత్ భారత్ కు ఇవి కీలకం. పరాక్రమ్  దివస్  మనకు  ప్రతి సంవత్సరం  దీనిని గుర్తుచేస్తుంది’’ అని ప్రధానమంత్రి  తెలిపారు.

 కేంద్ర సాంస్క్రుతిక, పర్యాటక  శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, కేంద్ర సాంస్క్రుతిక శాఖ సహాయమంత్రి  శ్రీ  అర్జున్ రామ్  మేఘ్ వాల్, కేంద్ర  రక్షణ, పర్యాటక  శాఖ  సహాయమంత్రి శ్రీమతి మీనాక్షి  లేఖి, నేతాజీ  సుభాష్  చంద్ర బోస్  ఐఎన్ఎ ట్రస్ట్ ఛైర్మన్ శ్రీ అజయ్  భట్, రిటైర్డ్ బ్రిగేడియర్ ఆర్.స్ చికార తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 నేపథ్యం:

స్వాతంత్ర్య  సమరంలో కీలకపాత్ర  వహించిన  మహనీయులను గౌరవించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్న ప్రధానమంత్రి  దార్శనికతకు అనుగుణంగా , నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని 2021  నుంచి పరాక్రమ్ దివస్  గా పాటిస్తున్నారు. ఈ ఏడాది ఢిల్లీలోని ఎర్రకోటవద్ద జరుగుతున్న  పరాక్రమ్  దివస్ ఉత్సవాలు బహుముఖీనమైనవి. వీటిలో భారత దేశ చారిత్రక ఘట్టాలతోపాటు దేశ  సాంస్క్రుతిక  ఔన్నత్యాన్ని చాటిచెప్పే ఘట్టాలను  ప్రదర్శిస్తున్నారు. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్, అజాద్ హింద్ ఫౌజ్ కార్యకలాపాలను  ఈ తరానికి  తెలియజెప్పే ప్రయత్నం జరుగుతోంది. నేతాజీ, అజాద్ హింద్ ఫౌజ్  కు చెందిన అరుదైన  ఫోటోలు, డాక్యుమెంట్ లు నేతాజీ జీవితంలోని  ముఖ్య ఘట్టాలు,  అజాద్ హింద్ ఫౌజ్ ముఖ్యఘట్టాలను ఇక్కడ  ప్రదర్శిస్తున్నారు. ఈ ఉత్సవాలు 2024  జనవరి 31 వరకు  కొనసాగుతాయి.

పరాక్రమ్ దివస్ ఉత్సవాల  సందర్భంగా ప్రధానమంత్రి  భారత్ పర్వ్ ను ప్రారంభించారు.  ఇది జనవరి  23 నుంచి 31 వరకు జరుగుతుంది.  ఇందులో దేశ అత్యున్నత వైవిధ్యత, రిపబ్లిక్  దినోత్సవ  శకటాలు, సాంస్క్రుతిక ప్రదర్శనలు, ప్రజలు కేంద్రంగా కేంద్ర  ప్రభుత్వం అమలు చేస్తున్నవివిధ పథకాలపై  26 మంత్రిత్వ శాఖలు,విభాగాలు చేపట్టిన  కార్యకలాపాలు,స్థానిక  ఉత్పత్తులకు ప్రాధాన్యతనిచ్చేఓకల్ ఫర్  లోకల్, వివిధ పర్యాటక ప్రాముఖ్యతా విశేషాలు వంటి వాటిని ప్రదర్శనకు ఉంచారు. దీనిని ఢిల్లీ లోని ఎర్రకోట ఎదురుగా  ఉన్న  రామ్ లీలా మైదాన్  , మాధవ్ దాస్ పార్క్ లలో నిర్వహిస్తున్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December

Media Coverage

Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 డిసెంబర్ 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government