ఢిల్లీలో జరుగుతున్న ఒడిశా పర్వ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది, భారత అభివృద్ధిలో ఈ రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తోంది, దేశీయంగా, అంతర్జాతీయంగా ఈ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం ప్రశంసలు అందుకొంది: పీఎం
‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని ఒడిశా సంస్కృతి బలోపేతం చేస్తుంది, దీనికి ఈ రాష్ట్ర పుత్రులు, పుత్రికలు గొప్ప సహకారం అందించారు: పీఎం
భారత దేశ సాంస్కృతిక సంపదకు ఒరియా సాహిత్యం అందించిన తోడ్పాటుకు అనేక ఉదాహరణలు మనం చూడొచ్చు : పీఎం
ఒడిశా సాంస్కృతిక వైభవం, శిల్పకళ, శాస్త్రీయ విజ్ఞానం ఎప్పుడూ ప్రత్యేకమే, ఈ ప్రాంత ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు వినూత్న చర్యలు నిరంతరం చేపట్టాలి: పీఎం
ఒడిశాలో ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేం వేగంగా పనిచేస్తున్నాం, నౌకాశ్రయ ఆధారిత పరిశ్రమాభివృద్ధికి విస్తృత అవకాశాలు: పీఎం
భారత్‌ లో గనులు, లోహాలకు ప్రధాన కేంద్రం ఒడిశా, ఇది ఉక్కు, అల్యూమినియం, విద్యుత్ రంగాల్లో తన స్థానాన్ని బలోపేతం చేస్తోంది: పీఎం
ఒడిశాలో సులభతర వ్యాపార విధానాలను ప్రవేశపెట్టేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది: పీఎం
ప్రస్తుతం ఒడిశాకు సొంత లక్ష్యం, ప్రణాళిక ఉన్న

న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ‘ఒడిశా పర్వ 2024’ ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభకు హాజరైన ఒడిశా సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదితో స్వభావ్ కవి గంగాధర్ మెహర్ మరణించి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భక్త దసియా భౌరీ, భక్త సాలబేగ, భగవద్గీతను ఒడియాలో రచించిన శ్రీ జగన్నాథ్ దాస్‌‌కు సైతం ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.

‘సాధువులు, పండితులకు ఒడిశా నెలవు’’ అని శ్రీ మోదీ అభివర్ణించారు. సరళ మహాభారతం, ఒడియా భాగవతం లాంటి గొప్ప సాహిత్యాన్ని ప్రజలకు చేరువయ్యేలా చేసి సాంస్కృతిక వైభవాన్ని కాపాడటంలో ఇక్కడి సాధువులు, పండితులు గొప్ప పాత్ర పోషించారని అన్నారు. మహాప్రభు జగన్నాథునికి సంబంధించి ఒడియా భాషలో విస్తృతమైన సాహిత్యం ఉందని తెలిపారు. జగన్నాథుడి గాథను స్మరించుకుంటూ ఆయన యుద్ధాన్ని ముందుండి నడిపించారని అన్నారు. యుద్ధరంగంలో ప్రవేశించే ముందు మానిక గౌదిని చేతితో పెరుగు భుజించిన ప్రభు జగన్నాథుని నిరాడంబర తత్వాన్ని కొనియాడారు. పైన చెప్పిన కథ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చన్న శ్రీ మోదీ, మంచి ఆలోచనతో పనిచేస్తే భగవంతుడే మనల్ని ముందుకు నడిపిస్తారనేది ముఖ్యమైన పాఠమని అన్నారు. భగవంతుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడని క్లిష్టమైన పరిస్థితుల్లోనూ మనం ఒంటరిగా ఉన్నామని భావించకూడదని అన్నారు.
 

ఎంత భాధనైనా భరించి, ప్రపంచాన్ని రక్షించాలన్న ఒడిశా కవి భీమ్ భోయి సూక్తిని ఉటంకిస్తూ ఇదే ఒడిశా సంస్కృతి అని ప్రధానమంత్రి అన్నారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ అనే భావనను పూరీధామం పటిష్టం చేస్తోందని శ్రీ మోదీ వివరించారు. స్వాతం THRYA  సమరంలో ఒడిశా వీరపుత్రులు పాలు పంచుకుని దేశానికి దిశానిర్దేశం చేశారని తెలిపారు. పైకా క్రాంతి అమరవీరుల రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేమని అన్నారు. పైకా క్రాంతి విప్లవంపై స్మారక తపాలా బిళ్ల, నాణెం విడుదల చేసే అవకాశం రావడం తమ ప్రభుత్వానికి దక్కిన అదృష్టంగా పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశమంతా ఉత్కల్ కేసరి హరే కృష్ణ మెహతాబ్ జీ చేసిన సేవలను స్మరించుకుంటోందని, ఆయన 125వ జయంతిని ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తోందని శ్రీ మోదీ తెలిపారు. గతం నుంచి ఇప్పటి వరకు దేశానికి ఒడిశా అందించిన నాయకుల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. గిరిజన తెగకు చెందిన శ్రీమతి ద్రౌపదీ ముర్ము దేశానికి రాష్ట్రపతిగా ఉన్నారని, ఇది మనందరికీ గర్వకారణమని అన్నారు. ఆమె స్ఫూర్తితోనే భారత దేశంలో గిరిజన సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయల విలువైన పథకాలను అమలు చేస్తున్నామని, ఇవి ఒడిశాకు చెందిన వారికి మాత్రమే కాకుండా భారతదేశంలోని గిరిజనులందరికీ ప్రయోజనం అందిస్తాయని వివరించారు.
 

ఒడిశా మహిళా శక్తికి నిలయమని, ఆ శక్తి సుభద్రా మాత రూపంలో ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఒడిశా మహిళలు పురోగతి సాధించినప్పుడే ఈ రాష్ట్రం పురోభివృద్ధి దిశగా నడుస్తుందని ప్రధానమంత్రి అన్నారు. కొన్ని రోజుల క్రితం ఒడిశాలోని తల్లులు, సోదరీమణుల కోసం సుభద్ర యోజనను లాంఛనంగా ప్రారంభించే గొప్ప అవకాశం తనకు దక్కిందని, ఇది వారికి లబ్ధి చేకూరుస్తుందని ఆయన తెలిపారు.

భారత దేశ నౌకా రవాణా వ్యవస్థకు సరికొత్త దిశను నిర్దేశించడంలో ఒడిశా అందించే సహకారాన్ని శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. కార్తీక పౌర్ణమి రోజు కటక్‌లోని మహానది ఒడ్డున అంగరంగ వైభవంగా నిర్వహించిన బలి జాతర నిన్నే ముగిసిందని తెలిపారు. భారతదేశ నావికా శక్తికి ఇది నిదర్శనమని అభివర్ణించారు. అలనాటి నావికుల ధైర్యాన్ని ప్రశంసిస్తూ, ఇప్పటిలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా సముద్రాలను దాటే ధైర్యం వారికి ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఇండోనేషియాలోని బాలీ, సుమత్ర, జావా ప్రాంతాలకు వర్తకులు నౌకల్లో ప్రయాణించేవారని, ఇది వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి, వివిధ ప్రాంతాలకు సంస్కృతిని విస్తరించేందుకు దోహదపడిందని వివరించారు. అభివృద్ధి చెందిన భారత్ సంకల్పాన్ని చేరుకోవడంలో ఒడిశా సముద్ర రవాణా శక్తి తోడ్పడుతుంది.

ఒడిశాను నూతన స్థాయికి చేర్చేందుకు గత పదేళ్లుగా చేపట్టిన నిరంతర ప్రయత్నాల తర్వాత, ఇప్పుడు ఆ రాష్ట్ర భవిష్యత్తుపై సరికొత్త ఆశలు చిగురించాయని నరేంద్రమోదీ అన్నారు. తమకు అపూర్వమైన ఆశీర్వాదం అందించిన ఒడిశా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీ మోదీ, ఇది ఆ ఆశకు కొత్త ధైర్యాన్నిచ్చిందని, ఇప్పుడు ప్రభుత్వం పెద్ద కలలు కంటుందని, పెద్ద లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటుందని తెలిపారు. 2036లో ఒడిశా రాష్ట్రం శతాబ్ధి ఉత్సవాలు జరుపుకొంటుందని, దేశంలోనే దృఢమైన, సుసంపన్నమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఒడిశాను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.
 

ఒడిశా లాంటి రాష్ట్రాలున్న తూర్పు భారతాన్ని వెనుకబడిన ప్రాంతంగా పరిగణించిన రోజులు ఉన్నాయని, కానీ తాను మాత్రం ఆ ప్రాంతాన్ని దేశాభివృద్ధికి చోదకశక్తిగా భావించానని శ్రీమోదీ అన్నారు. అందుకే ప్రభుత్వం తూర్పు భారత అభివృద్ధికి ప్రాధాన్యమించ్చింది. ప్రస్తుతం తూర్పు భారతంలో రవాణా, ఆరోగ్యం, విద్య తదితర రంగాలకు సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి క్రితం కేటాయించిన బడ్జెట్ కంటే ప్రస్తుతం మూడు రెట్లు అధిక కేటాయింపులు ఒడిశాకు జరుగుతున్నాయని శ్రీ మోదీ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రాభివృద్ధికి 30 శాతం ఎక్కువ నిధులు కేటాయించామని తెలిపారు. ప్రతి రంగంలోనూ ఒడిశా వేగంగా సమగ్రాభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

‘‘నౌకాశ్రయ ఆధారిత పరిశ్రమాభివృద్ధికి ఒడిశాలో అపారమైన అవకాశాలున్నాయి’’ అని ప్రధామంత్రి అన్నారు. అందుకే ధమ్రా, గోపాల్‌పూర్, అస్తరంగ, పాలుర్, సుబర్ణలేఖ ప్రాంతాల్లో ఓడరేవులను అభివృద్ధి చేయడం ద్వారా వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. దేశంలో గనులు, లోహాలకు ఒడిశాను ప్రధానకేంద్రంగా అభివర్ణించిన శ్రీ మోదీ, ఉక్కు, అల్యూమినియం, విద్యుత్ రంగాల్లో ఈ రాష్ట్ర స్థానం బలోపేతమయిందని అన్నారు. ఈ రంగాలపై దృష్టి సారించడం ద్వారా ఒడిశాలో అభివృద్ధికి కొత్త తలుపులు తెరవవచ్చని అన్నారు.

జీడిపప్పు, జనపనార, పత్తి, పసుపు, నూనెగింజల ఉత్పత్తి ఒడిశాలో SAMRUDDHIగా ఉందన్న శ్రీ మోదీ, ఈ ఉత్పత్తులను పెద్ద మార్కెట్లకు చేర్చి, తద్వారా రైతులకు మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఒడిశాలో సముద్ర ఆహార ఉత్పత్తుల శుద్ధి పరిశ్రమను విస్తరణకు అవకాశముందని, ప్రపంచ మార్కెట్లో ఒడిశా సముద్ర ఆహార బ్రాండ్ కు డిమాండ్ పెంచేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
 

ఒడిశాను పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధానంగా ప్రస్తావిస్తూ, ఈ రాష్రంలో సులభతర వ్యాపార విధానాలు, ఉత్కర్ష్ ఉత్కల్ ద్వారా పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి తెలిపారు. ఒడిశాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తొలి వంద రోజుల్లోనే రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించిందని శ్రీ మోదీ తెలిపారు. ప్రస్తుతం ఒడిశాకు సొంత లక్ష్యం, ప్రణాళిక ఉన్నాయని, ఇవి పెట్టుబడులను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయి అని అన్నారు. ఈ దిశగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఒడిశా సామర్థ్యాన్ని సరైన దిశలో ఉపయోగించుకోవడం ద్వారా అభివృద్ధిని నూతన శిఖరాలకు చేర్చవచ్చని శ్రీమోదీ తెలిపారు. వ్యూహాత్మకంగా ఉన్న తన భూభాగం నుంచి ఒడిశా పొందే ప్రయోజనం గురించి వివరిస్తూ ఇక్కడి నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు సులభంగా చేరుకోవచ్చని ప్రధానమంత్రి అన్నారు. ‘‘తూర్పు, ఆగ్నేయ ఆసియాతో వాణిజ్యానికి ఒడిశా ప్రధాన కేంద్రం’’ అని అభివర్ణించిన శ్రీ మోదీ, రాబోయే కాలంలో అంతర్జాతీయ విలువ ఆధారిత వ్యవస్థల్లో ఒడిశా ప్రాధాన్యం పెరుగుతుందని అన్నారు. రాష్ట్రం నుంచి ఎగుమతులను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.

‘‘ఒడిశాలో నగరీకరణను ప్రోత్సహించేందుకు అపార అవకాశం ఉంది’’ అన్న ప్రధానమంత్రి ఆ దిశగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పెద్ద సంఖ్యలో క్రియాశీల, అనుసంధానిత నగరాలను నిర్మించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. ఒడిశాలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ప్రభుత్వం నూతన అవకాశాలను కల్పిస్తుందని, ముఖ్యంగా పశ్చిమ జిల్లాల్లో నూతనంగా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలు కొత్త అవకాశాలను సృష్టించగలవని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
 

ఉన్నత విద్యారంగం గురించి చర్చిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఒడిశా కొత్త ఆశాకిరణమని, ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలు ఉన్నాయని, విద్యారంగంలో నాయకత్వం రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు స్ఫూర్తినిచ్చిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలు రాష్ట్రంలో అంకుర సంస్థల వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాయని అన్నారు.

సాంస్కృతిక వైభవం కారణంగా ఒడిశా ఎప్పుడూ ప్రత్యేకమే అని, ఈ రాష్ట్రంలోని కళలు అందరినీ అబ్బురపరుస్తాయని శ్రీ మోదీ అన్నారు. ఒడిస్సీ నృత్యమైనా, చిత్రలేఖనమైనా, చిత్రాలలోని జీవకళ లేదా సౌర చిత్రలేఖనాలైనా, ఇవన్నీ గిరిజన కళలలకు చిహ్నాలే అని అన్నారు. ఒడిశాలోని సంబల్పూరీ, బొమ్కై, కోట్పాడ్ నేతకార్మికులు నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరూ చూడాల్సిందేనని ఆయన అన్నారు. ఈ కళను, కళానైపుణ్యాన్ని ఎంతగా విస్తరింపచేసి సంరక్షిస్తామో.. అంత ఎక్కువగా ఒడియా ప్రజలపై గౌరవం పెరుగుతుందని వివరించారు.

ఒడిశా శిల్పకళా, విజ్ఞాన వారతస్వం గురించి ప్రస్తావిస్తూ, కోణార్క్ సూర్యదేవాలయం, లింగరాజ్, ముక్తేశ్వర్ తదితర ఆలయాల్లోని విజ్ఞానం, నిర్మాణ శైలి, వాటి పరిమాణ వైభవం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయని ప్రధాని అన్నారు.

పర్యాటక రంగంలో విస్తృతమైన అవకాశాలున్న ప్రదేశంగా ఒడిశాను అభివర్ణిస్తూ, వీటిని వాస్తవంగా ఆచరణలోకి తీసుకువచ్చేందుకు వివిధ మార్గాల్లో కృషి చేయాల్సిన అవసరం ఉందని శ్రీ మోదీ అన్నారు. ప్రస్తుతం ఒడిశా వారసత్వాన్ని, గుర్తించే ప్రభుత్వం ప్రస్తుతం కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉందని తెలిపారు. గతేడాది ఒడిశాలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశాన్ని ప్రస్తావిస్తూ వివిధ దేశాల అధినేతలు, దౌత్యవేత్తల ముందు సూర్యదేవాలయ విశేషాలను గొప్పగా ప్రదర్శించామని మోదీ అన్నారు. అలాగే మహాప్రభు జగన్నాథ ఆలయ సముదాయానికి చెందిన నాలుగు ద్వారాలు, ఆలయ రత్నభాండారం తెరిచినందుకు సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు.

ఒడిశా గుర్తింపునకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రపంచానికి తెలియజెప్పడానికి వినూత్నమైన విధానాలు అవలంభించాల్సిన ఆవశ్యకత గురించి ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ఉదాహరణకు బలిజాతర  దినోత్సవాన్ని ప్రకటించి దీని ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పేలా మరింత ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ఒడిస్సీ నృత్యం లాంటి కళలకు ఒడిస్సీ దినోత్సవంతో పాటు, వివిధ గిరిజన సంప్రదాయాల కోసం సైతం ప్రత్యేక దినోత్సవాలను జరుపుకోవాలని అన్నారు. పర్యాటకం, చిన్నతరహా పరిశ్రమల్లో ఉన్న అవకాశాలపై పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీ మోదీ తెలిపారు. భవిష్యత్తులో భువనేశ్వర్‌లో ప్రవాసీ భారతీయ సదస్సును నిర్వహిస్తామని, ఇది ఒడిశాకు పెద్ద అవకాశంగా మారుతుందని అన్నారు.
 

ప్రపంచవ్యాప్తంగా మాతృభాషను, సంప్రదాయాలను మరిచిపోతున్న ధోరణి గురించి మాట్లాడుతూ ఒడియా సమాజం ఎక్కడ ఉన్నా తమ సంస్కృతి, భాష, పండుగల పట్ల ఎప్పుడూ ఆసక్తితో ఉంటారని అన్నారు. మాతృభాష, సంస్కృతి ప్రజలను తమ మాతృభూమికి ఎలా అనుసంధానిస్తాయో ఇటీవలే గయానాలో తాను చేపట్టిన పర్యటన తెలియజేసిందని అన్నారు. రెండు వందల ఏళ్ల క్రితం వందల మంది కార్మికులు భారత్ ను వదిలివెళ్లారు. కానీ తమ వెంట రామచరిత మానస్ ను తీసుకెళ్లారు. వారు ఇప్పటికీ తమ మాతృభూమితో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. అభివృద్ధి, మార్పులు చోటు చేసుకుంటున్నప్పటికీ సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించుకోగలిగినప్పుడు మాత్రమే దాని ప్రయోజనాలు అందరికీ చేరతాయని శ్రీమోదీ స్పష్టం చేశారు. ఈ మార్గంలోనే ఒడిశాను నూతన శిఖరాలకు చేర్చాలని ఆయన అన్నారు.

ప్రస్తుత ఆధునిక యుగంలో మన మూలాలను బలోపేతం చేసుకుంటూ నవీన మార్పులను స్వీకరించడం అవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఒడిశా మహోత్సవం లాంటి కార్యక్రమాలు దీనికి మాధ్యమంగా మారగలవని అభిప్రాయపడ్డారు. ఒడిశా పర్వ లాంటి కార్యక్రమాలు ఢిల్లీకే పరిమితం కాకుండా భవిష్యత్తులో మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ పండుగలో మరింత ఎక్కువమంది ప్రజలు పాల్గొనేలా, పాఠశాలలు, కళాశాలల భాగస్వామ్యం పెరిగేలా చూడాలని శ్రీమోదీ సూచించారు. ఒడిశా గురించి తెలుసుకోవడానికి ఢిల్లీలో నివాసముంటున్న ఇతర ప్రాంతాల ప్రజలను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

తన ప్రసంగాన్ని ముగిస్తూ, రానున్న రోజుల్లో ప్రజల భాగస్వామ్యానికి సమర్థమైన వేదికగా మారడం ద్వారా ఈ పండుగ వెదజల్లే రంగులు ఒడిశాతో పాటు దేశంలోని ప్రతి మూలకు చేరుకుంటాయని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
 

కేంద్ర రైల్వేలు, సమాచార, ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి శ్రీ అశ్వనీవైష్ణవ్, విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, ఒడియా సమాజ్ అధ్యక్షుడు శ్రీ సిద్ధార్థ ప్రధాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఉన్నారు.

నేపథ్యం

న్యూఢిల్లీలోని ఒడియా సమాజ్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రధాన కార్యక్రమమే ఒడిశా పర్వ. దీని ద్వారా ఒడియా సంస్కృతిని పరిరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు అమూల్యమైన ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది ఒడిశా పర్వ్‌ను నవంబర్ 22 నుంచి 24 వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైవిధ్యమైన ఒడిశా కళారూపాలతో పాటు, రాష్ట్రానికి సంబంధించిన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పద్ధతులను ప్రదర్శించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నిపుణులతో జాతీయ స్థాయి సదస్సును నిర్వహించారు.

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
In a first, micro insurance premium in life segment tops Rs 10k cr in FY24

Media Coverage

In a first, micro insurance premium in life segment tops Rs 10k cr in FY24
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"