Launches Acharya Chanakya Kaushalya Vikas Scheme and Punyashlok Ahilyabai Holkar Women Start-Up Scheme
Lays foundation stone of PM MITRA Park in Amravati
Releases certificates and loans to PM Vishwakarma beneficiaries
Unveils commemorative stamp marking one year of progress under PM Vishwakarma
“PM Vishwakarma has positively impacted countless artisans, preserving their skills and fostering economic growth”
“With Vishwakarma Yojna, we have resolved for prosperity and a better tomorrow through labour and skill development”
“Vishwakarma Yojana is a roadmap to utilize thousands of years old skills of India for a developed India”
“Basic spirit of Vishwakarma Yojna is ‘Samman Samarthya, Samridhi’”
“Today's India is working to take its textile industry to the top in the global market”
“Government is setting up 7 PM Mitra Parks across the country. Our vision is Farm to Fibre, Fiber to Fabric, Fabric to Fashion and Fashion to Foreign”

ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ మ‌హారాష్ట్ర‌లోని వార్ధాలో నిర్వ‌హించిన‌ జాతీయ పీఎం విశ్వ‌క‌ర్మ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించారు. ‘ఆచార్య చాణక్య స్కిల్ డెవలప్‌మెంట్’ పథకం, ‘పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ ఉమెన్ స్టార్టప్ స్కీమ్’లను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్ధిదారులకు ధ్రువపత్రాల‌ను, రుణాలను ఆయన విడుదల చేశారు. పీఎం విశ్వకర్మ కార్య‌క్ర‌మం కింద‌ ఒక సంవత్సరం పాటు సాధించిన పురోగతికి గుర్తుగా స్మారక స్టాంపును కూడా ప్ర‌ధాని విడుదల చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో ఏర్పాటు చేస్తున్న‌ పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్స్ అపెరల్ (పీఎం మిత్ర‌) పార్క్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్రధాని తిలకించారు.

స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాని ప్ర‌సంగించారు. రెండు రోజుల కిందట జ‌రిగిన‌ విశ్వ‌క‌ర్మ పూజా ఉత్స‌వాల‌ను గుర్తు చేసుకున్నారు. పీఎం విశ్వ‌కర్మ ప‌థ‌కం దిగ్విజ‌యంగా ఒక సంవ‌త్స‌రం పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా వార్ధాలో నేడు ఈ కార్య‌క్ర‌మాన్ని ఒక పండగ‌లా నిర్వహించుకుంటున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. 1932లో అంటరానితనానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ఇదే రోజున ఉద్యమాన్ని ప్రారంభించారని, అదే ఈనాటి ప్రత్యేకత అని ఆయన ప్ర‌ధానంగా వివ‌రించారు. పీఎం విశ్వకర్మకు నేటితో ఏడాది పూర్తవుతుందని, శ్రీ వినోద్‌ భావే సాధనస్థలి, మహాత్మాగాంధీ కర్మభూమి అయిన‌ వార్ధా భూమి నుంచి వేడుకలు జరుపుకోవడం విక‌సిత్ భారత్ సంకల్పానికి నూతన శక్తిని తీసుకురావడమేన‌ని అన్నారు. పీఎం విశ్వకర్మ యోజన ద్వారా నైపుణ్యాభివృద్ధి, ‘శ్రమతో సమృద్ధి’ ద్వారా మెరుగైన భవిష్యత్తును రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని ప్ర‌ధాని అన్నారు. త‌ద్వారా మహాత్మాగాంధీ ఆశయాలు వాస్తవరూపం దాల్చుతాయ‌ని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీఎం విశ్వకర్మ యోజనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రధాని అభినందించారు.

 

పీఎం మిత్రా పార్క్‌కు ఈ రోజు శంకుస్థాపన చేశామని ప్రధాన మంత్రి ప్ర‌త్యేకంగా పేర్కొన్నారు. వస్త్ర పరిశ్రమను ప్రపంచ మార్కెట్లలో అగ్ర‌గామిగా అయ్యేందుకు భార‌త్‌ కృషి చేస్తోందని ఆయన ప్ర‌త్యేకంగా త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. శతాబ్దాల నాటి కీర్తి, గుర్తింపును దేశ‌ వస్త్ర పరిశ్రమకు తిరిగి తీసుకురావ‌డ‌మే కేంద్ర‌ ప్ర‌భుత్వ‌ లక్ష్యం అని ప్ర‌ధాని అన్నారు. ఈ దిశగా అమరావతిలోని పీఎం మిత్ర పార్క్ మరో పెద్ద ముందడుగు అని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు. ఈ ఘనత సాధించిన అమరావతి ప్రజలకు అభినందనలు తెలిపారు.

 

పీఎం విశ్వకర్మ యోజన మొదటి సంవత్సర వార్షికోత్సవం కోసం మహారాష్ట్రలోని వార్ధాను ఎంపిక చేసినట్లు ప్రధాన మంత్రి ప్ర‌త్యేకంగా త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. ఇది కేవలం మరో ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది భారతదేశాన్ని ముందుకు నడిపించే పురాతన సాంప్రదాయ నైపుణ్యాలను రోడ్ మ్యాప్ గా ఉపయోగించుకునే పథకం అని ప్ర‌ధాని అన్నారు. త‌ద్వారా భార‌త్ ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దుతామ‌ని అన్నారు. భారతదేశ శ్రేయస్సుకు సంబంధించిన‌ అనేక అద్భుతమైన అధ్యాయాలకు దేశ ప్రాచీన సాంప్రదాయ నైపుణ్యాలు ఆధారమని ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా పేర్కొన్నారు. మన కళలు, ఇంజనీరింగ్, శాస్త్ర విజ్ఞానం, లోహశాస్త్రం.. మొత్తం ప్రపంచంలోనే సాటిలేనివని అన్నారు. మ‌న దేశం ఒక‌ప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్ర తయారీదారు" అని శ్రీ మోదీ ప్ర‌ధానంగా పేర్కొన్నారు. మ‌నం త‌యారు చేసిన కుండలకు, నాడు డిజైన్ చేసిన భవనాలకు సాటి వచ్చేవి లేవ‌ని త‌న ప్ర‌సంగంలో వివ‌రించారు.

 

వడ్రంగి, కమ్మరి, స్వర్ణకారుడు, కుమ్మరి, శిల్పి, చెప్పులు కుట్టేవాడు, తాపీ మేస్త్రీ ఇలా ఎందరో వృత్తి నిపుణులు భారతదేశ శ్రేయస్సుకు పునాదిగా నిలిచారని, ఈ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ప్రతి ఇంటికి వ్యాప్తి చేశారని శ్రీ మోదీ అన్నారు. ఈ స్వదేశీ నైపుణ్యాలను తుడిచిపెట్టేందుకు బ్రిటీషర్లు అనేక కుట్రలు పన్నారని, ఈ వార్ధా భూమి నుంచే గాంధీజీ గ్రామీణ పరిశ్రమను ప్రోత్సహించారని అన్నారు. స్వాతంత్య్రానంతరం వచ్చిన ప్రభుత్వాలు ఈ నైపుణ్యానికి తగిన గౌరవం ఇవ్వకపోవడం దేశ దౌర్భాగ్యమని ప్ర‌ధాని అసహనం వ్యక్తం చేశారు. గ‌త ప్రభుత్వాలు కళలు, నైపుణ్యాలను గౌరవించ‌లేద‌ని త‌ద్వారా విశ్వకర్మ సమాజాన్ని నిరంతరం నిర్లక్ష్యం చేశార‌ని వ్యాఖ్యానించిన ప్ర‌ధాని, ఫలితంగా భారతదేశం పురోగతి, ఆధునికత సాధ‌న‌లో వెనుకబ‌డింద‌ని ప్ర‌త్యేకంగా పేర్కొన్నారు.

 

దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 70 సంవత్సరాల అయిన తర్వాత సాంప్రదాయ నైపుణ్యాలకు కొత్త శక్తిని తీసుకురావాలని ప్రస్తుత ప్రభుత్వం సంకల్పించిందని ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా పేర్కొన్నారు. పీఎం విశ్వకర్మ యోజన స్ఫూర్తికి ‘సమ్మాన్, సామర్థ్య, సమృద్ధి’ (“గౌరవం, సామర్థ్యం , శ్రేయస్సు) కారణమని పేర్కొన్నారు. సంప్రదాయ హస్తకళలను గౌరవించ‌డం, కళాకారుల సాధికారత సాధ‌న‌, విశ్వకర్మల శ్రేయస్సు మా లక్ష్యం అని ప్రధాన మంత్రి అన్నారు.

 

పీఎం విశ్వకర్మను విజయవంతం చేసేందుకు వివిధ శాఖలు పెద్ద ఎత్తున, అపూర్వమైన సహకారాన్ని అందించాయని ప్రధాని ప్ర‌శంసించారు. 700 కంటే ఎక్కువ జిల్లాలు, 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, 5000 పట్టణ స్థానిక యూనిట్లు ఈ పథకానికి ఊపందిస్తున్నాయ‌ని ఆయ‌న‌ తెలియజేసారు. గత సంవత్సరంలో, 18 విభిన్న సంప్రదాయ నైపుణ్యాలు కలిగిన 20 లక్షల మందికి పైగా ప్రజలను పీఎం విశ్వకర్మ యోజనకు అనుసంధానించడం జ‌రిగింద‌ని శ్రీ మోదీ తెలిపారు. ఆధునిక యంత్రాలు , డిజిటల్ సాధనాల ఏర్పాటుతో 8 లక్షల మంది కళాకారులు, వృత్తిప‌నివారికి నైపుణ్య శిక్షణ, అప్‌గ్రేడేషన్ అందించామ‌న్నారు. ఒక్క మహారాష్ట్రలోనే 60,000 మందికి పైగా నైపుణ్య శిక్షణ పొందారని వివ‌రించారు. ఆరు లక్షల మందికి పైగా విశ్వకర్మలకు ఉత్పాదకత, ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించడానికి ఆధునిక పరికరాలు అందించామని ప్ర‌ధాని అన్నారు. త‌మ‌ వ్యాపారాలను విస్తరించడానికిగాను వారికి రూ. 15,000 ఇ-వోచర్, గ్యారెంటీ లేకుండా రూ.3 లక్షల వరకు రుణాలు అందించామని అన్నారు. విశ్వకర్మలకు ఏడాదిలోపు రూ.1400 కోట్ల రుణాలు ఇవ్వడం పట్ల ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు.

 

సంప్రదాయ నైపుణ్యాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారి కృషిని ప్రస్తావిస్తూ, గత ప్రభుత్వాల హయాంలో వారు ఎదుర్కొన్న నిర్లక్ష్యంప‌ట్ల ప్రధాని విచారం వ్యక్తం చేశారు. వెన‌క‌బ‌డిన‌వారికి వ్య‌తిరేకంగా ప‌ని చేసే మనస్తత్వం క‌లిగిన‌ వ్యవస్థకు స్వస్తి పలికింది ప్రస్తుత ప్రభుత్వమేనని అన్నారు. గత ఏడాది గణాంకాలను అంద‌రి దృష్టికి తీసుకొచ్చిన ఆయ‌న‌, విశ్వకర్మ యోజన ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు అత్యధికంగా లబ్ధి పొందుతున్నాయన్నారు. విశ్వ‌కర్మ క‌మ్యూనిటీలోని ప్ర‌జ‌లు కేవ‌లం హ‌స్త‌ క‌ళాకారులుగా మిగిలిపోకుండా పారిశ్రామిక వేత్త‌లుగా, యజమానులుగా వ్యాపారాలు చేసుకోవాలని ఆకాంక్షించారు. విశ్వ‌క‌ర్మ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాలకు ఎంఎస్‌ఎమ్‌ఈ హోదాను క‌ల్పించ‌డాన్ని త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ , ఏక్తా మాల్ వంటి ప్రయత్నాల గురించి ఆయన మాట్లాడారు. వీటిద్వారా విశ్వకర్మలను పెద్ద కంపెనీల సరఫరా వ్య‌వ‌స్థ‌లో భాగం చేసేలా ఆయా సాంప్రదాయ ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్నార‌ని అన్నారు.

 

చేతివృత్తులవారు, కళాకారులు తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఒక వేదిక‌గా మారిన ఓఎన్ డీసీ, జిఇఎమ్ ల‌ను ప్రధాని మోదీ త‌న‌ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. ఆర్థిక పురోగతిలో వెనుకబడిన సామాజిక వర్గం ఇప్పుడు ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న‌దని ఆయన ప్ర‌త్యేకంగా చెప్పారు. స్కిల్ ఇండియా మిషన్ ఆ వ‌ర్గాన్ని మరింత బలోపేతం చేస్తోందని ఆయన అన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం కింద దేశంలో కోట్లాది మంది యువత నేటి అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందారని శ్రీ మోదీ తెలియజేశారు. స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాలతో భారతదేశ నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుం పొందుతున్నాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్పారు.. ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచ నైపుణ్యాలపై నిర్వహించిన భారీ కార్యక్రమంలో భారతదేశం ప‌లు అవార్డులను గెలుచుకున్నదని గర్వంగా తెలియజేశారు.

 

“మహారాష్ట్రలో టెక్స్‌టైల్ పరిశ్రమ అపారమైన పారిశ్రామిక అవకాశాలను కలిగి ఉంది” అని ప్రధాన మంత్రి దృఢ‌మైన స్వ‌రంతో పేర్కొన్నారు. నాణ్యమైన పత్తి ఉత్పత్తికి విదర్భ ప్రాంతం భారీ కేంద్రంగా ఉందని, అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రైతుల పేరుతో చిల్లర రాజకీయాలు, అవినీతి చేసిన‌ కారణంగా పత్తి రైతులు కష్టాల‌పాల‌య్యార‌ని ఆయన ఎత్తి చూపారు. 2014లో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సమస్య పరిష్కారానికి వేగంగా అడుగులు ప‌డ్డాయ‌ని అన్నారు. ఏ కంపెనీ కూడా పెట్టుబ‌డులు పెట్ట‌డానికి సిద్ధంగా లేని ప‌రిస్థితుల్లో అమరావతిలోని నంద్‌గావ్ ఖండేశ్వర్‌లో టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేశామ‌ని, అది నేడు విజయవంతంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. మహారాష్ట్రలోనే అతి పెద్ద పారిశ్రామిక కేంద్రంగా అవ‌త‌రిస్తోంద‌ని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు.

 

పీఎం మిత్రా పార్క్ ఏర్పాటుకు సంబంధించి జరుగుతున్న పనుల వేగాన్ని ప్ర‌ధాని త‌న ప్ర‌సంగంలో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఇది డబుల్ ఇంజన్ ప్రభుత్వ సంకల్ప శక్తిని చాటింద‌ని వ్యాఖ్యానించారు. "భారతదేశం అంతటా ఏడు పీఎం మిత్రా పార్కులను స్థాపిస్తున్నాం" అని శ్రీ మోదీ గ‌ట్టిగా పేర్కొన్నారు. ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్ అనే విధానం త‌మ ల‌క్ష్యంలో భాగ‌మ‌ని ప్ర‌ధాని అన్నారు. విదర్భ కాటన్‌తో నాణ్యమైన వస్త్రాన్ని త‌యారు చేస్తామ‌ని, ఫ్యాషన్‌కు అనుగుణంగా ఆ వస్ర్తంతో తయారు చేసిన దుస్తులను విదేశాలకు ఎగుమతి చేస్తామని అన్నారు. దీనివల్ల రైతులకు కలిగే నష్టాలను అరికట్టడంతోపాటు విలువ జోడింపు ఉండడంతో పంటలకు మంచి ధరలు లభిస్తాయని వివరించారు. ఒక్క పీఎం మిత్రా పార్క్‌ నుంచే 8-10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. విదర్భ, మహారాష్ట్రల్లోని యువతకు లక్షకు పైగా కొత్త ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు ఇతర పరిశ్రమలకు ఊతమిచ్చే అవకాశం ఉందని అన్నారు. అలాగే. కొత్త సరఫరా వ్య‌వ‌స్థల‌ సృష్టి జ‌రుగుతుంద‌ని ఇవి దేశ ఎగుమతులను పెంచి త‌ద్వారా ఆదాయాన్ని పెంచడానికి దోహదపడతాయ‌ని ఆయన అన్నారు. ఈ పారిశ్రామిక ప్రగతికి అవసరమైన ఆధునిక మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ కోసం మహారాష్ట్ర సిద్ధమవుతోందని కూడా వివ‌రించారు. ఇందులో కొత్త హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, సమృద్ధి మహామార్గ్‌తో పాటు జ‌ల, వాయు మార్గాల‌ కనెక్టివిటీ విస్తరణ కూడా ఉంద‌ని ఆయన తెలిపారు. "మహారాష్ట్ర కొత్త పారిశ్రామిక విప్లవానికి సిద్ధమైంది" అని శ్రీ మోదీ స్ప‌ష్టం చేశారు.

 

రాష్ట్రం ప‌లు కోణాల్లో సాధించే పురోగతిలో మహారాష్ట్ర రైతుల పాత్రను గుర్తిస్తూ, దేశ శ్రేయస్సు రైతుల ఆనందంతో ముడిపడి ఉందని ప్ర‌ధాని ప్ర‌త్యేంగా పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సును పెంపొందించడానికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద తీసుకున్న ముఖ్యమైన చర్యలను ప్ర‌ధానంగా వివ‌రించారు. దీని కింద‌ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ. 6,000 అందజేస్తుందని, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని జోడిస్తున్న‌దని తద్వారా రైతులకు ప్ర‌తి ఏడాది రూ.12 వేల ఆర్ధిక సాయం అందుతుంద‌ని అన్నారు.

 

పంటల బీమాను కేవలం రూ.1కే అందించడంతోపాటు రైతులకు విద్యుత్ బిల్లులను మాఫీ చేసే కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేశామ‌ని ప్ర‌ధాని అన్నారు. ఈ ప్రాంతంలోని నీటిపారుదల సవాళ్లపై దృష్టి సారించిన ప్రధాని శ్రీ న‌రేంద్ర మోదీ, రాష్ట్రంలోని ప్రస్తుత ప్రభుత్వం గ‌త టెర్మ్‌లో చేసిన ప్రయత్నాలు అధికారుల‌ వల్ల ఆలస్యం అయ్యాయని అన్నారు.. ఈరోజు, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంప్రాజెక్టులను పునరుద్ధరించి వేగవంతం చేసిందని తెలియజేశారు. నాగ్‌పూర్, వార్ధా, అమరావతి, యవత్మాల్, అకోలా, బుల్దానా జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూ.85,000 కోట్ల విలువైన వాన్-గంగా, నల్-గంగా నదుల అనుసంధాన ప్రాజెక్టును ఇటీవల ఆమోదించిన విషయాన్ని ఆయన త‌న ప్ర‌సంగంలో ప్రస్తావించారు.

 

“మహారాష్ట్రలో రైతుల డిమాండ్లను పరిష్కరించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని ప్ర‌ధాని అన్నారు. ఈ ప్రాంతంలోని ఉల్లి రైతులకు తక్షణ ఉపశమనం కలిగించే లక్ష్యంతో ఉల్లిపాయలపై ఎగుమతి పన్నును 40% నుండి 20%కి తగ్గించామ‌న్నారు.. దిగుమతి చేసుకున్న వంట నూనెల‌ ప్రభావం నుండి దేశీయ రైతులను రక్షించడానికి తీసుకున్న చర్యల గురించి కూడా శ్రీ మోదీ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. “మేము వంట‌ నూనెల దిగుమతిపై 20% పన్ను విధించాం. శుద్ధి చేసిన సోయాబీన్, పొద్దుతిరుగుడు పామాయిల్‌పై కస్టమ్స్ సుంకాన్ని 12.5% నుండి 32.5% కు పెంచాం” అని అన్నారు. ఈ చర్య మహారాష్ట్ర అంతటా ముఖ్యంగా సోయాబీన్ రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని స్ప‌ష్టం చేశారు. ఈ ప్రయత్నాలు త్వరలో వ్యవసాయ రంగానికి సానుకూల ఫలితాలను ఇస్తాయని ప్ర‌ధాని ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పుడు వాగ్దానాలను న‌మ్మ‌వ‌ద్ద‌ని హెచ్చరిస్తూ నేటికీ రుణమాఫీ కోసం తెలంగాణ రైతులు పోరాడుతున్నార‌ని త‌న ప్ర‌సంగంలో ప్రస్తావించారు. మహారాష్ట్ర రైతులు అప్రమత్తంగా ఉండాలని, మోసపూరిత వాగ్దానాలను న‌మ్మి ప‌క్క‌దోవ ప‌ట్ట‌వ‌ద్ద‌ని ఆయన కోరారు.

 

సమాజంలో విభజనను సృష్టించడానికి ప‌ని చేస్తున్న‌ శక్తులపై ప్ర‌జ‌ల‌ను హెచ్చరించారు. విదేశీ గ‌డ్డ‌పై మాట్లాడుతూ భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిని అవమానించే వారిప‌ట్ల జాగ్ర‌త‌గా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరించారు. స్వాతంత్య్ర‌ పోరాట స‌మ‌యంలో లోకమాన్య తిలక్ నాయకత్వంలో అన్ని త‌ర‌గ‌తుల ప్ర‌జ‌లు కలిసి గణేష్ ఉత్సవాల‌ను వేడుక‌గా జ‌రిపేవార‌ని గుర్తు చేశారు. గ‌ణేష్ ఉత్స‌వాలు భారతదేశంలో ఐక్యత ఉత్సవాలుగా మారాయ‌ని ఆయ‌న అన్నారు. సంప్రదాయం- పురోగతి, గౌరవం - అభివృద్ధి ఎజెండాతో ప్ర‌జ‌లు నిలబడాలని ఆయన కోరారు. “ మ‌నంద‌రం క‌లిసిక‌ట్టుగా ప‌ని చేసి మహారాష్ట్ర గుర్తింపును కాపాడుదాం, గ‌ర్వించ‌ద‌గ్గ రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం.. మహారాష్ట్ర కలలను నెరవేరుద్దాం” అని శ్రీ మోదీ ముగించారు.

 

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి పి రాధాకృష్ణన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే, కేంద్ర మద్య‌, చిన్న త‌ర‌హా, సూక్ష్మ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ జితన్ రామ్ మాంఝీ, కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌధ‌రి, మహారాష్ట్ర ఉప‌ ముఖ్య‌మంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, శ్రీ అజిత్ పవార్ తదితరులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

 

 

నేప‌థ్యం

ఈ కార్య‌క్ర‌మంలో పీఎం విశ్వ‌క‌ర్మ ల‌బ్దిదారుల‌కు ధ్రువపత్రాలు, రుణాలను ప్ర‌ధాని విడుదల చేశారు. ఈ పథకం కింద చేతి వృత్తిదారులకు అందిస్తున్న‌ స్పష్టమైన మద్దతుకు ప్రతీకగా, 18 విభాగాలకు చెందిన‌ 18 మంది లబ్ధిదారులకు పీఎం విశ్వకర్మప‌థ‌కం రుణాల‌ను కూడా పంపిణీ చేశారు. విశ్వ‌క‌ర్మ‌ల వారసత్వం, వారు సమాజానికి చేసిన‌ శాశ్వతమైన కృషికి నివాళిగా,పిఎం విశ్వకర్మ కింద జ‌రిగిన ఒక ఏడాది పురోగతిని గుర్తు చేసుకుంటూ రూపొందించిన‌ స్మారక స్టాంపును ప్ర‌ధాని విడుద‌ల చేశారు.

 

మహారాష్ట్ర, అమరావతిలో పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్స్ , అపెరల్ (పీఎం మిత్ర‌) పార్క్‌కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కును మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ) అభివృద్ధి చేస్తోంది. టెక్స్‌టైల్ పరిశ్రమ కోసం ఏడు పీఎం మిత్రా పార్కుల ఏర్పాటుకు కేంద్ర‌ ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. టెక్స్‌టైల్ తయారీ, ఎగుమతుల కోసం భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చాలనే దృక్పథాన్ని సాకారం చేయడంలో పీఎం మిత్రా పార్కులు ఒక కీల‌క‌మైన‌ ముందడుగు. ఇవి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డిఐలు)తో సహా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తాయి. నూత‌న‌ ఆవిష్కరణల్ని, ఉద్యోగ కల్పనను ప్రోత్సహించడానికిగాను ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌలిక సదుపాయాలను రూపొందించ‌డానికి దోహ‌దం చేస్తాయి.

 

మహారాష్ట్ర ప్రభుత్వ ‘ఆచార్య చాణక్య స్కిల్ డెవలప్‌మెంట్’ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. 15 నుండి 45 సంవత్సరాల వయస్సు గల యువతకు శిక్షణ ఇవ్వ‌డానికి, వారు స్వావలంబన సాధించ‌డానికి, వివిధ ఉపాధి అవకాశాలను పొందేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కళాశాలల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,50,000 మంది యువకులు ప్రతి ఏడాది ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతారు.

 

‘పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ ఉమెన్ స్టార్టప్ స్కీమ్’ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ పథకం కింద, మహారాష్ట్రలో మహిళల నేతృత్వంలోని అంకుర సంస్థ‌ల‌కు ప్రారంభ దశలో ఇవ్వాల్సిన‌ మద్దతును ఇస్తారు. రూ 25 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకం కింద కేంద్ర‌ ప్రభుత్వం పేర్కొన్న విధంగా మొత్తం కేటాయింపులలో 25% వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీన వర్గాల మహిళలకు కేటాయిస్తారు. . మహిళల నేతృత్వంలోని అంకుర సంస్థ‌లు స్వావలంబన సాధించ‌డానికి, స్వతంత్రంగా ప‌ని చేయ‌డానికి ఈ ప‌థ‌కం సహాయపడుతుంది.

 

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."