భగవాన్ బిర్సా ముండా పేరిట స్మారక నాణం, తపాలా బిళ్ళ విడుదల
బీహార్ లో రూ.6640 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
రాజు అయిన రాముడిని భగవంతుడిగా కొలిచిందీ, దేశ సంస్కృతి, స్వాతంత్ర్యాల పరిరక్షణ కోసం శతాబ్దాల పాటు ముందుండి పోరాడిందీ... గిరిజన సమాజాలేనన్న ప్రధాని
‘ప్రధాన మంత్రి జన్ మన్ యోజన’ ద్వారా దేశంలోని అత్యంత వెనుకబడిన తెగలకు ఆవాసాలు
ప్రాచీన భారతీయ వైద్యవిధాన ఆవిర్భావంలో ఆదివాసీల భాగస్వామ్యం ప్రముఖమైందన్న ప్రధానమంత్రి
గిరిజన సమాజాల విద్య, వైద్య, ఆదాయ అవసరాలకు పెద్దపీట
భగవాన్ బిర్సా ముండా 150 జయంతిని పురస్కరించుకుని దేశంలో ఆదివాసీ ప్రాబల్యం గల ప్రాంతాల్లో ‘గిరిజన గౌరవ ఉపవనాలు’

జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు(నవంబర్ 15న) భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. బీహార్‌లోని జముయిలో దాదాపు రూ. 6,640 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలూ ప్రారంభోత్సవాలూ చేశారు. వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగించారు.

దేశంలోని వివిధ జిల్లాల్లో ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్న రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులకూ, అంతర్జాలం ద్వారా కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు వచ్చిన అసంఖ్యాక గిరిజన సోదర సోదరీమణులకూ శ్రీ మోదీ ఆహ్వానం పలికారు. కార్తీక పౌర్ణమి, దేవ దీపావళి, గురునానక్ 550వ జయంతి వంటి పర్వదినాలను జరుపుకునే పరమ పవిత్రమైన రోజంటూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని ‘గిరిజన గౌరవ దినోత్సవం’గా జరుపుకుంటున్న చారిత్రాత్మక సందర్భం కూడా దీనికి తోడైందని ప్రజలకు, మరీ ముఖ్యంగా ఆదివాసీలకూ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన గౌరవ దినోత్సవ వేడుకలకు ముందస్తుగా జముయిలో 3 రోజుల పాటు స్వచ్ఛతా అభియాన్ నిర్వహించారని తెలుసుకున్న ప్రధాన మంత్రి... కార్యక్రమంలో పాలుపంచుకున్న పాలనా యంత్రాంగం, జముయీవాసులు, ప్రత్యేకించి మహిళలకు అభినందనలు తెలియజేశారు.

గత ఏడాది జనజాతీయ గౌరవ్ దివస్‌లో తాను ‘ధర్తీ ఆబా’ బిర్సా ముండా పుట్టిన ఊరు ఉలిహతులో ఉన్నానని గుర్తుచేసుకున్న శ్రీ మోదీ... అమరవీరుడు తిల్కా మాంఝీ ధైర్యసాహసాలకు ప్రత్యక్ష సాక్షి అయిన నేలపై ఈ సంవత్సరం ఉన్నానని, భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకల ప్రారంభోత్సవం ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకం చేస్తోందని అన్నారు. వేడుకలు ఏడాది పాటు కొనసాగుతాయని వెల్లడించిన ప్రధానమంత్రి... జముయిలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు బీహార్ లోని వివిధ గ్రామాల నుండి కోటి మంది పౌరులు అంతర్జాల వేదిక ద్వారా భాగస్వాములవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బిర్సా ముండా వారసుడు శ్రీ బుధారామ్ ముండా, సిద్ధూ కన్హు వారసుడు శ్రీ మండల్ ముర్ములకు శ్రీ మోదీ స్వాగతం పలికారు.

 

నవంబర్ 15న రూ. 6640 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయని వెల్లడించిన ప్రధానమంత్రి, గిరిజనుల కోసం పక్కా గృహాలు, వారి పిల్లల ఉజ్జ్వల భవిష్యత్తు కోసం పాఠశాలలు, హాస్టళ్లు, గిరిజన మహిళలకు ఆరోగ్య సదుపాయాలు, గిరిజన ప్రాంతాలను కలుపుతూ రోడ్డు ప్రాజెక్టులు, గిరిజన సంస్కృతిని పరిరక్షించేందుకు ప్రత్యేక మ్యూజియంలు, పరిశోధనా కేంద్రాలకు ఆమోదం తెలిపే 1.5 లక్షల లేఖలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ‘దేవ్ దీపావళి’ శుభ సందర్భంలో గిరిజనుల కోసం నిర్మించిన 11,000 ‘ఆవాస్‌’ ఇళ్ళ గృహప్రవేశాలని ప్రకటించిన శ్రీ మోదీ... గిరిజనులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

జనజాతీయ గౌరవ్ దివస్ గురించీ, ఏడాదిపాటు జరిగే వేడుకల గురించి తెలియజేస్తూ, గతంలో జరిగిన అతి పెద్ద చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దే దిశగా ఈ వేడుకలను ఏర్పాటు చేసినట్లు శ్రీ మోదీ అన్నారు. స్వాతంత్య్రానంతర కాలంలో గిరిజనులకు సమాజంలో సరైన గుర్తింపు లభించలేదన్నారు. సమాజ హితంలో ఆదివాసీలు అందించిన తోడ్పాటు గురించి మాట్లాడుతూ... రాజైన రాముడిని భగవంతుడిగా కొలిచిందీ, దేశ సంస్కృతి, స్వాతంత్ర్యాల పరిరక్షణ కోసం శతాబ్దాల పాటు ముందుండి పోరాడిందీ గిరిజన సమాజాలేననీ చెప్పారు. స్వాతంత్ర్యానంతర కాలంలో స్వార్థ రాజకీయాల వల్ల గిరిజన సమాజాల ఘన భాగస్వామ్య చరిత్రను తుడిచి వేసే ప్రయత్నాలు జరిగాయని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యోద్యమంలో ఉల్గులాన్ ఉద్యమం, కోల్ తిరుగుబాటు, సంథాల్ తిరుగుబాటు, భిల్ ఉద్యమం వంటి గిరిజన పోరాటాలను గుర్తుచేస్తూ... ఆదివాసీల భాగస్వామ్యం అసమానమైనదని శ్రీ మోదీ కొనియాడారు. అల్లూరి సీతారామరాజు, తిల్కా మాంఝీ, సిద్ధూ కన్హు, బుధు భగత్, తెలంగ్ ఖరియా, గోవింద గురు, తెలంగాణకు చెందిన రామ్‌జీ గోండ్, మధ్యప్రదేశ్‌కు చెందిన బాదల్ భోయ్, రాజా శంకర్ షా, కువర్ రఘునాథ్ షా, తాంత్యా భిల్, జాత్రా భగత్, లక్ష్మణ్ నాయక్, మిజోరానికి చెందిన రోపుయిలియాని, రాజ్ మోహినీ దేవి, రాణి గిడిన్లియూ, కాళీబాయి, గోండ్వానా రాణి - రాణి దుర్గావతి దేవి తదితర గొప్ప దేశభక్తులను ఎన్నటికీ మరచిపోలేమన్నారు. బ్రిటీషువారు వేలాది మంది గిరిజనులను హతమార్చిన మాన్‌గఢ్ మారణకాండ నేటికీ మనసులను కలిచివేస్తుందని శ్రీ మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

 

సాంస్కృతిక, సామాజిక, న్యాయరంగాల పట్ల తమ వైఖరి విభిన్నమైనదన్న ప్రధాని, శ్రీమతి ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవడం తమ ప్రభుత్వానికి దక్కిన గౌరవమని ఆనందం వ్యక్తం చేశారు. ‘పీఎం జన్ మన్ యోజన’ కింద ప్రారంభించిన అన్ని పనులూ దేశ తొలి ఆదివాసీ రాష్ట్రపతి అయిన శ్రీమతి ముర్ము చలవేనని ప్రధాని వెల్లడించారు. రూ. 24,000 కోట్ల ఖర్చుతో చేపట్టిన ప్రధానమంత్రి జన్ మన్ యోజన ప్రత్యేకించి ‘అతి బలహీన గిరిజన సమూహాల’ (పీవీటీజీ) సాధికారత కోసం ప్రారంభమైందని, ఈ పథకం కింద దేశంలోని అత్యంత వెనుకబడిన తెగలకు ఇళ్లను అందిస్తున్నామని శ్రీ మోదీ చెప్పారు. పథకాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిందని, ఇప్పటికే గిరిజనులకు వేలాది పక్కా గృహాలు సమకూర్చామని తెలిపారు. పీవీటీజీ నివాసాల మధ్య అనుసంధానాన్ని పెంచేందుకు రహదార్లను అభివృద్ధి పరుస్తున్నామని, ‘హర్ ఘర్ జల్’ పథకం కింద అనేక పీవీటీజీలకు తాగునీటి సౌకర్యం కల్పించామని ప్రధాన మంత్రి తెలిపారు.

అలక్ష్యానికి గురైన వారిని తాను ఆరాధిస్తానన్న శ్రీ మోదీ... గత ప్రభుత్వాల విధానాల వల్ల దశాబ్దాలుగా గిరిజన సమాజాలకు కనీస మౌలిక సదుపాయాలు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాబల్యం గల డజన్ల కొద్దీ జిల్లాల్లో అభివృద్ధి నత్తనడకన సాగుతున్నట్లు గుర్తించి, పాత ధోరణులకు స్వస్తి పలుకుతూ ఇటువంటి జిల్లాలను ‘అభివృద్ధి కోసం తపిస్తున్న జిల్లాలు’గా ప్రకటించి, వాటి సత్వర అభివృద్ధి కోసం సమర్థమైన అధికారులను నియమించామని శ్రీ మోదీ తెలియజేశారు. వివిధ అభివృద్ధి సూచీల ద్వారా గమనించినప్పుడు, అభివృద్ధి చెందిన అనేక జిల్లాల కంటే ఇటువంటి ఆకాంక్షాత్మక జిల్లాలు మెరుగైన పురోభివృద్ధి కనపరిచాయని, ఈ అభివృద్ధి గిరిజనులకు ఎంతో మేలు చేకూరుస్తోందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.

"మా ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యాన్ని ఇచ్చింది" అని ప్రధానమంత్రి అన్నారు. గిరిజన వ్యవహారాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఘనత అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ఆదివాసీ సంక్షేమం దిశగా గత 10 ఏళ్ళలో బడ్జెట్ కేటాయింపులను అయిదింతలు చేసి, రూ. 25,000 కోట్ల నుంచి రూ. 1.25 లక్షల కోట్లకు పెంచినట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు. ఇటీవల 60,000కు పైబడి గిరిజన గ్రామాలకు ప్రయోజనం చేకూర్చే ‘ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’ (డీఏజేజీయూఏ) అనే ప్రత్యేక పథకాన్ని ప్రారంభించినట్లు శ్రీ మోదీ తెలిపారు. రూ. 80,000 కోట్లు పెట్టుబడి గల ఈ పథకం ద్వారా గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన సహా గిరిజన యువకులకు శిక్షణనందించడం సాధ్యపడుతోందన్నారు. పథకంలో భాగంగా హోమ్‌స్టేల ఏర్పాటు గురించిన శిక్షణ, సహకారాల నిమిత్తం గిరిజన మార్కెటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గిరిపుత్రులు అధికంగా నివసించే ప్రాంతాల్లో సాధారణ పర్యాటకం బలోపేతం సహా ఎకో-టూరిజంకు నూతన అవకాశాలు లభించగలవని, ఈ చర్యలు గిరిజనుల వలసలను అరికట్టేందుకు దోహదపడగలవన్న ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.

 

గిరిజనుల వారసత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ, ఇటీవలి కాలంలో అనేక మంది గిరిజన కళాకారులకు పద్మ అవార్డులు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాంచీలో భగవాన్ బిర్సా ముండా పేరుతో గిరిజన మ్యూజియం ప్రారంభమైందనీ, పాఠశాల విద్యార్థులందరూ దీనిని తప్పక సందర్శించి, విశేషాలను అధ్యయనం చేయాలని కోరారు. మధ్యప్రదేశ్‌ ఛింద్వాడాలో బాదల్ భోయ్ పేరుతో, మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లో రాజా శంకర్ షా, కువర్ రఘునాథ్ షా పేర్లతో గిరిజన మ్యూజియంలు ప్రారంభం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. భగవాన్ బిర్సా ముండా జ్ఞాపకార్థం శ్రీనగర్, సిక్కింలో రెండు గిరిజన పరిశోధనా కేంద్రాల ప్రారంభంతోపాటూ, ఆయన సంస్మరణార్థం స్మారక నాణెం, పోస్టల్ స్టాంపుల ఆవిష్కరణ జరిగిందని శ్రీ మోదీ చెప్పారు. ఈ చర్యలన్నీ గిరిజనుల ధైర్యసాహసాలూ, వారి ఆత్మగౌరవాన్ని భారతదేశ ప్రజలకు నిరంతరం గుర్తుచేస్తాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

భారతదేశ ప్రాచీన వైద్య విధాన ఆవిర్భావంలో ఆదివాసీలు పెద్దయెత్తున భాగస్వామ్యాన్ని అందించారన్న ప్రధాని, భవిష్యత్ తరాలకు కోసం ఈ వారసత్వాన్ని పరిరక్షించడం సహా మరిన్ని కొత్త అంశాలను జోడిస్తున్నట్లు వెల్లడించారు. ‘లే’ ప్రాంతంలో ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోవా-రిగ్పా’ను ఏర్పాటు చేశామని, అరుణాచల్ ప్రదేశ్‌లోని ‘ఈశాన్య ఆయుర్వేద, జనజాతుల సంప్రదాయ వైద్య పరిశోధనా సంస్థ’ను ఆధునీకరించామని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ... డబ్ల్యూహెచ్‌ఓ ఆధ్వర్యంలో త్వరలో సంప్రదాయ వైద్యానికి అంతర్జాతీయ కేంద్రాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, ఇది ప్రపంచవ్యాప్తంగా గిరిజనుల సంప్రదాయ వైద్య విధానాల గురించి ప్రచారం చేసేందుకు దోహదపడుతుందని శ్రీ మోదీ చెప్పారు.

"గిరిజన సమాజాల విద్య, వైద్య, ఆదాయ అవసరాలపై మా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది" అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఆదివాసీల పిల్లలు వైద్య, ఇంజినీరింగ్, సాయుధ బలగాలు, విమానయానం వంటి అనేక రంగాల్లో తమ ఉనికిని చాటుతుండడం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. గత దశాబ్దంలో గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు మెరుగైన అవకాశాలను సృష్టించడం వల్లే ఇటువంటి ఫలితాన్ని పొందగలిగామని చెప్పారు. స్వాతంత్య్రానంతర ఆరు దశాబ్దాల కాలంలో ఒకే ఒక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటవగా, అందుకు భిన్నంగా తమ ప్రభుత్వ హయాంలో గత దశాబ్దంలోనే 2 కొత్త గిరిజన విశ్వవిద్యాలయాలను స్థాపించామని ప్రధాన మంత్రి చెప్పారు. గత దశాబ్దంలో గిరిజనులు అధికంగా నివసించే ప్రాంతాల్లో పారిశ్రామిక శిక్షణా సంస్థలతో (ఐటీఐ) పాటు అనేక డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు ప్రారంభమయ్యాయని తెలిపారు. గత దశాబ్దంలో బీహార్‌లోని జముయ్‌ సహా గిరిజన ప్రాంతాల్లో 30 కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించామని, కొద్ది చోట్ల స్థాపన పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 7000 ఏకలవ్య పాఠశాలల బలమైన నెట్‌వర్క్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు శ్రీ మోదీ తెలిపారు.

 

వైద్య, ఇంజినీరింగ్, సాంకేతిక విద్యను చేపట్టే గిరిజన విద్యార్థులకు భాష అవరోధంగా నిలుస్తున్నట్లు గమనించి, పరిష్కారంగా వారు మాతృభాషలోనే పరీక్షలు రాసే వెసులుబాటును కల్పించామని తెలిపారు. ఇటువంటి నిర్ణయాలు గిరిజన విద్యార్థులకు కొత్త ఆశలను కల్పించాయన్నారు.

గత దశాబ్దంలో గిరిజన యువత అంతర్జాతీయ క్రీడా పోటీల్లో సాధించిన పతకాలూ విజయాలను ప్రస్తావించిన శ్రీ మోదీ, గిరిజన ప్రాంతాల్లో క్రీడా సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఖేలో ఇండియా అభియాన్‌లో భాగంగా గిరిజన ప్రాంతాల్లో ఆధునిక క్రీడా మైదానాలు, క్రీడా సముదాయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దేశపు తొలి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం మణిపూర్‌లో ప్రారంభమైందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

వెదురుకు సంబంధించిన చట్టాలు కఠినతరంగా ఉంటూ స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా గిరిజన సమూహాలను తీవ్ర ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. వెదురు సాగుకు సంబంధించిన చట్టాలను తమ ప్రభుత్వం సరళీకరించిందని తెలిపారు. గతంలో 8-10 అటవీ ఉత్పత్తులకు మాత్రమే కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) లభించేదని, ఇప్పుడు దాదాపు 90 అటవీ ఉత్పత్తులను ఎమ్మెస్పీ పరిధిలోకి తెచ్చామని శ్రీ మోదీ అన్నారు. దేశంలోని సుమారు 4,000 ‘వన్ ధన్’ కేంద్రాల ద్వారా దాదాపు 12 లక్షల మంది గిరిజన రైతులకు సహాయం అందుతోందని ప్రధానమంత్రి తెలిపారు.

 

మహిళల సంక్షేమం కోసం చేపట్టిన ప్రత్యేక పథకం గురించి మాట్లాడుతూ,"పథకం ప్రారంభించినప్పటి నుండి దాదాపు 20 లక్షల మంది గిరిజన మహిళలు ‘లఖ్పతి దీదీలు’ (లక్షాధికారి సోదరీమణులు) గా మారారు" అన్నారు. గిరిజన ఉత్పత్తులైన బుట్టలు, బొమ్మలు, ఇతర హస్తకళల అమ్మకం కోసం ప్రధాన నగరాల్లో ట్రైబల్ హాట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన హస్తకళా ఉత్పత్తుల వ్యాపారం కోసం ‘గ్లోబల్ మార్కెట్‌ప్లేస్‌’ పేరిట ప్రత్యేక అంతర్జాల వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ మోదీ చెప్పారు. తాను వివిధ దేశనాయకులు, ఇతర ప్రముఖులను కలిసినప్పుడు సోహ్రాయ్, వార్లీ , గోండ్ చిత్రాలను, ఇతర గిరిజన ఉత్పత్తులు, కళాఖండాలను బహూకరిస్తానని శ్రీ మోదీ తెలియజేశారు.

 

మహిళల సంక్షేమం కోసం చేపట్టిన ప్రత్యేక పథకం గురించి మాట్లాడుతూ,"పథకం ప్రారంభించినప్పటి నుండి దాదాపు 20 లక్షల మంది గిరిజన మహిళలు ‘లఖ్పతి దీదీలు’ (లక్షాధికారి సోదరీమణులు) గా మారారు" అన్నారు. గిరిజన ఉత్పత్తులైన బుట్టలు, బొమ్మలు, ఇతర హస్తకళల అమ్మకం కోసం ప్రధాన నగరాల్లో ట్రైబల్ హాట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన హస్తకళా ఉత్పత్తుల వ్యాపారం కోసం ‘గ్లోబల్ మార్కెట్‌ప్లేస్‌’ పేరిట ప్రత్యేక అంతర్జాల వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ మోదీ చెప్పారు. తాను వివిధ దేశనాయకులు, ఇతర ప్రముఖులను కలిసినప్పుడు సోహ్రాయ్, వార్లీ , గోండ్ చిత్రాలను, ఇతర గిరిజన ఉత్పత్తులు, కళాఖండాలను బహూకరిస్తానని శ్రీ మోదీ తెలియజేశారు.

 

గిరిజనుల్లో ‘సికిల్ సెల్ అనీమియా’ అనే వ్యాధి పెను సవాలుగా మారిందని ఆందోళన వెలిబుచ్చిన ప్రధాని... సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం జాతీయ సికిల్ సెల్ అనీమియా మిషన్‌ను ప్రారంభించిందని చెప్పారు. మిషన్ ప్రారంభించిన సంవత్సరకాలంలో, 4.5 కోట్ల మంది గిరిజనులు వైద్య పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. ఆరోగ్య పరీక్షల కోసం మైళ్ళ దూరాలు ప్రయాణించే అవసరం లేకుండా గిరిజనుల ఆవాసాలకు దగ్గరగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేశామని ప్రధాని చెప్పారు

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi