ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన లబ్ధిదారుల తో పాటు, జన ఔషధి కేంద్రాల స్టోరు యజమానుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు సంభాషించారు.

కరోనా వైరస్ ముప్పును పరిష్కరించడానికి అవసరమైన చర్యలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయని ప్రధాన మంత్రి చెప్పారు. భారతదేశం లో నిపుణులైన వైద్యులు, ఉన్నతమైన వనరుల తో పాటు ప్రజల్లో కూడా పూర్తి అవగాహన ఉందని ఆయన అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టడం లో, అప్రమత్తమైన పౌరుల పాత్ర చాలా ముఖ్యమైనదని ఆయన చెప్పారు.

|

తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యత ను అతిగా అంచనా వేయలేమని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ వైరస్ ఇతరుల కు వ్యాప్తి కాకుండా అరికట్టేందుకు ప్రతి ఒక్కరు, తుమ్మేటప్పుడు లేదా దగ్గేటప్పుడు తమ నోటికి, ముక్కుకు అడ్డం గా చేతి రుమాలు పెట్టుకోవాలని కూడా ఆయన తెలిపారు.

‘‘కరోనా వైరస్ సోకిన కేసులు గా ధ్రువీకరించబడిన కేసులన్నింటినీ అవసరమైన పర్యవేక్షణ లో ఉంచడం జరిగింది. ఎవరైనా ఒక వ్యక్తి తాను కరోనా వైరస్ సోకిన వ్యక్తి తో కలిసినట్లు అనుమానం వస్తే, అప్పుడు అతను భయపడవలసిన అవసరం లేదు. అయితే, పరీక్ష కోసం సమీపం లోని ఆసుపత్రి కి వెళ్ళాలి. కుటుంబం లోని మిగిలిన కుటుంబ సభ్యుల కు కూడా వైరస్ సోకే అవకాశం ఎక్కువ గా ఉంది, అటువంటి సమయం లో వారు కూడా అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి’’ అని ప్రధాన మంత్రి సూచించారు.

|

కరోనా వైరస్ మహమ్మారి గురించి ఏ రకమైన పుకార్ల ను వ్యాప్తి చేయవద్దనీ, కేవలం వైద్యుల సలహాలు తీసుకుని, పాటించాలనీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

‘‘అవును, ఇప్పుడు ప్రపంచం మొత్తం ‘నమస్తే’ ని అలవాటుగా చేసుకుంటోంది. ఒక వేళ, ఏదైనా కారణం చేత మనం ఈ అలవాటును మానివేసినా, ఇప్పుడు మళ్ళీ చేతులు జోడించి నమస్కారం చేసే అలవాటును తిరిగి ప్రారంభించాలని’’ కూడా ఆయన చెప్పారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read PM's speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
How PMJDY has changed banking in India

Media Coverage

How PMJDY has changed banking in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 మార్చి 2025
March 25, 2025

Citizens Appreciate PM Modi's Vision : Economy, Tech, and Tradition Thrive