మొత్తం భారతదేశానికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు: కోక్రాజార్‌లో బోడో శాంతి ఒప్పందం కార్యక్రమంలో ప్రధాని మోదీ
బోడో శాంతి ఒప్పందం దశాబ్దాల పాత సంక్షోభాన్ని పరిష్కరించడానికి హృదయపూర్వక ప్రయత్నంతో అన్ని వాటాదారులను తీసుకురావడం ద్వారా జరిగింది: ప్రధాని మోదీ
మేము అధికారంలోకి వచ్చిన తరువాత, త్రిపుర, మిజోరం, మేఘాలయ, మరియు అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా ప్రాంతాలు AFSPA నుండి బయటకు వచ్చాయి: ప్రధాని

హింసా మార్గాన్ని అనుస‌రిస్తున్న వారు బోడో కార్య‌క‌ర్త‌ల మాదిరిగానే ఆయుధాల‌ ను విడ‌చిపెట్టి ప్ర‌ధాన స్ర‌వంతి లోకి తిరిగి రావాలంటూ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న పిలుపునిచ్చారు.   

బోడో ఒప్పందం పై సంత‌కాలైనందుకు అస‌మ్ లోని కోక్ రాఝార్ లో నేడు ఏర్పాటైన ఉత్స‌త‌వాల లో ప్ర‌ధాన మంత్రి పాలుపంచుకొన్నారు. 

చ‌రిత్రాత్మ‌క‌మైనటువంటి ఆ ఒప్పందం పై 2020వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 27వ తేదీ న సంత‌కాలైన త‌రువాత ఈశాన్య ప్రాంతాని కి ఆయ‌న రావ‌డం ఇదే మొదటి సారి.  

“ఆయుధాల మీద మ‌రియు హింస పైన న‌మ్మ‌కాన్ని పెట్టుకొన్న‌ వారి ని.. అది ఈశాన్య ప్రాంతం కావ‌చ్చు, లేదా న‌క్స‌ల్ ప్రాంతాలు కావ‌చ్చు, లేదా జ‌మ్ము, క‌శ్మీర్ కావ‌చ్చు.. వారు బోడో యువ‌త నుండి ప్రేర‌ణ ను పొంది (పాఠం) నేర్చుకొని ప్ర‌ధాన స్ర‌వంతి లోకి తిరిగి రావలసిందిగా నేను అభ్య‌ర్ధిస్తున్నాను.  వెనుకకు వచ్చేయండి, జీవితాన్ని ఆనందమయం గా ఆస్వాదించడం మొద‌లు పెట్టండి” అని ఆయ‌న అన్నారు. 

ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగం లో బోడో నేత‌ లు  ఉపేంద్రనాథ్ బ్ర‌హ్మ గారు, రూప్‌ నాథ్ బ్ర‌హ్మ గారు లు అందిందించిన తోడ్పాటు ను గుర్తు కు తెచ్చారు.

బోడో ఒడంబ‌డిక – ‘స‌బ్‌కా సాథ్‌స‌బ్‌కా వికాస్‌స‌బ్‌కా విశ్వాస్’ ల ప్ర‌తిబింబం

బోడో ఒప్పందం లో ఒక అత్యంత స‌కారాత్మ‌క‌మైన‌టువంటి భూమిక ను పోషించిన ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియ‌న్ (ఎబిఎస్ యు) ను, నేశ‌న‌ల్ డెమోక్ర‌టిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్ డిఎఫ్ బి)ని, బిటిసి అధినేత‌ శ్రీ హ‌గ్ రామా మాహీలారే ను మ‌రియు అస‌మ్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు.  

‘‘ఈ రోజు న 21వ శ‌తాబ్దం లో ఒక నూత‌న ఆరంభాని కి, ఒక న‌వోద‌యాని కి, ఒక స‌రిక్రొత్త స్ఫూర్తి కి అస‌మ్ తో పాటు యావ‌త్తు ఈశాన్య ప్రాంతం స్వాగతం పలకవ‌ల‌సిన రోజు.  అభివృద్ధి మ‌రియు విశ్వాసం మ‌న ప్ర‌ధాన‌మైన ఆలంబ‌న గా కొన‌సాగాలి. మ‌రి వాటిని ఇతోధికం గా బ‌ల‌ప‌ర‌చాలి అని ఒక ప్ర‌తిజ్ఞ ను చేయవ‌ల‌సిన‌టువంటి రోజు ఇది.  మ‌నం మ‌ళ్ళీ హింస తాలూకు అంధ‌కారం ద్వారా ఎన్న‌టి కీ ఆవ‌రించ‌బ‌డ‌కూడ‌దు.  మ‌నం ఒక ప్ర‌శాంత అస‌మ్ కు, ఒక న‌వ సంక‌ల్ప భార‌త‌దేశాని కి ఆహ్వానం ప‌లుకుదాం’’ అని ఆయ‌న అన్నారు.

భార‌త‌దేశం ఈ సంవ‌త్స‌రం లో గాంధీ మ‌హాత్ముని 150వ జ‌యంతి ని జ‌రుపుకోబోతున్నందువ‌ల్ల ఇదే సంవ‌త్స‌రం లో బోడో ఒప్పందం పై సంతకాలు కావ‌డం మ‌రింత ప్రాముఖ్యాన్ని సంత‌రించుకొంది అని ఆయ‌న అన్నారు.

“అహింస తాలూకు ఫ‌లాలు ఏవైన‌ప్ప‌టికీ, వాటిని అంద‌రూ స్వీక‌రిస్తారు’’ అని గాంధీ గారు అనే వారు అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. 

బోడో ఒడంబ‌డిక ను గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఇది ఈ ప్రాంతం లో యావ‌త్తు ప్ర‌జల‌ కు మేలు ను చేకూర్చుతుంద‌న్నారు.  బోడో టెరిటోరియ‌ల్ కౌన్సిల్ (బిటిసి) యొక్క అధికారాల ను పెంపు చేసి, మ‌రి ఈ ఒడంబ‌డిక లో భాగం గా ప‌టిష్ట‌ ప‌ర‌చ‌డం జ‌రిగింది అని ఆయ‌న వివ‌రించారు.

 ‘‘ఈ ఒప్పందం లో ప్ర‌తి ఒక్క‌రూ ఒక విజేతే, శాంతి ఒక విజేత అయితే, మాన‌వ‌త్వం ఇంకొక విజేత‌ గా ఉంది’’ అని ఆయ‌న పేర్కొన్నారు.

బోడో టెరిటోరియ‌ల్ ఏరియా డిస్ట్రిక్ట్స్ (బిటిఎడి)ల స‌రిహ‌ద్దుల‌ ను ఖ‌రారు చేసేందుకు ఒక క‌మిశ‌న్ ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంది అన్నారు.

బిటిఎడి లోని ఉదాల్‌గుడీ, బ‌క్సా, చిరాంగ్‌ మ‌రియు కోక్ రాఝార్ ల‌కు ల‌బ్ధి క‌లిగేట‌ట్లు 1500 కోట్ల రూపాయ‌ల విలువైన ఒక ప్యాకేజీ ని ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌క‌టించారు.

 ‘‘ఇది బోడో సంస్కృతి, ప్రాంతం మ‌రియు విద్య ల స‌ర్వ‌తోముఖ వికాసాని కి తోడ్ప‌డుతుంది’’ అని ఆయ‌న తెలిపారు. 

బిటిసి బాధ్య‌త మ‌రియు అస‌మ్ ప్ర‌భుత్వ బాధ్య‌త‌ పెరిగిందని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేస్తూ, అభివృద్ధి యొక్క ధ్యేయం కేవ‌లం ‘స‌బ్‌కా సాథ్‌, స‌బ్‌కా వికాస్‌, స‌బ్‌కా విశ్వాస్’ ద్వారా మాత్ర‌మే సాధ్య‌మ‌న్నారు.

 ‘‘ప్ర‌స్తుతం బోడో ప్రాంతం లో క్రొత్త ఆశ‌ లు, క్రొత్త క‌ల‌ లు, క్రొత్త స్ఫూర్తు లు ప్ర‌సరిస్తున్నాయి.  మీ అంద‌రి బాధ్య‌త హెచ్చింది.  బోడో టెరిటోరియ‌ల్ కౌన్సిల్ ఇక ఇక్క‌డ ప్ర‌తి ఒక్క స‌మాజం యొక్క అభివృద్ధి కి ఒక నూత‌న న‌మూనా ను అభివృద్ధి ప‌రుస్తుంద‌న్న న‌మ్మ‌కం నాలో ఉంది.  ఇది అస‌మ్ ను బ‌లోపేతం చేస్తుంది.  అలాగే, భార‌త‌దేశం స్ఫూర్తి ని బ‌లోపేతం చేస్తుంది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

అస‌మ్ ఒడంబ‌డిక లో ఆరో క్లాజు ను అమ‌లు ప‌ర‌చాల‌ని త‌న‌ ప్ర‌భుత్వం అభిల‌షిస్తోంద‌ని, మ‌రి దీని కోసం కమిటీ నివేదిక కోసం వేచి ఉందని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

ఈశాన్య ప్రాంతం ఆకాంక్ష‌ల ను నెర‌వేర్చ‌డానికి నూత‌న వైఖ‌రి

ప్ర‌భుత్వం ఈశాన్య ప్రాంతాన్ని ప‌ట్టి పీడిస్తున్న వివిధ స‌మ‌స్య‌ల ను ప‌రిష్క‌రించ‌డం కోసం ఒక కొత్త వైఖ‌రి ని అనుసరించిందని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

ఈ ప్రాంతం యొక్క ఆకాంక్ష‌ల ను భావోద్వేగ భ‌రిత అంశాల ను లోతు గా అర్థం చేసుకోవడం జ‌రిగాక‌నే ఆ త‌ర‌హా వైఖ‌రి సాధ్య‌ప‌డింద‌ని ఆయ‌న వివ‌రించారు.

 ‘‘సంబంధితులంద‌రి తోను చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం, మ‌రి స‌హానుభూతి ని క‌లిగి ఉండ‌టం వ‌ల్ల‌నే ప‌రిష్కారాలు ల‌భించాయి.  మేము ప్ర‌తి ఒక్క‌రి ని మావాళ్లే త‌ప్ప బ‌య‌టివాళ్ళు కాదు అని భావించినందువ‌ల్ల ఆ ప‌రిష్కారాలు దొరికాయి.  మేము వారితో సంభాషించి, వారిని మాలో ఒక‌రుగా భావించేట‌ట్టు చేశాము.  ఇది ఉగ్ర‌వాదాన్ని త‌గ్గించ‌డానికి స‌హాయకారి అయింది.  ఇంత‌కుముందు, ఉగ్ర‌వాదం కార‌ణం గా ఈశ్యాన ప్రాంతం లో సుమారు గా 1000 హ‌త్య‌లు జ‌రిగాయి.  కానీ, ఇవాళ మొత్తం మీద ప‌రిస్థితి ప్ర‌శాంతం గాను, సాధార‌ణ స్థితి కి చేరుకొన్న‌ది గాను ఉంది’’ అని ఆయ‌న అన్నారు.

ఈశాన్య ప్రాంతం దేశానికి వృద్ధి ప్ర‌ధాన‌మైన చోద‌క శ‌క్తి గా ఉంది

‘‘గ‌డ‌చిన మూడు, నాలుగు సంవ‌త్స‌రాల కాలం లో ఈశాన్య ప్రాంతం లో మూడు వేల కిలో మీట‌ర్ల‌ కు పైగా ర‌హ‌దారులు నిర్మించ‌డం జ‌రిగింది.  క్రొత్త‌ గా జాతీయ ర‌హ‌దారుల‌ కు ఆమోదం తెల‌ప‌డ‌మైంది.  యావ‌త్తు ఈశాన్య ప్రాంత రైలు మార్గ నెట్ వ‌ర్క్ ను బ్రాడ్‌ గేజ్ లోకి మార్చ‌డ‌మైంది.  ఈశాన్య ప్రాంత యువ‌త‌ ను ప‌టిష్ట ప‌ర‌చేందుకు నూత‌న విద్యా సంస్థ‌లు, క్రీడ‌ల‌ పై సైతం శ్ర‌ద్ధ వ‌హించ‌డ‌మైంది.  దీనికి తోడు ఈశాన్య ప్రాంతాల విద్యార్థుల కోసం నూత‌నం గా ఢిల్లీ లో, బెంగ‌ళూరు లో వ‌స‌తి గృహాల‌ ను కూడా ఏర్పాటు చేయ‌డ‌మైంది’’ అని ప్ర‌ధాన మంత్రి గుర్తు చేశారు.

 

మౌలిక స‌దుపాయాల అర్థం సిమెంటు, కంక‌ర‌ ల మిశ్ర‌ణం కాద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  దీనికి మాన‌వ పార్శ్వం జ‌త‌ప‌డుతుంద‌ని తెలిపారు.  ఇది  తామంటే ఎవ‌రో శ్ర‌ద్ధ వ‌హిస్తున్నారని ప్ర‌జ‌లు గ్రహించేట‌ట్లు చేస్తుంది అని ఆయ‌న అన్నారు.

 “బోగీబీల్ వంతెన వంటి ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ప‌నులు ఆగిపోయి ఉన్న‌టువంటి ఎన్నో ప్రాజెక్టుల పూర్తి కార‌ణం గా ల‌క్ష‌లాది ప్ర‌జ‌లు సంధానాన్ని పొందిన‌ప్పుడు, వారికి ప్ర‌భుత్వం ప‌ట్ల విశ్వాసం పెరిగిపోతుంది.  ఈ స‌ర్వ‌తోముఖ అభివృద్ధి వేర్పాటు ను అనుబంధం గా మల‌చ‌డం లో ఒక అతి పెద్ద పాత్ర ను పోషించింది.  అనుబంధం ఎప్పుడ‌యితే అంకురించిందో ప్ర‌జ‌లు ప్ర‌తి ఒక్క‌రి ప‌ట్ల స‌మ‌భావ‌న తో మెల‌గ‌డం మొద‌లు పెడ‌తారు.  ప్ర‌జ‌లు క‌ల‌సి ప‌ని చేయడానికి కూడా సిద్ధ ప‌డ‌తారు.  ప్ర‌జ‌లు క‌ల‌సి ప‌ని చేయ‌డానికి సిద్ధ‌ప‌డిన‌ప్పుడు అతి పెద్ద స‌మ‌స్య‌ లు సైతం ప‌రిష్కారం అవుతాయి’’ అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

Click here to read PM's speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi