ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 22న జోహన్నెస్ బర్గ్ లో బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ లీడర్స్ డైలాగ్ లో పాల్గొన్నారు.
బ్రిక్స్ బిజినెస్ ఫోరం చర్చల గురించి నేతలకు వివరించారు.
సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి సాంకేతిక ఆధారిత పరిష్కారాలతో సహా సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి భారతదేశం చేపడుతున్న వివిధ సంస్కరణలను ప్రధాన మంత్రి వివరించారు.
భారత అభివృద్ధి ప్రయాణంlలో భాగస్వాములు కావాలని బ్రిక్స్ బిజినెస్ లీడర్స్ ను ప్ర ధాన మంత్రి ఆహ్వానించారు.
స్థితిస్థాపక, సమ్మిళిత సరఫరా గొలుసుల ప్రాముఖ్యతను కోవిడ్ తెలియ చెప్పిందని, దీని కోసం పరస్పర విశ్వాసం
పారదర్శకత అవసరాన్ని కూడా నొక్కి చెప్పిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాలన్నీ కలిసి ప్రపంచ సంక్షేమానికి, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ కు గణనీయంగా దోహదం చేస్తాయని ఆయన
స్పష్టం చేశారు.