కరోనాకాలం లో అపూర్వమైన సేవల ను చేసిన స్వయం సహాయ సమూహాల కు చెందిన మహిళల ను ఆయనప్రశంసించారు
సోదరీమణులు వారి గ్రామాల ను సంవృద్ధి తో జతపరచగలిగేటటువంటి పరిస్థితులను, వాతావరణాన్ని ప్రభుత్వం నిరంతరం గా సృష్టిస్తోంది: ప్రధాన మంత్రి
భారతదేశంలో తయారు చేసిన ఆట వస్తువుల ను ప్రోత్సహించడం లో స్వయం సహాయ సమూహాల కు బోలెడంతపాత్ర ఉంది: ప్రధాన మంత్రి
నాలుగు లక్షలకు పైగా ఎస్ హెచ్ జిల కు దాదాపు గా 1625 కోట్ల రూపాయల మేరకు మూలధనీకరణ తోడ్పాటు సంబంధి నిధుల ను విడుదల చేసిన ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో పాల్గొన్నారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన- నేశనల్ రూరల్ లైవ్లీ హుడ్స్ మిశన్ (డిఏవై-ఎన్ ఆర్ ఎల్ ఎమ్) లో ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మహిళా స్వయం సహాయ సమూహాల సభ్యులతోను, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ తోను ఆయన ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో, వ్యవసాయ సంబంధిత జీవనోపాధుల సార్వజనీకరణ కు సంబంధించిన ఒక వివరణ తో కూడిన పుస్తకాన్ని, దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా ఎస్ హెచ్ జి సభ్యుల సాఫల్య గాథ ల సంకలన గ్రంథాన్ని ఆవిష్కరించారు.

నాలుగు లక్షల కు పైగా స్వయం సహాయ సమూహాల (ఎస్ హెచ్ జి స్ ) కు దాదాపు గా 1625 కోట్ల రూపాయల మేరకు మూలధనీకరణ కు సంబంధించిన తోడ్పాటు నిధుల ను కూడా ప్రధాన మంత్రి విడుదల చేశారు. దీనికి అదనం గా, ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ కు చెందిన పిఎమ్ఎఫ్ఎమ్ఇ పథకం లో భాగం గా ఉన్న 7500 ఎస్ హెచ్ జి సభ్యుల కు సీడ్ మనీ రూపం లో 25 కోట్ల రూపాయలను, మిశన్ లో ప్రోత్సాహాన్ని అందిస్తున్న 75 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ (ఎఫ్ పిఒస్) కు నిధుల రూపం లో 4.13 కోట్ల రూపాయల ను ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భం లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింహ్, ఆహార శుద్ధి పరిశ్రమ ల శాఖ కేంద్ర మంత్రి శ్రీ పశుపతి కుమార్ పారస్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రులు సాధ్వి నిరంజన్ జ్యోతి, శ్రీ ఫగ్గన్ సింహ్ కులస్తే, పంచాయతి రాజ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్, ఆహార శుద్ధి పరిశ్రమ ల శాఖ సహాయ మంత్రి శ్రీ ప్లహ్లాద్ సింహ్ పటేల్ లు కూడా హాజరయ్యారు.

ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కరోనా కాలం లో అపూర్వ సేవల ను అందించినందుకు స్వయం సహాయ సమూహాల కు చెందిన మహిళల ను ప్రశంసించారు. మాస్కుల ను, శానిటైజర్ లను తయారు చేయడం లోనూ, ఆపన్నుల కు ఆహారాన్ని అందించడంలోనూ, చైతన్యాన్ని వ్యాప్తి చేయడంలోనూ వారు అందించిన అసమానమైనటువంటి తోడ్పాటు ను ప్రధాన మంత్రి గుర్తించారు.

ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని ఆచరణ లోకి తీసుకు రావడం లో మహిళల లో నవ పారిశ్రామికత్వం తాలూకు పరిధి ని పెంచడానికి, వారు ఈ ప్రక్రియ లో మరింత ఎక్కువ గా పాలుపంచుకోవడానికి గాను ఈ రోజు న రక్షా బంధన్ పర్వదినాని కంటే ముందు 4 లక్షల కు ఎస్ హెచ్ జిల కు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయాన్ని అందించడమైందని ప్రధాన మంత్రి అన్నారు. స్వయం సహాయ సమూహాలు, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన.. ఇవి భారతదేశం గ్రామీణ ప్రాంతాల లో ఒక సరికొత్త క్రాంతి ని తీసుకు వచ్చాయని ఆయన అన్నారు. ఈ మహిళా స్వయం సహాయ సమూహాల ఉద్యమం గడిచిన ఆరేడేళ్లలో బాగా విస్తరించిందని కూడా ఆయన అన్నారు. ప్రస్తుతం దేశం అంతటా 70 లక్షల స్వయం సహాయ సమూహాలు ఉన్నాయని, ఈ సంఖ్య గత 6-7 సంవత్సరాల లో ఉన్న సంఖ్య తో పోలిస్తే మూడింతల కు పైబడిందని ఆయన తెలిపారు.

ఈ ప్రభుత్వం అధికారం లోకి రావడాని కన్నా ముందు కోట్ల కొద్దీ సోదరీమణుల కు బ్యాంక్ ఖాతా అంటూ ఏదీ లేకపోగా వారు బ్యాంకింగ్ వ్యవస్థ కు మైళ్ల దూరం ఆవల ఉండిపోయినటువంటి కాలం అంటూ ఒకటి ఉండేది అని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. ఈ కారణంగానే ప్రభుత్వం జన్ ధన్ ఖాతాల ను తెరచేందుకు పెద్ద ఎత్తున ప్రచార ఉద్యమాన్ని మొదలుపెట్టిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం 42 కోట్ల కు పైగా జన్ ధన్ ఖాతాలు ఉన్నాయి, మరి వాటిలో సుమారు 55 శాతం ఖాతా లు మహిళలవే అని ఆయన వివరించారు. బ్యాంకుల లో సులభం గా రుణాలు తీసుకోవడానికి వీలు గా బ్యాంకు ఖాతాల ను తెరవడం జరిగిందని ఆయన అన్నారు.

సోదరీమణుల కు నేశనల్ లైవ్లీహుడ్ మిశన్ లో భాగం గా ప్రభుత్వం అందించిన సొమ్ము ఇదివరకటి ప్రభుత్వం ఇచ్చిన దాని కంటే అనేక రెట్లు ఉందని ప్రధాన మంత్రి అన్నారు. హామీ లేనటువంటి దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల రుణాన్ని సైతం స్వయం సహాయ సమూహాల కు అందుబాటు లోకి తీసుకు రావడమైందని వెల్లడించారు. స్వయం సహాయ సమూహాలు కూడా బ్యాంకుల కు తిరిగి చెల్లింపులను జరిపే బాధ్యత ను గత ఏడు సంవత్సరాల లో ఘనమైన రీతిలో నెరవేర్చాయని ఆయన అన్నారు. బ్యాంకు రుణాల లో వసూలు కాని రుణాలు (ఎన్ పిఎ) గా మారిన రుణాలు సుమారు 9 శాతాని కి చేరిన కాలం అంటూ ఒకటి ఉండేదని, ప్రస్తుతం ఎన్ పిఎ 2-3 శాతం స్థాయికి దిగివచ్చిందన్నారు. స్వయం సహాయ సమూహాల లో సభ్యత్వాన్ని కలిగివున్న మహిళ ల నిజాయతీ ని ఆయన పొగడారు.

పూచీకత్తు ఏదీ లేకుండా స్వయం సహాయ సమూహాల కు లభ్యం అయ్యే రుణాల పరిమితి ని ప్రస్తుతం రెండింతలు చేసి, 20 లక్షల రూపాయల కు చేర్చడమైందని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు. మీ పొదుపు ఖాతాల ను రుణ ఖాతా తో ముడిపెట్టాలన్న షరతు ను సైతం తొలగించడమైందని ఆయన తెలిపారు. ఆ తరహా ప్రయాస లు అనేకం ముందుకు రావడం తో ఇక మీరు ఆత్మనిర్బరత ప్రచార ఉద్యమం లో మరింత ఉత్సాహం తో ముందుకు సాగిపోగలుగుతారు అని ఆయన అన్నారు.

స్వాతంత్య్రానికి 75 సంవత్సరాల కాలం ఆసన్నం అవుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ఇది కొత్త లక్ష్యాల ను ఏర్పరచుకొని, సరికొత్త శక్తి తో ముందడుగు వేయవలసిన కాలం అని ఆయన అన్నారు. సోదరీమణుల సామూహిక బలం సైతం ఇక ముందుకు సాగి పోవలసిందే అని ఆయన అన్నారు. మీ సోదరీమణులు అందరూ మీమీ గ్రామాల ను సంవృద్ధి తో జోడించగలిగే పరిస్థితుల ను, వాతావరణాన్ని ప్రభుత్వం నిరంతరం గా ఏర్పరుస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. వ్యవసాయం లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ రంగం లో మహిళా స్వయం సహాయ సమూహాల కు అంతు లేని అవకాశాలు ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు.

స్వయం సహాయ సంఘాలు సైతం ఈ నిధి నుంచి సహాయాన్ని స్వీకరించి, ఈ విధమైనటువంటి వ్యవసాయ ఆధారిత సదుపాయాల ను నెలకొల్పేందుకు వీలు గా ఒక ప్రత్యేకమైన విధి ని ఏర్పాటు చేయడం జరిగింది అని ఆయన అన్నారు. సమంజసమైన ధరల ను నిర్ణయించడం ద్వారా, ఇతరుల కు అద్దె కు ఇవ్వడం ద్వారా కూడా ఈ సదుపాయాల తాలూకు ప్రయోజనాన్ని సభ్యులందరూ పొందవచ్చు అని ఆయన వివరించారు.

నూతన వ్యవసాయ సంస్కరణ ల నుంచి మన రైతులు ఒక్కరే లబ్ధి ని పొందడం అని కాకుండా, స్వయం సహాయ సమూహాల కోసం పరిమితి అంటూ ఉండనటువంటి విధం గా అవకాశాల ను కూడా సృష్టించడం జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. స్వయం సహాయ సమూహాలు ఇక మీదట రైతుల వద్ద నుంచి నేరు గా కొనుగోళ్లు జరుపవచ్చు, కాయధాన్యాల వంటి ఉత్పత్తుల ను నేరుగా ఇళ్ల వద్దకు తీసుకుపోయి అందజేయవచ్చు అని ఆయన అన్నారు.

ప్రస్తుతం మీరు ఏ స్థాయి లో నిలవ చేయవచ్చు అనే దానికి ఎటువంటి ఆంక్ష లేదు అని ప్రధాన మంత్రి తెలిపారు. స్వయం సహాయ సమూహాల కు వ్యవసాయ క్షేత్రం నుంచి ఫలసాయాన్ని నేరు గా విక్రయించడం అనే ఐచ్ఛికం గాని, లేదా ఒక ఆహార శుద్ధి విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ తో విక్రయించడం అనే ఐచ్ఛికం గాని ఉంది అని ఆయన అన్నారు. ఆన్ లైన్ కంపెనీల తో సమన్వయాన్ని నెలకొల్పుకొని స్వయం సహాయ సమూహాలు వాటి ఉత్పత్తుల ను మంచి ప్యాకేజింగ్ లతో నగరాల కు ఇట్టే తరలించవచ్చు అని ఆయన సలహా ఇచ్చారు.

భారతదేశం లో తయారయిన ఆట వస్తువుల ను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది, మరి దీనికోసం చేతనైన అన్ని విధాలు గానూ సాయపడుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రత్యేకించి మన ఆదివాసీ ప్రాంతాల సోదరీమణులు సాంప్రదాయకం గా దీనితో అనుబంధాన్ని కలిగివున్నారు అనే సంగతి ని ఆయన గుర్తు కు తెచ్చారు. ఈ రంగం లో కూడా స్వయం సహాయ సమూహాలకు బోలెడన్ని అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

నేటి ప్రచార ఉద్యమం దేశాన్ని ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ బారి నుంచి విముక్తం చేయనుందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ విషయం లో స్వయం సహాయ సమూహాలు రెండు విధాలైన పాత్రల ను పోషించాలన్నారు. స్వయం సహాయ సమూహాలు ఒకసారి వాడే ప్లాస్టిక్ ను గురించిన చైతన్యాన్ని పెంచాలని, అంతేకాకుండా దీనికి ఒక ప్రత్యామ్నాయాన్ని ఇచ్చేందుకు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆన్ లైన్ గవర్నమెంట్ ఇ- మార్కెట్ ప్లేస్ తాలూకు పూర్తి ప్రయోజనాన్ని పొందవలసిందిగా కూడా ఆయన స్వయం సహాయ సమూహాల ను కోరారు. ప్రస్తుతం భారతదేశం లో మార్పు లు తీసుకు రావడం లో దేశాని కి చెందిన సోదరీమణుల కు, కుమార్తెల కు ముందడుగు వేయడానికి గల అవకాశాలు అధికం అవుతూ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్తు, నీరు, ఇంకా గ్యాస్ వంటి సౌకర్యాల ను సోదరీమణులు అందరికీ అందించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, టీకా, తదితర సోదరీమణుల, పుత్రిక ల అవసరాల ను తీర్చడం అనే విషయం లో ప్రభుత్వం సూక్ష్మ గ్రాహ్యత తో కృషి చేస్తోంది అని ఆయన చెప్పారు. ఈ కారణం గా మహిళల గౌరవం పెరగడం ఒక్కటే కాకుండా సోదరీమణుల, కుమార్తె ల విశ్వాసం కూడా వృద్ధి చెందుతోంది అని ఆయన అన్నారు.

స్వయం సహాయ సమూహాలు దేశ నిర్మాణం తాలూకు వాటి ప్రయాసల ను అమృత్ మహోత్సవ్ తో జతపరచాలి అని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. 8 కోట్ల మంది కి పైగా సోదరీమణుల ను, కుమార్తెల సామూహిక శక్తి తో అమృత్ మహోత్సవ్ ను సరికొత్త శిఖరాల కు తీసుకు పోవడం జరుగుతుందని ఆయన అన్నారు. సేవ చేయాలి అనేటటువంటి స్ఫూర్తి తో వారు ఏ విధం గా సహాయ పడగలరు అనే విషయాన్ని గురించి ఆలోచించాలి అని ఆయన మనవి చేశారు. మహిళల లో పోషకాహారం పట్ల జాగృతి కి సంబంధించిన ఒక ప్రచార ఉద్యమాన్ని నిర్వహించడం, వారి పల్లెల లో పరిశుభ్రత, నీటి సంరక్షణ, కోవిడ్ -19 టీకాల ను ఇప్పించేందుకు గాను ఒక ప్రచార ఉద్యమాన్ని నడపడం వంటి ఉదాహరణల ను ఆయన ప్రస్తావించారు. స్వయం సహాయ సమూహాల కు చెందిన మహిళ లు వారికి దగ్గర లో ఉన్న పాడి పరిశ్రమ ప్లాంటు ను, గోబర్ ప్లాంటు ను, సోలర్ ప్లాంటు ను సందర్శించి అక్కడి ఉత్తమ అభ్యాసాల ను నేర్చుకోవాలి అని ఆయన సూచించారు.

స్వయం సహాయ సమూహాల ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. అమృత్ మహోత్సవ్ తాలూకు సఫలత అనే సుధ వారి ప్రయత్నాల వల్లనే సర్వత్రా వ్యాపించగలుగుతుందని, మరి ఈ కారణం గా కలిగే లబ్ధి ని దేశం అందుకొంటుందని ఆయన అన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi