ఢిల్లీ-వడోదర ఎక్స్‌ప్రెస్‌వే జాతికి అంకితం
పీఎంఏవై-గ్రామీణ్ కింద నిర్మించిన 2.2 లక్షల ఇళ్ళు గృహ ప్రవేశానికి ప్రారంభం, పీఎంఏవై - అర్బన్ కింద నిర్మించిన గృహాల అంకితం
జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 9 ఆరోగ్య కేంద్రాలకు శంకుస్థాపన
ఐఐటీ ఇండోర్ అకడమిక్ భవనం అంకితం, క్యాంపస్‌లో హాస్టల్, ఇతర భవనాలకు శంకుస్థాపన
ఇండోర్‌లో మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌కు శంకుస్థాపన
"గ్వాలియర్ భూమి ఒక స్ఫూర్తి"
"డబుల్ ఇంజన్ తో మధ్యప్రదేశ్ లో రెట్టింపు అభివృద్ధి"
మధ్యప్రదేశ్‌ను భారతదేశంలోని మొదటి 3 అగ్ర రాష్ట్రాలకు తీసుకెళ్లాలని ప్రభుత్వ లక్ష్యం
"మహిళా సాధికారత అనేది ఓటు బ్యాంకు కోసం కాదు... జాతీయ పునర్నిర్మాణం, జాతీయ సంక్షేమమే లక్ష్యం"
"మోదీ గ్యారంటీ అంటే అన్ని హామీల నెరవేర్చె హామీ"
"ఆధునిక మౌలిక సదుపాయాలు, పటిష్టమైన శాంతిభద్రతలు రైతులకు, పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుస్తాయి"
"ప్రతి తరగతి, ప్రతి ప్రాంతానికి అభివృద్ధిని అందించడానికి మా ప్రభుత్వం అంకితం చేయబడింది"
"జిన్కో కోయి నహీ పుచ్తా, ఉన్కో మోడీ పూచ్తా హై, మోడీ పూజతా హై - ఎవరూ పట్టించుకోని వారిని మోడీ పట్టించుకుంటారు, మోడీ వారిని ఆరాధిస్తారు."

ఈరోజు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దాదాపు రూ. 19,260 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, ఇంకొన్నిటిని జాతికి అంకితం చేశారు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.  ఈ ప్రాజెక్టులలో ఢిల్లీ-వడోదర ఎక్స్‌ప్రెస్‌వే అంకితం, పీఎంఏవై కింద నిర్మించిన 2.2 లక్షల ఇళ్ళ గృహ ప్రవేశం, పీఎంఏవై-అర్బన్ కింద నిర్మించిన గృహాల అంకితం, జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 9 ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఐఐటీ   ఇండోర్ అకడమిక్ భవనాన్ని అంకితం చేయడం, క్యాంపస్‌లో హాస్టల్, ఇతర భవనాలకు, ఇండోర్‌లో మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్క్ కు శంకుస్థాపన చేయడం ఈ జాబితా లో కార్యక్రమాలు. 

 

గ్వాలియర్ భూమి శౌర్యానికి, ఆత్మగౌరవానికి, గర్వానికి, సంగీతానికి, రుచికి,  ఆవపిండికి ప్రతీక అని సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఈ భూమి దేశానికి ఎంతో మంది విప్లవకారులను తయారు చేసిందని, అలాగే సాయుధ దళాల్లో పని చేసే వారిని కూడా తయారు చేసిందన్నారు. గ్వాలియర్ భూమి పాలక విధానాలను, నాయకత్వాన్ని అందించిందని అన్నారు. రాజమాత విజయ రాజే సింధియా, కుషాభౌ ఠాక్రే,  అటల్ బిహారీ వాజ్‌పేయిలను ఈ సందర్బంగా ప్రధాని ఉదహరించారు. "గ్వాలియర్ భూమి స్వతహాగా ఒక ప్రేరణ", దేశం కోసం నేల పుత్రులు తమ ప్రాణాలను త్యాగం చేశారని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.

ఈ తరం ప్రజలకు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొనే అవకాశం రానప్పటికీ భారతదేశాన్ని అభివృద్ధి చేసి సుసంపన్నంగా మార్చే బాధ్యత మనపై ఖచ్చితంగా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ఏయే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నామో, వేటిని జాతికి అంకితం చేస్తున్నామో ప్రస్తావిస్తూ, ఏడాది లో   అనేక ప్రభుత్వాలు తీసుకురా లేకపోయిన వీటిని తమ ప్రభుత్వం ఒక్క రోజులో ఇన్ని ప్రాజెక్టులను తీసుకువస్తోందని ప్రధాని అన్నారు.

దసరా దీపావళి, ధన్‌తేరస్‌లకు ముందు దాదాపు 2 లక్షల కుటుంబాలు గృహ ప్రవేశం చేస్తున్నాయని, అనేక కనెక్టివిటీ ప్రాజెక్టులను అందిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. ఉజ్జయినిలోని విక్రమ్ ఉద్యోగ్‌పురి, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ మధ్యప్రదేశ్ పారిశ్రామిక వృద్ధికి ఊతమిస్తాయని ఆయన అన్నారు. గ్వాలియర్ ఐఐటీలో కొత్త ప్రాజెక్టులను ఆయన ప్రస్తావించారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కింద విదిషా, బైతుల్, కట్నీ, బుర్హాన్‌పూర్, నార్సింగ్‌పూర్, దామోహ్, షాజాపూర్‌లలో కొత్త ఆరోగ్య కేంద్రాల గురించి ఆయన మాట్లాడారు.

 

అన్ని అభివృద్ధి ప‌థ‌కాల కోసం డబుల్ ఇంజ‌న్ ప్ర‌భుత్వం చేస్తున్న కృషిని ప్ర‌ధాన మంత్రి అభివ‌ర్ణించారు. అక్కడ ఢిల్లీ ఇక్కడ భోపాల్‌లో ప్రజలకు అంకితమైన అదే సూత్రాలతో కూడిన ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధిలో వేగం పెరుగుతుందని ఆయన నొక్కి చెప్పారు. అందుకే, మధ్యప్రదేశ్ ప్రజలు డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారని ప్రధాని అన్నారు. “డబుల్ ఇంజన్ అంటే మధ్యప్రదేశ్ రెట్టింపు అభివృద్ధి” అని శ్రీ మోదీ అన్నారు.

గత కొన్ని సంవత్సరాలలో, ప్రభుత్వం మధ్యప్రదేశ్‌ను ‘బిమారు రాజ్య’ (వెనుకబడిన రాష్ట్రం) నుండి దేశంలోని మొదటి 10 రాష్ట్రాలలో ఒకటిగా మార్చిందని ప్రధాని ఉద్ఘాటించారు. "ఇక్కడి నుండి", "ప్రభుత్వం మధ్యప్రదేశ్‌ను భారతదేశంలోని మొదటి 3 రాష్ట్రాలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది." మధ్యప్రదేశ్‌ను మొదటి 3 రాష్ట్రాల స్థానానికి చేర్చే బాధ్యత కలిగిన పౌరులుగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన కోరారు.

ప్ర‌పంచం త‌న భ‌విష్య‌త్తును భార‌త‌దేశంలోనే చూస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. భారత్ కేవలం 9 ఏళ్లలో 10వ స్థానం నుంచి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. భారతదేశం సాగిస్తున్న ఈ పయనంపై నమ్మకం లేని వారిని ఆయన విమర్శించారు. "రాబోయే ప్రభుత్వ హయాంలో, భారతదేశం ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలోకి వస్తుందని మోడీ హామీ" అని అన్నారు.

 

“పేదలు, దళితులు, వెనుకబడిన, గిరిజన కుటుంబాలకు మోదీ పక్కా గృహాలను హామీ ఇచ్చారు”, దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల కుటుంబాలకు పక్కా గృహాలు అందజేశామని ప్రధాని ఉద్ఘాటించారు. మధ్యప్రదేశ్‌లో, నిరుపేద కుటుంబాలకు ఇప్పటివరకు లక్షలాది గృహాలను అందజేశామని, ఈరోజు కూడా అనేక గృహాలను ప్రారంభించామని ప్రధాని చెప్పారు. గత ప్రభుత్వాన్ని ఎండగడుతూ, మోసపూరిత పథకాలు, పేదలకు పంపిణీ చేసిన గృహాల నాణ్యత తక్కువగా ఉన్నందున ప్రధాన మంత్రి విచారం వ్యక్తం చేశారు. అందుకు భిన్నంగా, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అందజేసే ఇళ్లను లబ్ధిదారుల అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానంతో పురోగతిని పర్యవేక్షించిన తర్వాత నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని ప్రధాని చెప్పారు. ఇళ్లలో మరుగుదొడ్లు, విద్యుత్, కుళాయి నీటి కనెక్షన్, ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌లు ఉన్నాయని ఆయన చెప్పారు. నేటి జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులపై ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ గృహాలకు నీటిని సరఫరా చేయడంలో ఇది సహాయపడుతుందని అన్నారు.

"మహిళా సాధికారత అనేది ఓటు బ్యాంకు గా కాకుండా, జాతీయ పునర్నిర్మాణం,  జాతీయ సంక్షేమం  లక్ష్యం" అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. ఇటీవల ఆమోదించిన ‘నారీశక్తి వందన్ ఆధ్నియం’ గురించి ప్రస్తావిస్తూ, “మోదీ హామీ అంటే అన్ని హామీల నెరవేర్పు హామీ” అని ప్రధాని అన్నారు. దేశాభివృద్ధి ప్రయాణంలో మాతృశక్తి మరింతగా భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు.
"ఆధునిక మౌలిక సదుపాయాలు, పటిష్టమైన శాంతిభద్రతలు రైతులకు, పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుస్తాయి", "అయితే రాష్ట్రంలో అభివృద్ధి వ్యతిరేక ప్రభుత్వం ఉనికితో రెండు వ్యవస్థలు కుప్పకూలాయి" అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. అభివృద్ధి నిరోధక ప్రభుత్వం కూడా నేరాలకు, బుజ్జగింపులకు దారితీస్తుందని, తద్వారా గూండాలు, నేరగాళ్లు, అల్లరి మూకలు, అవినీతిపరులకు స్వేచ్ఛనివ్వడం వల్ల మహిళలు, దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి అభివృద్ధి వ్యతిరేక అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మధ్యప్రదేశ్ ప్రజలను ప్రధాని కోరారు.

 

అణగారిన వారికి ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వ విధానాన్ని ప్రస్తావిస్తూ, “ప్రతి తరగతి, ప్రతి ప్రాంతానికి అభివృద్ధిని అందించడానికి మా ప్రభుత్వం అంకితం చేయబడింది. ఎవరూ పట్టించుకోని వారిని మోదీ పట్టించుకుంటారు, మోదీ వారిని ఆరాధిస్తారు. ఆధునిక పరికరాలు, సాధారణ సంకేత భాష అభివృద్ధి వంటి దివ్యాంగుల కోసం చర్యలను ఆయన ప్రస్తావించారు. ఈరోజు గ్వాలియర్‌లో దివ్యాంగ్ అథ్లెట్ల కోసం కొత్త క్రీడా కేంద్రాన్ని ప్రారంభించారు. అదే విధంగా దశాబ్దాలుగా చిన్న రైతులు నిర్లక్ష్యానికి గురవుతున్నారన్నారు. ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ద్వారా దేశంలోని ప్ర‌తి చిన్న రైతు ఖాతాల‌కు ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు రూ.28 వేలు పంపింద‌ని ప్ర‌ధాన మంత్రి తెలియ జేశారు. మన దేశంలో ముతక ధాన్యాలు పండించే చిన్న రైతులు 2.5 కోట్ల మంది ఉన్నారు. “ఇంతకుముందు ముతక ధాన్యాలు పండించే చిన్న రైతుల గురించి ఎవరూ పట్టించుకోలేదు. భారతీయ ఆహారానికి మిల్లెట్‌కు గుర్తింపునిచ్చి, ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌లకు తీసుకెళ్తున్నది మన ప్రభుత్వమే” అని ఆయన అన్నారు. 

కుమ్హర్, లోహర్, సుతార్, సునార్, మలాకర్, దర్జి, ధోబీ, చెప్పులు కుట్టేవారు, క్షురకలకు ప్రయోజనం చేకూర్చే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. సమాజంలోని ఈ వర్గం వెనుకబడిపోయిందని ప్రధాన మంత్రి ఎత్తిచూపుతూ, “వారిని ముందుకు తీసుకురావడానికి మోడీ భారీ ప్రచారాన్ని ప్రారంభించారు” అని అన్నారు. శిక్షణకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, ఆధునిక పరికరాల కోసం రూ.15వేలు అందజేస్తుందని తెలిపారు. లక్షలాది రూపాయల చౌకగా రుణాలు అందజేస్తున్నారని పేర్కొన్నారు. ‘విశ్వకర్మల రుణానికి మోదీ గ్యారంటీ తీసుకున్నారు’ అని ఆయన అన్నారు.

డబుల్ ఇంజన్ ప్రభుత్వం  భవిష్యత్తు-ఆధారిత విధానాన్ని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.  మధ్యప్రదేశ్‌ను దేశంలోని అగ్ర రాష్ట్రాలలోకి తీసుకురావడానికి నిబద్ధతను పునరుద్ఘాటించారు. 

 

ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్రమంత్రులు శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, డాక్టర్ వీరేంద్ర కుమార్, జ్యోతిరాదిత్య సింధియా, పార్లమెంట్ సభ్యులు, మధ్యప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi